Just In
- 22 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 1 day ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Finance
బంగారం నిరోధకం, ఈ వారం ప్రభావం చూపే అంశాలు ఇవే
- News
జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
- Movies
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సింగల్ ఛార్జింగ్‌తో 500కిమీలు ప్రయాణించే టాటా నియో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
టాటా టెక్నాలజీస్ మరియు చెైనాకు చెందిన నియో ఇరు సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో నియో ఇఎస్8 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేశాయి. సింగల్ ఛార్జింగ్‌తో 500కిమీలు ప్రయాణించే దీని ధర రూ. 48 లక్షలుగా ఉంది.

ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టాటా టెక్నాలజీస్ శరవేగంగా రాణిస్తోంది. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు మరియు పలు అంకుర సంస్థలతో భాగస్వామ్యపు ఒప్పందం ఏర్పరుచుకొని అధునాతన ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది మరియు సాంకేతికపరమైన ఆవిష్కరణలు చేస్తోంది.

ప్రపంచ దిగ్గజాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్ పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటున్న తరుణంలో రతన్ టాటా గారు టాటా గ్రూపు అనుబంధ సంస్థగా టాటా టెక్నాలజీస్‌ను ఏర్పాటు చేశారు.

టాటా టెక్నాలజీస్ ఇతర సంస్థలతో చేతులు కలిపి నూతన ఉత్పత్తులను డెవలప్ చేస్తుంది. ఇందులో భాగంగా చైనా దిగ్గజం నియోతో కుదురిన ఒప్పందంతో ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో తయారు చేసి, ఇటీవల చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా టెక్నాలజీస్ మరో 11 ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టులను అభివృద్ది చేస్తోంది.

చైనాలోని షాంఘైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ నియో కంపెనీతో టాటా టెక్నాలజీస్ 2015లో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు 32 నెలల పాటు శ్రమించి ఇఎస్8 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో తయారు చేశాయి.

పూర్తి స్థాయిలో బ్యాటరీల ఆధారంగా నడిచే ఫుల్ సైజ్ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అల్యూమినియం బాడీతో నిర్మించారు. మరియు ఈ నియో ఇఎస్8 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిసెంబర్ 2017లో బీజింగ్‌లో ఆవిష్కరించారు.

టాటా - నియో భాగస్వామ్యంతో వచ్చిన నియో ఇఎస్8 ఎస్‌యూవీ కొన్ని వారాల క్రితం చైనా మార్కెట్లోకి విడుదలయ్యింది. చైనాలో దీని ధర రూ. 69,000 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో దీని ధర సుమారుగా రూ. 48.30 లక్షలుగా ఉంది.

నియో ఇఎస్8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి సంయుక్తంగా ఇవి 643బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తాయి. నియో ఇఎస్8 ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 500కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

నియో ఇఎస్8 కేవలం 4.4 సెకండ్ల వ్యవధిలో 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 180కిమీలుగా ఉంది. టాటా అభివృద్ది చేసిన నియో ఇఎస్8 ప్రపంచ విపణిలో ఉన్న టెస్లా మోడల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి సరాసరి పోటీనిస్తుంది.

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన హెచ్5ఎక్స్ ఎస్‌యూవీ ప్రేరణతో ఈ 7-సీటర్ నియో ఇఎస్8 ఎస్‌యూవీని రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్5ఎక్స్ ఎస్‌యూవీకి హ్యారియర్ పేరును ఖరారు చేసిన టాటా వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది.

ప్రపంచ విపణిలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న టెస్లాకు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేయడం ఆషామాషీ కాదు. అయినప్పటికీ, టాటా టెక్నాలజీస్ విన్నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలు చేస్తూనే ఉంది.