భారత్‌కు రష్ ఎస్‌యూవీ ఖరారు చేసిన టయోటా

Written By:

జపాన్ దిగ్గజం టయోటా మోటార్స్ గత వారంలో ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త యారిస్ ప్రీమియమ్ సెడాన్ కారును ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇప్పుడు భారత్‌కు మరో మోడల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది.

టయోటా రష్ ఎస్‌యూవీ

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ఇండియన్ మార్కెట్లోకి అత్యంత సరసమైన ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. వేగంగా అభవృద్ది చెందుతున్న మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి కొత్త మోడళ్లను నింపేయాలని టయోటా భావిస్తోంది.

Recommended Video - Watch Now!
Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
టయోటా రష్ ఎస్‌యూవీ

ఎస్‌యూవీ సెగ్మెంట్లో టయోటా ఫార్చ్యూనర్ కంపెనీకి బెస్ట్ సెల్లింగ్‌గా మోడల్‌గా నిలిచింది. అయితే, సరసమైన ఎస్‌యూవీని కంపెనీ నుండి ఒక్కటి కూడా లేదు. ఈ సెగ్మెంట్లో రష్ లేదా సిహెచ్-ఆర్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని టయోటా ఇండియా భావించింది.

టయోటా రష్ ఎస్‌యూవీ

టయోటా కిర్లోస్కర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అకితో సచిబన మాట్లాడుతూ, "టయోటా కంపెనీ రష్ లేదా సిహెచ్-ఆర్ ఎస్‌యూవీలలో ఏదో ఒక మోడల్‌ను ఇండియన్ మార్కెట్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇండియన్ రోడ్లకు అనుగుణంగా ధరకు తగ్గ విలువలతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపాడు."

టయోటా రష్ ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకించి కొత్త మోడల్‌ను అభివృద్ది చేసే ఆలోచనలో లేనట్లు ఆయన వెల్లడించారు. ఇంత వరకు భారత్‌లో పరిచయం చేయని అంతర్జాతీయ మోడల్‌నే ఖరారు చేస్తున్నారు.

టయోటా రష్ ఎస్‌యూవీ

టయోటా భారత్‌కు ఖరారు చేసిన ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 10 నుండి 15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. టయోటా దాదాపు రష్ ఎస్‌యూవీనే ఖాయం చేసే అవకాశం ఉంది. రష్ ఎస్‌యూవీ గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

టయోటా రష్ ఎస్‌యూవీ

ఇండోనేషియా మార్కెట్లో అమ్మకాల్లో ఉన్న రష్ ఎస్‌యూవీనే ఇండియన్ వెర్షన్ స్టైల్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది. టయోటా రష్ రెండవ తరానికి చెందిన 7-సీటర్ ఎస్‌యూవీ.

టయోటా రష్ ఎస్‌యూవీ

ఎస్‌‌యూవీ మరియు ఎమ్‌యూవీ డిజైన్ అంశాలతో రూపొందించబడిన స్పోర్టివ్ ఎస్‌యూవీ టయోటా రష్. రష్ ఫ్రంట్ డిజైన్ ఇన్నోవా క్రిస్టాను పోలి ఉంటుంది. అయితే, ఆకర్షణీయమైన సరికొత్త ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు ఇంటీరియర్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టయోటా రష్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏడు మంది సౌకర్యవంతంగా ప్రయాణించే లౌఔట్‌తో ఎస్‌యూవీ మరియు ఎమ్‌యూవీ డిజైన్ అంశాలతో అభివృద్ది చేసిన రష్ ఎస్‌యూవీని టయోటా మోటార్స్ ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసింది. ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకొస్తున్న ఈ మోడల్‌ టయోటాకు అతి ముఖ్యమైన ఉత్పత్తిగా నిలవనుంది. విపణిలో ఇదే వరకే ఉన్న హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read IN Telugu: Toyota Considering Affordable SUV For India — Will It ‘Rush’ To India?

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark