టాటా కార్ల మీద అదిరిపోయే ఆఫర్లు: టియాగో నుండి హెక్సా వరకు అన్నింటి మీద గొప్ప తగ్గింపు

Written By:

ప్రతి ఏడాది మార్చి అనగానే గుర్తొచ్చేది, ఆ ఆర్థిక సంవత్సరపు చివరి మాసం. ఆర్థిక సవత్సరం మార్చితో ముగుస్తుంది కాబట్టి, చాలా వరకు కార్ల తయారీ సంస్థలు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించి వీలైనన్ని కార్లను విక్రయించి సేల్స్ పెంచుకోవాలని భావిస్తాయి. అంతే కాకుండా, నూతన ఆర్థిక సంవత్సరం మొదలయ్యేనాటికి పాత స్టాకును క్లియర్ చేసుకోవడానికి కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తాయి.

Recommended Video - Watch Now!
నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark
టాటా కార్ల మీద ఆఫర్లు

ఏదేమైనప్పటికీ, సాధారణ మార్కెట్ ధర కంటే కాస్తంత తక్కువ ధరలో లభించడమే కస్టమర్‌కు ముఖ్యం. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ విపణిలో ఉన్న దాదాపు అన్ని ప్యాసింజర్ కార్ల మీద మార్చి డిస్కౌంట్లను ప్రకటించింది. కాబట్టి, ఇవాళ్టి కథనంలో ఏయే మోడల్ మీద ఎంత వరకు ఆఫర్లు ఉన్నాయో చూద్దాం రండి...

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా టియాగో

టాటా విక్రయిస్తున్న కార్ల జాబితాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచిన టియాగో కారు మీద కూడా ఆఫర్లు ప్రకటించింది. టాటా టియాగో అన్ని డీజల్ వేరియంట్ల మీద మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. అంతే కాకుండా, టియాగో అన్ని వేరియంట్ల మీద కార్పోరేట్ డిస్కౌంట్ క్రింద రూ. 5,000 లు తగ్గింపు పొందవచ్చు. ధరకు తగ్గ విలువలను కలిగిన టాటా టియాగోను ఎంచుకోవడానికి ఇదొక మంచి సందర్భం అని చెప్పాలి.

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్

టియాగో ఆధారిత కాంపాక్ట్ సెడాన్ టిగోర్ కారు మీద మార్చి ఆఫర్లను ప్రకటించారు. టిగోర్ స్టైల్‌బ్యాక్ మీద మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ టిగోర్ పెట్రోల్ మరియు డీజల్ రెండింటి మీద వర్తిస్తుంది. వీటితో పాటు రూ. 5,000 లు వరకు కార్పోరేట్ బోనస్ లభిస్తుంది.

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా బోల్ట్

అతి తక్కువగా అమ్ముడుపోతున్న బోల్ట్ బి2-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ మీద భారీ ఆఫర్లే ప్రకటించింది. ఈ మార్చిలో ఎంచుకునే బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద గరిష్టంగా 50,000 రుపాయల విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 35,000 లు క్యాష్ డిస్కౌంట్ మరియు 15,000 లు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ పొందవచ్చు. శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో టాటా బోల్ట్ బెస్ట్ కార్. కానీ మార్కెట్లో ఉన్న పోటీ కారణంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. ఏదేమైనప్పటికీ మార్చి ఆఫర్లతో బోల్ట్ సేల్స్ కొద్దిమేర పెరిగే అవకాశం ఉంది.

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా జెస్ట్

టాటాకు పెద్దగా సేల్స్ సాధించపెట్టలేని మోడళ్లలో టాట జెస్ట్ ఒకటి. ఈ తరుణంలో జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ మీద కూడా మార్చి ఆఫర్లను ప్రకటించింది. ప్రతి జెస్ట్ కొనుగోలు మీద మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ మరియు మీ పాత కారును టాటా డీలర్లకు విక్రయిస్తే, ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ క్రింద రూ. 15,000 లు పొందవచ్చు.

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా సఫారీ స్టార్మ్

టాటా విక్రయిస్తున్న ప్యాసింజర్ కార్ల సమూహంలో వేగంగా వయసైపోతున్న మోడళ్లలో సఫారీ స్టార్మ్ మొదటి స్థానంలో ఉంది. దీని మీద మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ క్రింద రూ. 15,000 లు పొందవచ్చు. టాటా అరియా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన అత్యాధునిక సఫారీ ఎస్‌యూవీకి మార్కెట్లో ఓ మోస్తారు డిమాండ్ ఉంది. సఫారీ ప్రేమికులకు మార్చి ఆఫర్లు కలిసిరానున్నాయి.

టాటా కార్ల మీద ఆఫర్లు

టాటా హెక్సా

టాటా హెక్సా, అత్యాధునిక ఫీచర్లతో, సౌకర్యవంతమైన ఇంటీరియర్ మరియు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లున్న బెస్ట్ ఎస్‌యూవీ. టాటా ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచిన ల్యాడర్ ఫ్రేమ్ ఆధారిత హెక్సా ఎస్‌యూవీ మీద మార్చి ఆఫర్లలో భాగంగా మొదటి ఏడాది ఉచిత ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పటికే హెక్సా ఎస్‌యూవీ ధరలను ఖచ్చితంగా నిర్ణయించడం మరియు ఉచిత ఇన్సూరెన్స్ సేల్స్ పెరుగుదలకు తోడ్పడనుంది.

English summary
Read In Telugu: Tata’s BIG March discounts on cars from Tiago to Hexa
Story first published: Sunday, March 11, 2018, 13:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark