టయోటా యారిస్ మీద భారీ బుకింగ్స్

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ టయోటా యారిస్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు, టయోటా యారిస్ మీద 5,000 బుకింగ్స్ నమోదయ్యాయి మరియు ఈ సెడాన్ మీద రెండు నెలల వెయిటింగ్ పీ

By Anil Kumar

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త మిడ్ సైజ్ సెడాన్ టయోటా యారిస్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు, టయోటా యారిస్ మీద 5,000 బుకింగ్స్ నమోదయ్యాయి మరియు ఈ సెడాన్ మీద రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ప్రకటించింది.

టయోటా యారిస్ బుకింగ్స్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టయోటా మోటార్స్ ఇండియన్ యారిస్ సెడాన్‌తో ఇండియన్ సి-సెడాన్ సెగ్మెంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. టయోటా యారిస్ ప్రారంభ ధర రూ.8.75 లక్షలు మరియు యారిస్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.07 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా తమ యారిస్ సెడాన్ మీద ఏప్రిల్ నుండి బుకింగ్స్ ఆహ్వానించింది. మరియు బుక్ చేసుకున్న కస్టమర్లకు యారిస్ విడుదలైన రోజు నుండి డెలివరీ ప్రారంభించింది. యారిస్ లాంచ్ రోజునే ఏకంగా 1000 యూనిట్లను డెలివరీ ఇచ్చినట్లు టయోటా వెల్లడించింది.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా మోటార్స్ యారిస్ సెడాన్‌ను కర్ణాటకలోని బిడది ప్రొడక్షన్ ప్లాంటులో తయారు చేస్తోంది. ఇదే ప్రొడక్షన్ ప్లాంటులో టయోటా ఇండియా అందుబాటులో ఉంచిన ఎటియో, కరోలా ఆల్టిస్, క్యామ్రీ, ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా మోడల్లను ఉత్పత్తి చేస్తోంది.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా యారిస్ విడుదలతో, యారిస్ ఉత్పత్తి కోసంప్రొడక్షన్ ప్లాంటు మీద పెట్టుబడిని మరింత పెంచింది. టయోటా యారిస్‌ను 85 శాతం దేశీయంగా తయారైన విడి పరికరాలతో అసెంబుల్ చేస్తోంది.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, జె, జి, వి మరియు విఎక్స్. అన్ని వేరియంట్లలో కూడా 108బిహెచ్‌‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ కెపాసిటి గల వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ కలదు.

టయోటా యారిస్ బుకింగ్స్

యారిస్‌లోని శక్తివంతమైన ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. సివిటి మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అన్ని వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

టయోటా యారిస్ బుకింగ్స్

సరికొత్త టయోటా యారిస్ ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో లభ్యమవుతోంది. ప్రధానంగా, గెస్ట్చర్ కంట్రోల్ గల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్ మరియు ఆటోమేటి వేరియంట్లలో పెడల్ షిఫ్టర్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

యారిస్ సెడాన్ ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, వైల్డ్‌ఫైర్ రెడ్, ఫాంటమ్ బ్రౌన్, గ్రే మెటాలిక్, సూపర్ వైట్, పర్ల్ వైట్ మరియు సిల్వర్ మెటాలిక్.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా యారిస్ సెడాన్ విపణిలో ఉన్న హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తోంది.

టయోటా యారిస్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా...? అయితే, టయోటా యారిస్‌ మంచి-చెడుల గురించిన రివ్యూ స్టోరీ చదవండి.

టయోటా యారిస్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా మోటార్స్ చిన్న కార్ల పరిశ్రమలో ఆశించిన మేర సక్సెస్ అందుకోలేకపోతోంది. ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్లు మంచి స్పందన లభిస్తోంది. అయితే, ఇటీవల సెడాన్ సెగ్మెంట్‌కు ఆదరణ పెరుగుతుండటంతో అంతర్జాతీయ విపణిలో టయోటా విక్రయిస్తున్న యారిస్ సెడాన్‌ను దేశీయ సి-సెగ్మెంట్ సెడాన్ విభాగంలోకి ప్రవేశపెట్టింది. అయితే, టయోటా ఊహించని విధంగా యారిస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

టయోటా యారిస్ బుకింగ్స్

10 లక్షల ధరలో సివిటి గేర్‌బాక్స్ మరియు ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు లభ్యమవుతుండటం యారిస్ సక్సెస్‌కు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యారిస్ మీద 5 వేల పైబడి బుకింగ్స్ మరియు రెండు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Yaris Bookings Cross 5,000 Units — Waiting Period Now Increases To Two Months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X