వ్యాగన్ఆర్ 7-సీటర్ కారును పరీక్షించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ 7-సీటర్ కారును ఇండియాలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే మారుతి ఇటీవల వ్యాగన్ఆర్ 7-సీటర్ వేరియంట్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుంది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ 7-సీటర్ కారును ఇండియాలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే మారుతి ఇటీవల వ్యాగన్ఆర్ 7-సీటర్ వేరియంట్ కారును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

వ్యాగన్ఆర్ 7-సీటర్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌కు సంభందించిన డిజైన్ మరియు ఫీచర్లు రహస్యంగా తీసిన ఫోటోల ద్వారా వెల్లడయ్యాయి. మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్ గురించి పూర్తి వివరాల

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

తాజాగా పరీక్షించబడిన వ్యాగన్ఆర్ 7-సీటర్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాగన్ఆర్ తరహా ఎత్తైన బాడీ డిజైన్‌ోలో ఉంది. 7-సీటర్ వ్యాగన్ఆర్ ఎక్ట్సీరియర్‌లో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు సులభంగా తెరచి మరియు మూసివేసే స్లైడింగ్ డోర్లు ఉన్నాయి.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

సరికొత్త మారుతి వ్యాగన్‌ఆర్‌లోని ప్రధాన హైలెట్ ఇది 7-సీటింగ్ లౌఔట్లో వస్తుండటం. తాజాగా రివీల్ అయిన ఫోటోలు 5+2 సీటింగ్ లౌఔట్ రివీల్ చేశాయి. ఇంటీరియర్ ఫోటోలను పరిశీలిస్తే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు పొందికగా రూపొందించిన డ్యాష్‌బోర్డును గుర్తించవచ్చు.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

సరికొత్త మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్ కారులో సాంకేతికంగా పెట్రోల్ ఇంజన్‌ మాత్రమే పరిచయం అయ్యే అవకాశం ఉంది. సరికొత్త స్విఫ్ట్ మరియు న్యూ డిజైర్ కార్లలో ఉన్నటువంటి అదే 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 90బిహెచ్‌‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

ఏడు మంది ప్రయాణించే కెపాసిటి గల 7-సీటర్ మారుతి వ్యాగన్ఆర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో సుజుకి సోలియో పేరుతో అమ్ముడవుతోంది. ఇండియన్ మార్కెట్లో ఈ వ్యాగన్ఆర్ 7-సీటర్ ఎర్టిగా ఎమ్‌పీవీ క్రింది స్థానాన్నిభర్తీ చేస్తుంది మరియు విపణిలో ఉన్న డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీకి గట్టి పోటీనిస్తుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

తాజాగా అందుతున్న సమచారం మేరకు, సరికొత్త మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్ ఉత్పత్తిని సెప్టెంబర్ 2018 నుండి చేపట్టనున్నట్లు తెలిసింది. అంతే కాకుండా, దీనిని ఏడాది పండుగ సీజన్‌లో అధికారికంగా విడుదల చేయనుంది. వ్యాగన్ఆర్ 7-సీటర్ వెర్షన్ మారుతి ఇండియాకు అత్యంత కీలకమైన మోడల్.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 7-సీటర్ ఇండియన్ మార్కెట్‌కు మొదటిసారిగా పరిచయం అవుతున్న మోడల్. సరికొత్త డిజైన్ ఫిలసఫీలో నూతన ఫీచర్లతో, అన్నింటి కంటే ప్రతి మిడిల్-క్లాస్ ఫ్యామిలీని ఆకట్టుకునే విధంగా ఏడు మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్లో రూపొందించింది. ఏదేమైనప్పటికీ, చూడటానికి అచ్చం వ్యాగన్ఆర్ మోడల్‌నే పోలి ఉంటుంది.

మారుతి వ్యాగన్ఆర్ 7-సీటర్

1. ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2. మైలేజ్ ప్రియుల కోసం ఈ ఏడాది విడుదలవుతున్న కొత్త కార్లు

3. రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

4. స్కూటర్ ధరకే లభిస్తున్న బెస్ట్ సెకండ్ హ్యాండ్ కార్లు

Source: Rushlane

Most Read Articles

English summary
Read In Telugu: Maruti WagonR (Suzuki Solio) 7-Seater Spied In India; New Spy Shots Of Interior And Exterior Design
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X