ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

ఫోర్డ్ మోటార్స్ ఇండియా ఇప్పుడు ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును సీఎన్‌జీ వేరియంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఇటీవల ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుబడింది.

By Anil Kumar

ఈ మధ్య కాలంలో హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న మోడళ్లలో ఫోర్డ్ ఫిగో ఒకటి. దీంతో డ్రైవింగ్ ఫీల్ కోరుకునే కస్టమర్ల కోసం ఫిగో కారును మరింత స్పోర్టివ్ స్టైల్లో ఫిగో ఎస్ పేరుతో మార్కెట్లోకి లాంచ్ చేసింది. అంతే కాకుండా ఫిగో ఆధారిత క్రాసోవర్ కారు ఫ్రీస్టైల్‌ను కూడా విడుదల చేసింది. ఫిగో కారుకు కొనసాగింపుగా తీసుకొచ్చిన ఫిగో ఎస్ మరియు ఫ్రీస్టైల్ మోడళ్లు ఫిగో ఎలాంటి సక్సెస్ అందుకుందో చెబుతాయి.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

అయితే, ఫోర్డ్ మోటార్స్ ఇండియా ఇప్పుడు ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును సీఎన్‌జీ వేరియంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఇటీవల ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ పట్టుబడింది.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

ఫోర్డ్ ఫిగో ప్రస్తుతం 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. కానీ ఫిగోలో సీఎన్‌జీ ఇంజన్ వేరియంట్ ఇప్పటి లేదు. అయితే, తాజాగా సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తుండటంతో త్వరలో సీఎన్‌జీ ఫిగో మోడళ్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

కొత్త తరం ఫోర్డ్ ఫిగో కారును ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా ఆవిష్కరించారు. అయితే, ఈ న్యూ జనరేషన్ ఫోర్డ్ ఫిగో ఇండియాలో ఇంకా విడుదల కావాల్సి ఉంది. అంతర్జాతీయ విపణిలో కెఎ+ (KA+) పేరుతో అందుబాటులో న్యూ వెర్షన్ ఫిగో కారులో మెకానికల్ మరియు కాస్మొటిక్ పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

కొత్త తరం ఫోర్డ్ ఫిగోలో వస్తున్న ప్రధాన హైలెట్ ఏమిటంటే ఇందులో డ్రాగన్ సిరీస్ నుండి సేకరించిన అధునాతన 1.2-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 96బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో కూడా ఇదే ఇంజన్ ఉంది.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

కొత్త తరం ఫోర్డ్ ఫిగో డీజల్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో మునుపటి 1.5-లీటర్ డీజల్ ఇంజన్ యధావిధిగా వస్తోంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

సరికొత్త ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ ఎక్ట్సీరియర్‌లో క్రోమ్ హనీకాంబ్ గ్రిల్, నూతన బంపర్లు మరియు పలు రకాల అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్, అధునాతన హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌ వస్తున్నాయి. వీటితో పాటు కాస్మొటిక్ మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎన్నో కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ప్రత్యేకించి, ఫోర్డ్ అభిృద్ది చేసిన సింక్3 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.

ఫిగో సీఎన్‌జీ వేరియంట్‌ను పరీక్షిస్తున్న ఫోర్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విక్రయాల పరంగా ఫోర్డ్ ఇండియా ఇప్పుడు మంచి ఫలితాలు సాధిస్తోంది. ఫిగో, ఫ్రీస్టైల్ మరియు ఇకోస్పోర్ట్ వంటి మోడళ్లు సేల్స్ వాటా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఫోర్డ్ వద్ద ఉన్న ఉత్పత్తులకు కొనసాగింపుగా, ఫిగో హ్యాచ్‌బ్యాక్ కారును సీఎన్‌జీ ఇంజన్ వేరియంట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది.

తాజా ఆటోమొబైల్ వార్తల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Source: TeamBHP

Most Read Articles

English summary
Read In Telugu: New Ford Figo CNG Variant Spotted Testing In India — Launch To Happen Soon?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X