నాన్-ఐఎస్ఐ హెల్మెట్ల అమ్మకాలను బ్యాన్ చేస్తున్న భారత ప్రభుత్వం

Written By:

దేశీయంగా నాన్-ఐఎస్ఐ టూ వీలర్ హెల్మెట్ల విక్రయాలను భారత ప్రభుత్వం అతి త్వరలో బ్యాన్ చేయనుంది. అవును, 2018 చివరి నాటికి మార్కెట్లో ఐఎస్ఐ గుర్తింపు పొందని హెల్మెట్ల విక్రయాలను భారత ప్రభుత్వం బ్యాన్ చేయనుంది. భారత్‌లో టూ వీలర్ల భద్రత పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న అతి పెద్ద నిర్ణయం ఇది.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

ఇండియాలో నాన్ ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేయాలని భారత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ఐఎస్ఐ హెల్మెట్ల అసోసియేషన్ కూడా స్వాగతించింది. ఇటీవల కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ హైవే ప్రయాణికుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబరు మరియు సుకద్ మొబైల్ యాప్ ప్రారంభించిన సదస్సులో మంత్రి నితిన్ గడ్కరీ మరియు ధర్మేంద్ర ప్రదాన్ ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్ల విక్రయాలను రద్దు చేయాలని చర్చించినట్లు తెలిసింది.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) నాన్ ఐఎస్ఐ హెల్మెట్ల విక్రయాలను మరో ఆరు నెలల్లోపు బ్యాన్ చేయవచ్చని సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, 75 నుండి 80 శాతం టూ వీలర్ల రైడర్లు ఐఎస్ఐ మార్కు రహిత హెల్మెట్లను వినియోగిస్తున్నారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

ఐఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లు విరివిగా అందుబాటులోకి రావడానికి గల ప్రధాన కారణం వీటి ధర చాలా తక్కువగా ఉండటం. కానీ, ప్రమాదం జరిగినపుడు నాన్-ఐఎస్ఐ హెల్మెట్లు ఎలాంటి భద్రతను కల్పించలేవనే అంశాన్ని ప్రజలు విస్మరిస్తున్నారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

రోజు రోజుకీ వాహనాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రమాదాలు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి, నాణ్యతా ప్రమాణాలను పాటించే హెల్మెట్లు తప్పనిసరిగా వినియోగించడం కోసం నాన్-ఐఎస్ఐ హెల్మెట్ల బ్యాన్ అంశం తెరమీదకు వచ్చింది.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చే ఐఎస్ఐ సర్టిఫికేట్ గుర్తింపు పొందిన హెల్మెట్లను మాత్రమే అనుమతించి, నాన్-ఐఎస్ఐ హెల్మెట్ల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిస్సంకోచ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, ఎవ్వరూ ఐఎస్ఐ మార్క్ లేని హెల్మెట్లను విక్రయించకూడదు. విరుద్దంగా విక్రయించినా... నకిలీ ఐఎస్ఐ హెల్మెట్లను తయారు చేసినా అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

శిరస్త్రాణం ధరించడమనేది మనల్ని మనం రక్షించుకోవడానికే, కాబట్టి టూ వీలర్ నడిపేటపుడు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసుకోండి. చాలా మంది రైడర్లు ఏదో పోలీసుల నుండి తప్పించుకోవడానికి మొక్కుబడిగా బండికో హెల్మెట్ ఉండాలనే ఉద్దేశ్యంతో నాణ్యత లేని నాన్ ఐఎస్ఐ హెల్మెట్లను తక్కువ ధరకే లభిస్తున్నాయని కొనుగోలు చేస్తున్నారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

టూ వీలర్ల డిమాండ్ అధికంగా ఉన్న ఇండియాలో ఏడాదికి సుమారుగా 90 కోట్ల హెల్మెట్ల డిమాండ్ ఉంది. కానీ, ప్రజలు అధిక సంఖ్యలో నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను ఆదరిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అతి త్వరలో అమల్లోకి తీసుకురానుంది.

English summary
Read In Telugu: Sale Of Non-ISI Helmets To Be Banned In India
Story first published: Saturday, March 10, 2018, 18:40 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark