మారుతి సుజుకి తరువాత విడుదల చేసే కారు ఇదే

Written By:

మారుతి సుజుకి తమ నెక్ట్స్ మోడల్‌గా విపణిలోకి విడుదల చేయనున్న 2018 మారుతి వ్యాగన్ఆర్ కారుకు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో రహస్యంగా పరీక్షిస్తున్న హ్యాచ్‌బ్యాక్ 2018 మారుతి వ్యాగన్ఆర్ కారుగా గుర్తించడం జరిగింది.

మారుతి సుజుకి తమ అప్‌డేటెడ్ 2018 వ్యాగన్ఆర్ కారును భారీ మార్పు చేర్పులతో ఈ ఏడాది చివరి నాటికి విపణిలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

డిజైన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఎత్తైన అదే టాల్ బాయ్ బాడీ డిజైన్ యధావిథిగా ఇందులో వచ్చింది. నిర్మాణ పరమైన సామర్థ్యం కోసం ఛాసిస్ పరంగా స్వల్ప అప్‌డేట్స్ జరిగాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతికంగా బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అందిస్తోంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

మునుపటి తరం వ్యాగన్ఆర్ కార్ల తరహాలో తేలికపాటి క్యాబిన్ మరియు విశాలమైన అద్దాలు ఉన్నాయి. అయితే, పాత వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే రియర్ మిర్రర్ కొద్దిగా చిన్నగా ఉన్నట్లు అనిపిస్తుంది. రియర్ డిజైన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్స్ రియర్ విండ్ స్క్రీన్ వేరు చేస్తూ ఇవ్వబడ్డాయి.

2018 మారుతి వ్యాగన్ఆర్

మునుపటి తరం వ్యాగన్ఆర్ కార్ల తరహాలో తేలికపాటి క్యాబిన్ మరియు విశాలమైన అద్దాలు ఉన్నాయి. అయితే, పాత వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే రియర్ మిర్రర్ కొద్దిగా చిన్నగా ఉన్నట్లు అనిపిస్తుంది. రియర్ డిజైన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్స్ రియర్ విండ్ స్క్రీన్ వేరు చేస్తూ ఇవ్వబడ్డాయి.

2018 మారుతి వ్యాగన్ఆర్

సరికొత్త 2018 వ్యాగన్ఆర్ అదే మునుపటి ఇంజన్ ఆప్షన్‌లో లభించనుంది. మారుతి సుజుకి అభివృద్ది చేసిన 1.0-లీటర్ మూడు సిలిండర్ల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యంకానుంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

కొత్త తరం మారుతి వ్యాగన్ఆర్ కారుతో పాటు, వ్యాగన్ఆర్ ఆధారిత 7-సీటర్ ఎమ్‌పీవీని కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిని కూడా మారుతి సుజుకి పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించింది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

2018 మారుతి వ్యాగన్ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్. మారుతి వ్యాగన్ఆర్ కారును దేశీయంగా పరిచయం చేసినప్పటి నుండి 20 లక్షల యూనిట్లకు పైగా వ్యాగన్ఆర్ కార్లు అమ్ముడయ్యాయి.

వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ సేల్స్ పెంచుకోవడానికి ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులకు గురవుతున్న వ్యాగన్ఆర్ తన విజయాన్ని యధావిథిగా కొనసాగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2018 మారుతి వ్యాగన్ఆర్

1.బాలెనో ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

2.హ్యుందాయ్ క్రెటాకు పోటీని సిద్దం చేసిన మహీంద్రా

3. విరాట్ ఏమిటా తొందర!!

4.ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్‌లకు పోటీగా మహీంద్రా సిద్దం చేసిన ఎస్‌యూవీ

5.ఇండియన్ రోడ్ల మీద సమ్మర్ డ్రైవింగ్ కోసం 9 సేఫ్టీ టిప్స్

Picture Courtesy: Speedhounds

English summary
Read In Telugu: New 2018 Maruti Suzuki WagonR Spied Testing In India Ahead Of Launch
Story first published: Tuesday, April 17, 2018, 21:35 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark