ఇక మీదట పాత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ కొత్త వాటికి మార్చుకోవచ్చు

By Anil Kumar

పాత వాహనాలకు మంచి రిజిస్ట్రేషన్ నంబరు ఉండి వాటినీ వాడుకోలేని పరిస్థితి, సెంటిమెంటల్‌గా వచ్చిన రిజిస్ట్రేషన్ నంబరును పాత వాహనాల నుండి కొత్త వాహనాలకు మార్చుకునే అవకాశం గతంలో ఉండేది కాదు. కానీ, ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

Recommended Video - Watch Now!
What Does The ‘X’ On The Back Of Trains Mean? - DriveSpark
కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

వాహన రిజిస్ట్రేషన్ నంబరు బదలాయింపు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నియమం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, వాహన యాజమానులు వెహికల్ నంబరు రిజిస్ట్రేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీజుతో ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు బదలాయింపు కోసం రూ. 500 మరియు నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు బదలాయింపు కోసం 5,000 రుపాయల ఫీజును రవాణా శాఖ ప్రతిపాదించింది. ఫీజు ధరల ఖరారు మరియు ఈ రిజిస్ట్రేషన్ నంబరు బదలాయింపుకు క్యాబినెట్ ఆమోదం కోసం రవాణా శాఖ వేచి చూస్తోంది.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

ఆన్‌లైన్ అప్లికేషన్ అనంతరం, పాత నంబరు రిజిస్టర్ అయినట్లు ఒక స్లిప్ వస్తుంది. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లు ఆ రసీదును సంభందిత డీలరుకు ఇవ్వడంతో, కొత్త వాహనాన్ని పాత నంబరుతో రిజిస్టర్ చేయడానికి పూర్తి వివరాలను తన సిస్టమ్‌లో నమోది చేస్తాడు.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

మోటార్ లైసెన్సింగ్ అధికారి పాత వాహనానికి ఉన్న రిజిస్ట్రేషన్ నంబరు, కొత్తగా కొనుగోలు చేసిన వాహనాన్ని కేటాయిస్తాడు. ఇందులో కస్టమర్ పాత వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ బదలాయింపు కోసం ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవడం చాలా కీలకమైన అంశం.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

రిజిస్ట్రేషన్ నంబరు బదిలీ కోసం కేవలం ఏడు అప్లికేషన్లు మాత్రమే వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవగాహన రాహిత్యమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ నంబరు బదిలీ కోసం ధరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

పాత వాహనాలకు ఉన్న నంబరును కొత్త వాహనాలకు బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రవేశపెట్టడం భారత రవాణా శాఖ తీసుకున్న హర్షించదగ్గ నిర్ణయం అని చెప్పవచ్చు. వ్యక్తిగత రిజిస్ట్రేషన్ నంబర్ కోసం కొంత మంది భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. ఈ పద్దతి అమల్లోకి వస్తే, తమ పాత వాహనాలకు ఉన్న రిజిస్ట్రేషన్ నంబరునే కొత్త వాహనాలకు బదిలీ చేసుకుని ఖర్చుల భారాన్ని తగ్గించుకోవచ్చు.

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

పాత వాహనాల రిజిస్ట్రేషన్ నంబరును కొత్త వాహనాలకు అతి సులభంగా బదిలీ చేసుకునేందుకు భారత రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...

కొత్త వాహనాలకు పాత రిజిస్ట్రేషన్ నంబరు

వివిధ రంగుల్లో ఉండే నెంబర్ ప్లేట్లు దేనిని సూచిస్తాయో తెలుసా ?

Most Read Articles

English summary
Read In Telugu: Registration Number Transfer From Old To New Vehicles — Now Possible
Story first published: Friday, March 16, 2018, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X