మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

మారుతి సుజుకి తమ సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సియాజ్ విడుదల నేపథ్యంలో మారుతి సుజకి బృందం దీనికి రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహిస్త

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తమ సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ కారును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సియాజ్ విడుదల నేపథ్యంలో మారుతి సుజకి బృందం దీనికి రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహిస్తోంది. తుది దశ పరీక్షల్లో ఉన్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఫీచర్లు లీక్ అయ్యాయి.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో ముందు మరియు వెనుక వైపున అప్‌డేట్ డిజైన్ అంశాలు వచ్చాయి. దాంతో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి సియాజ్ కంటే చాలా కొత్తగా ఉంది. 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఫ్రంట్ డిజైన్‌లో స్లోపింగ్ ఫ్రంట్ బానెట్, చిన్న పరిమాణంలో ఉన్న గ్రిల్, రీడిజైన్ చేయబడిన స్వెప్ట్ బ్యాక్ హెడ్‌ల్యాంప్స్ మరియు అప్‌డేటెడ్ ఫ్రంట్ బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో అవే మునుపటి మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు ఎలాంటి మార్పులు జరగని అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో అప్‌డేటెడ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మినహా అచ్చం మునుపటి సియాజ్‌ రియర్ డిజైన్‌నే పోలి ఉంది.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కూడా దాదాపు మునుపటి సియాజ్ మోడల్ తరహాలోనే ఉంది. కానీ, ఇంటీరియర్ ఫోటోను స్పష్టంగా గమనిస్తే ఇందులో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను గుర్తించవచ్చు. క్యాబిన్‌లో 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్ జెటా వేరియంట్లో రానుంది. అయితే, ఆల్ఫా వేరియంట్ సియాజ్ ఫేస్‌లిఫ్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తోంది. డ్యాష్‌బోర్డ్ ఓవరాల్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో సాంకేతికంగా మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని సరికొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ భర్తీ చేయనుంది. డీజల్ వేరియంట్ సియాజ్ అదే మునుపటి 1.3-లీటర్ డీజల్ ఇంజన్ సుజుకి వారి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో లభ్యం కానుంది.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

ట్రాన్స్‌‌మిషన్ పరంగా మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసందానంతో ఎంచుకోవచ్చు. అంతే కాకుండా ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లో లభ్యమవుతున్న 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌కు బదులుగా సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయాలని భావిస్తోంది.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏడాది కాలంగా విపణిలో మిడ్ సైజ్ సెడాన్ కార్లకు డిమాండ్ ఎక్కువయ్యింది. ఈ నేపథ్యంలో గత ఏడాది హోండా మరియు హ్యుందాయ్ కంపెనీలు తమ కొత్త తరం సిటీ మరియు వెర్నా కార్లను లాంచ్ చేసింది. అదనంగా టయోటా కూడా ఈ విపణిలోకి యారిస్ సెడాన్‌తో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

మళ్లీ పట్టుబడిన మారుతి సియాజ్ ఫేస్‍‌లిఫ్ట్: ఈసారి ఇంటీరియర్‌ రివీల్

మారుతి సుజుకి సియాజ్ విడుదలైనప్పటి నుండి భారీ మార్పులకు గురికాలేదు. దీంతో పోటీదారులను ఎదుర్కునేందుకు సియాజ్ సెడాన్‌కు ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా మార్పులు చేర్పులు నిర్వహించి నూతన ఫీచర్లు మరియు ఇంజన్ జోడింపుతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Spy Image Courtesy: Twitter

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift Spotted Again — Interior Revealed
Story first published: Friday, June 8, 2018, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X