కొత్త తరం బ్రియోకు బ్రేకులు వేసిన హోండా మోటార్స్

హోండా తమ బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను ఇప్పుడప్పుడే పరిచయం అవకాశం లేనట్లు పేర్కొంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టే విషయంలో ఈ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రక్కనపెట్టినట్లు తెలిపిం

By Anil

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తొలిసారిగా 2011లో బ్రియో హ్యాచ్‌బ్యాక్ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సిటీ కారు తరహాలోనే బ్రియో కూడా ఎంతో మంది ఇండియన్స్ హృదయాలను దోచుకుంటుందని హోండా భావించింది. అయితే, దీనికి ఆశించిన ఆదరణ లభించలేదు. కానీ, బ్రియో ఆధారంగా వచ్చిన అమేజ్ కాంపాక్ట్ సెడాన్ బ్రియో కంటే మంచి ఫలితాలు సాధించింది.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

హోండా మోటార్స్‌కు అమేజ్ మంచి ఫలితాలు సాధించిపెట్టడంతో సెకండ్ జనరేషన్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. అయితే, అమేజ్ కంటే ముందుగా పరిచయం అయిన బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను మాత్రం సెకండ్ జనరేషన్‌ వెర్షన్‌గా ఆవిష్కరించలేదు.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

ఇదే విషయాన్ని ఓ ఆన్‌లైన్ మీడియా ప్రస్తావిస్తూ, హోండా తమ బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను ఇప్పుడప్పుడే పరిచయం అవకాశం లేనట్లు పేర్కొంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టే విషయంలో ఈ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రక్కనపెట్టినట్లు తెలిపింది.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

హోండా గత ఏడాది విడుదల చేసిన డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీకి మంచి డిమాండ్ లభించడంతో ఇప్పుడు ప్రత్యేకించి ఎస్‌యూవీ మీద దృస్టి సారిస్తోంది. అంతే కాకుండా సెడాన్ సెగ్మెంట్ మీద కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలిసింది.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ యోయిచినో యుయెనో మీడియాతో మాట్లాడుతూ, భారత్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ శరవేగంగా అభివృద్ది చెందుతోంది. ఈ నేపథ్యంలోనే స్మాల్ కార్ సెగ్మెంట్‌ను ప్రక్కనపెట్టి పలు విభిన్న ఎస్‌యూవీ మోడళ్లను ఇండియన్ మార్కెట్ కోసం పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఆధారిత సబ్-4-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. అందు కోసం అమేజ్‌ను డెవలప్ చేసిన 2యుఎ కోడ్ పేరున్న ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నారు.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

చిన్న ఎస్‌యూవీ మరియు సెడాన్ కార్లతో పాటు కొత్త తరానికి చెందిన సిఆర్-వి, హెఆర్-వి, సివిక్ మరియు అకార్డ్ వంటి ఖరీదైన ప్రీమియమ్ మోడళ్లను బ్రాండ్ వ్యాల్యూ పెంచడానికి మరియు అమేజ్, సిటి మరియు డబ్ల్యూఆర్-వి మోడళ్లను అధిక సంఖ్యలో సేల్స్ సాంధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు.

హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం హోండా బ్రియో ఆశించిన సేల్స్ సాధించడంలో విఫలమవుతోంది. హోండా బ్రియో విక్రయాలు పూర్తిగా పడిపోగా, బిఆర్-వి సేల్స్ సగటున 800 నుండి 1000 యూనిట్ల సంఖ్యలోనే అమ్ముడవుతోంది. కాబట్టి ఈ రెండు మోడళ్ల ఉత్పత్తిని హోండా ఈ సమయంలోనైనా నిలిపేసే అవకాశం ఉంది.

  • హోండా నుండి వితారా బ్రిజా, నెక్సాన్ ఎస్‍‌యూవీలకు పోటీగా వస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ
  • హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    హోండా మోటార్స్ గత కొన్నేళ్ల నుండి ఇండియన్ మార్కెట్లో తన వాటానా కొద్ది కొద్దిగా కోల్పోతోంది. ప్రస్తుతం భారతదేశపు నాలుగవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో సేల్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్న సెగ్మెంట్ల మీద దృష్టి సారిస్తోంది, అంతే కాకుండా హోండా ఫెయిల్యూర్‌కు కారణమవుతున్న బ్రియో హ్యాచ్‌బ్యాక్ మరియు బిఆర్-వి ఎస్‌యూవీలను మార్కెట్ నుండి తొలగించే అవకాశాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: New-Generation Honda Brio Not Coming To India Anytime Soon
Story first published: Saturday, February 17, 2018, 16:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X