2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

టయోటా కిర్లోస్కర్ ఇండియా విపణిలోకి 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్ కారును విడుదల చేసింది. టయోటా మోటార్స్ సరికొత్త 2018 క్యామ్రీ హైబ్రిడ్ కారును రూ. 37.22 లక్షలు ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో ప్రవేశపెట్టింది. 2018 క్యామ్రీ హైబ్రిడ్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా అప్‌డేట్స్‌తో పాటు అదనపు ఫీచర్లు కూడా వచ్చాయి.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ మీద ఓ లుక్కేసుకుందాం రండి...

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

ఓవరాల్‌గా 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ డిజైన్ అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. హైబ్రిడ్ సెడాన్‌లో క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, విశాలమైన ఎయిర్ ఇంటేకర్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగ్ ఎల్ఇడి లైట్లు, బంపర్ మీద గల త్రిభుజాకారంలో ఉన్న టర్న్ ఇండికేటర్ లైట్లు వంటివి ఉన్నాయి.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

2018 టయోటా క్యామ్రీ రియర్ డిజైన్ విషయానికి వస్తే, క్రోమ్ సొబగులతో కూడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మునుపటి క్యామ్రీతో పోల్చితే ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

ఇంటీరియర్ విషయానికి వస్తే, నూతన ట్యాన్ కలర్‌లో ఉన్న అప్‌హోల్‌స్ట్రే మరియు ఫాక్స్ వుడ్ ట్రిమ్ ఫినిషింగ్ గల డ్యాష్‌బోర్డు, స్టీరింగ్ వీల్, ఆర్మ్ రెస్ట్ మరియు సెంటర్ కన్సోల్‌తో 2018 క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్ ఇంటీరియర్‌ అప్‌డేట్ అయ్యింది. అంతే కాకుండా మునుపటి 4-స్పోక్ స్టీరింగ్ వీల్ బదులుగా 3-స్పోక్ స్టీరింగ్ వీల్ వచ్చింది.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

కొత్తగా విడుదలైన 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌లో 12-స్పీకర్ ఆడియో సిస్టమ్ అనుసంధానం గల అధునాతన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అంతే కాకుండా, హెడ్స్ అప్ డిస్ల్పే, వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటండ్ ఫ్రంట్ సీట్లు, పవర్ ద్వారా సీట్లను బెండ్ చేసుకునే అవకాశం ఇంకా ఎన్నో ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

సాంకేతికంగా 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్ కారులో అదే మునుపటి 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది, 159బిహెచ్‌పి పవర్ మరియు 213ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్‌కు 142బిహెచ్‌పి పవర్ మరియు 270ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఎలక్ట్రిక్ మోటార్ జనరేటర్ అనుసంధానం కలదు. మొత్తం వ్యవస్థకు ఎలక్ట్రిక్ పవర్‌తో నియంత్రించబడే సివిటి గేర్‌బాక్స్ కలదు.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

భద్రత పరంగా 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ సెడాన్‌లో తొమ్మిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పవర్‌తో కంట్రోల్ అయ్యే బ్రేక్ సిస్టమ్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త 2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. ఎక్ట్సీరియర్‌లో గుర్తించదగిన మార్పులు జరగకపోయినా, ఇంటీరియర్ కీలకమైన మార్పులు జరిగాయి. నూతన ఫీచర్లు మరియు అకర్షణీయమైన అప్‌హోల్‌స్ట్రే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం, ఇండియాలో అమ్ముడయ్యే హైబ్రిడ్ కార్ల మీద ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిఫలాలు అందవు. హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ పెరగడంతో ధర కూడా అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, కర్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న చక్కటి పరిష్కారం హైబ్రిడ్ కార్లే.

2018 టయోటా క్యామ్రీ హైబ్రిడ్

1. ముఖేష్ అంబానీ పోలీస్ సిబ్బందికి కస్టమైజ్డ్ బైకులు

2.సాంకేతిక లోపంతో కాలి బూడిదైన ఫోర్డ్ ఎండీవర్

3.కారుకు కుడి లేదా ఎడమవైపునే స్టీరింగ్ వీల్ ఉంటుంది మధ్యలో ఎందుకు ఉండదు?

4.రహస్యంగా పరీక్షిస్తూ పట్టుబడిన కొత్త తరం మారుతి ఎర్టిగా

5.ఆర్మీ ఎడిషన్‌లో టాటా సఫారీ: అసలు తిరకాసు ఇక్కడే ఉంది!!

English summary
Read In Telugu: 2018 Toyota Camry Hybrid Launched In India; Priced At Rs 37.22 Lakh
Story first published: Thursday, April 12, 2018, 9:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark