డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ మోటార్ తమ ఎటియోస్ లివా హ్యాచ్‌‌బ్యాక్ కారును సరికొత్త డ్యూయల్ కలర్ ఆప్షన్‌లో పరిచయం చేసింది. సరికొత్త టయోటా ఎటియోస్ లివా ఇప్పుడు నూతన డ్యూయల్-టోన్ ఆరేంజ్ మరియు బ్లాక్ "ఇన్ఫెర్నో ఆరేంజ్" పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది.

ఈ నూతన ఆరేంజ్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఇది వరకే ఉన్న రెడ్-బ్లాక్ మరియు వైట్-బ్లాక్ కలర్ ఆప్షన్‌లతో సహా లభిస్తుంది.

టయోటా ఈ ఇన్ఫెర్నో ఆరేంజ్ పెయింట్ స్కీమును ఇది వరకే ఎటియోస్ క్రాస్ మోడల్‌లో పరిచయం చేసింది, అయితే, అది డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కాదు. ఇది వరకు లభించే మిగతా రెండు డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ తరహాలో ఆరేంజ్-రెడ్ ఆప్షనల్ వి, విఎక్స్, విడి మరియు విడిఎక్స్ మోడళ్లలో లభ్యమవుతోంది.

డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

డిజైన్ పరంగా మిగతా కలర్ స్కీమ్‌లతో పోల్చుకుంటే ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సరికొత్త టయోటా ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్‌లో రూఫ్, రియర్ స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. అంతే కాకుండా, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

ఎటియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లో పియానో-బ్లాక్ ఫినిషింగ్ గల డ్యాష్‌బోర్డు ఉంది. ఎటియోస్ లివా డ్యూయల్-టోన్ మోడల్లో 2-డిఐఎన్ మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, డే/నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్, ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్లో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

సాంకేతికంగా టయోటా ఎటియోస్ లివా రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్. వీటిలో పెట్రోల్ వేరియంట్ 79బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 67బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసధానం కలదు.

డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

టయోటా ఎటియోస్ లివా న్యూ ఇన్ఫెర్నో ఆరేంజ్ డ్యూయల్-టోన్ కలర్ వేరియంట్ ధర ఇతర డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌ల తరహా ధరల శ్రేణిలోనే లభ్యమవుతోంది. ఎటియోస్ లివా డ్యూయల్ టోన్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 5.85 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.44 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో విడుదలైన టయోటా ఎటియోస్ లివా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఎటియోస్ లివా డ్యూయల్-టోన్ వేరియంట్లు స్టాండర్డ్ వేరియంట్ల కంటే చాలా స్పోర్టివ్‌గా ఉంటుంది. లివా హ్యాచ్‌బ్యాక్‌లో సాధారణ హ్యాచ్‌బ్యాక్‌కు ఉండాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి. చెప్పాలంటే ధరకు తగ్గ విలువలతో లభించే మోడళ్లలో లివా ఒకటి. కస్టమర్లు ఇప్పుడు ఎటియోస్ లివా కారును మూడు విభిన్న డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Etios Liva Gets A New Dual-Tone Colour Scheme
Story first published: Tuesday, July 3, 2018, 18:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X