తుది దశ పరీక్షల్లో మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి తమ 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మిడ్ సైజ సెడాన్ కారు విడుదలకు కసరత్తులు ప్రారంభించింది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌కు ఇండియన్ రోడ్ల మీద తుది దశ పరీక్షలు జరుపుతోంది.

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మిడ్ సైజ సెడాన్ కారును విడుదలకు కసరత్తులు ప్రారంభించింది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌కు ఇండియన్ రోడ్ల మీద తుది దశ పరీక్షలు జరుపుతోంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

విడుదలకు పూర్తి స్థాయిలో సిద్దమైన సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను కేవలం లోగో కనబడకుండా టెస్టింగ్ నిర్వహించారు. సియాజ్ డిజైన్ మరియు ఫీచర్లతో పాటు విడుదల మరియు ఇతర వివరాలు చూద్దాం రండి...

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ నెక్సా బ్లూ పెయింట్ స్కీమ్‌లో పట్టుబడింది. లోగో మరియు బ్యాడ్జింగ్ గుర్తించడానికి వీల్లేకుండా టేపుతో కప్పేశారు. అయితే, చూడటానికి ఇది సియాజ్ టాప్ ఎండ్ ఆల్ఫా వేరియంట్ అని తెలుస్తోంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యేనాటికి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేయాలని మారుతి సుజుకి భావిస్తోంది. 2018 ఫేస్‌లిఫ్ట్ సియాజ్ అప్‌డేటెడ్ ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు నూతన ఇంజన్‌తో రానుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

డిజైన్ పరంగా ముందు వైపున మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో రీడిజైన్ చేయబడిన గ్రిల్, కొత్తగా రూపొందించిన హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎయిర్ డ్యామ్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ సీ-ఆకారంలో ఉన్న క్రోమ్ ఎలిమెంట్స్ జోడింపు గల ఫ్రంట్ బంపర్ ఉంది. ప్రస్తుతం ఉన్న సియాజ్‌తో పోల్చుకుంటే ఇందులో గుర్తించదగిన మార్పులే చోటు చేసుకున్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో చోటు చేసుకున్న ఇతర మార్పుల్లో మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ కీలకం. క్రోమ్ హ్యాండిల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటి అంశాలను మునుపటి సియాజ్ నుండి యథావిధిగా సేకరించారు. కారుకు వెనుక వైపున రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు న్యూ బంపర్ ఉన్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా సియాజ్ ఫేస్‌లిఫ్ట్ 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ బదులుగా సరికొత్త 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. అయితే, మునుపటి 1.3-లీటర్ డీజల్ ఇంజన్ అలాగే హైబ్రిడ్ టెక్నాలజీతో కొనసాగుతుంది.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

ట్రాన్స్‌మిషన్ పరంగా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో సరికొత్త ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేసే అవకాశం ఉంది. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ప్రీమియం ఫీల్ పెంచేందుకు డ్యాష్‌బోర్డ్ థీమ్ మరియు సీట్ అప్‌హోల్‌స్ట్రే పరంగా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. 2018 సియాజ్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్ పరంగా కీలకమైన మార్పులతో పాటు సరికొత్త పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం కానుంది.

మా రుతి కంపెనీకి సియాజ్ అత్యంత కీలతమైన మోడల్. దేశీయంగా ఉన్న మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, టయోటా యారిస్, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift Spotted Completely Undisguised — Launch Soon
Story first published: Monday, June 25, 2018, 18:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X