మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం 10 లక్షల ధరలో వస్తున్న మూడు 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

By Anil Kumar

కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి వారి కోసమే ఇండియాలో ఎమ్‌పీవీ కార్లు బాగా ప్రసిద్ది చెందాయి. 5 నుండి 7 మంది వరకు ఒకే కారులో ప్రయాణించాలనుకునే వారికున్న ఏకైక ఆప్షన్ ఎమ్‌పీవీ.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

ఇప్పుడు దేశీయ ఎమ్‌పీవీ కార్ల విపణిలోకి మూడు కొత్త కార్లు విడుదలకు సిద్దమయ్యాయి. మధ్య తరగతి కుటుంబాలను ఆకట్టుకునేందుకు ఈ మూడు ఎమ్‌పీవీలు కూడా 10 లక్షల ధరలో విడుదల కానున్నాయి. అతి త్వరలో మార్కెట్‌ను ఢీకొట్టనున్న ఆ మూడు కార్ల మీద ఓ లుక్కేసుకుందాం రండి....

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మారుతి సుజుకి ఎర్టిగా

మారుతి సుజుకి మరికొన్ని నెలల్లో ప్రస్తుతం ఉన్న ఎర్టిగా ఎమ్‌పీవీ స్థానంలోకి కొత్త తరం ఎర్టిగా ఎమ్‍‌పీవీ కారును భారీ మార్పులు చేర్పులతో లాంచ్ చేయనుంది. కొన్ని వారాల క్రితం ఇండోనేషియా మార్కెట్లోకి న్యూ జనరేషన్ ఎర్టిగా ఎమ్‌పీవీని ఆవిష్కరించి, విడుదల కూడా చేశారు.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

సెకండ్ జనరేషన్ ఎర్టిగా ఎమ్‌పీవీని సుజుకి వారి అధునాతన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ఇది వరకు విడుదలైన బాలెనో, న్యూ డిజైర్ మరియు స్విఫ్ట్ కార్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేశారు.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మూడు వరుసల సీటింగ్ లేఔట్లో ఏడు మంది వరకు ప్రయాణించే సౌకర్యం గల కొత్త తరం ఎర్టిగా ఇంటీరియర్ అత్యంత విశాలంగా ఉంటుంది. అదనంగా హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో మునుపటి మోడల్‌‌తో పోల్చితే ఎంతో తేలికగా ఉంటుంది. ఎక్ట్సీరియర్ పరంగా పూర్తిగా కొత్త డిజైన్‌లో ఉంది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

సాంకేతికంగా ఇందులో మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేస్తూ 1.5-లీటర్ కె-సిరీస్ ఇంజన్ వస్తోంది. అదే విధంగా డీజల్ ప్రియుల కోసం అదే మునుపటి 1.3-లీటర్ డీజల్ ఇంజన్ యథావిధిగా రానుంది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

పెట్రోల్ వెర్షన్ మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీ కార్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అదే విధంగా డీజల్ వెర్షన్ ఎర్టిగా కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానున్నాయి.

  • మారుతి ఎర్టిగా ప్రారంభ ధర అంచనా: రూ. 7 లక్షలు
  • విడుదల అంచనా: 2018 ఆగష్టులో
10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మహీంద్రా యు321

భారతదేశపు దిగ్గజ ఎస్‌యూవీ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గత కొంత కాలంగా యు321 ఎమ్‌పీవీని పరీక్షిస్తోంది. ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ ఎమ్‌పీవీ కారును ఉత్తర అమెరికాలోని మహీంద్రా టెక్నికల్ సెంటర్ అభివృద్ది చేసింది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించిన మహీంద్రా యు321 ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఉన్న మారుతి టయోటా ఎర్టిగా మరియు ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మహీంద్రా యు321 ఎమ్‌పీవీ 7, 8 మరియు 9-సీటింగ్ సామర్థ్యంతో లభ్యం కానుంది, సాంకేతికంగా 1.6-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌ వస్తోంది. అదనంగా పెట్రోల్ ఇంజన్ కూడా డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

సెగ్మెంట్ లీడర్‌గా రాణించేందుకు యు321 ఎమ్‌పీవీ ఇంటీరియర్ హై క్వాలిటీ విడి భాగాలతో రూపొందించారు, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు మరియు అద్భుతమైన ఫినిషింగ్‌తో తీర్చిదిద్దనున్నారు.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి లాంచ్ అయితే, రెనో లాజీ మరియు మారుతి సుజుకి ఎర్టిగా వంటి ఎమ్‌పీవీ మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది.

  • మహీంద్రా యు321 ప్రారంభ ధర అంచనా: రూ. 10 లక్షలు
  • విడుదల అంచనా: 2018 సెప్టెంబరులో
10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

రెనో మినీ ఎమ్‌పీవీ

రెనో ఇండియా దేశీయంగా లాజీ ఎమ్‌పీవీని ప్రవేశపెట్టింది అయితే ఆశించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్‌పీవీ సెగ్మెంట్లో ఎలాగైనా రాణించే ఉద్దేశ్యంతో నాలుగు మీటర్ల పొడవు లోపు అత్యంత సరసమైన ధరలో 7-సీటర్ ఎమ్‌పీవీని లాంచ్ చేయడానికి సన్నద్దమవుతోంది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, రెనో ఇండియా తమ మినీ ఎమ్‌పీవీని సిఎమ్ఎఫ్-ఏ+ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది. మరియు ఎస్‌యూవీ లక్షణాలతో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి ప్రవేశించి భారీ విజయాన్ని అందుకున్న రెనో క్విడ్ ఆధారంగా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

7-సీటర్ మినీ ఎమ్‌పీవీని సబ్-4-మీటర్ విభాగం క్రింద అభివృద్ది చేస్తుండటంతో ట్యాక్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. అదనంగా, పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైన విడి భాగాలతో నిర్మిస్తుండటంతో భారతదేశపు అత్యంత సరసమైన ఎమ్‌పీవీగా దేశీయ మార్కెట్‌ను ఢీకొట్టనుంది.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

సాంకేతికంగా ఇందులో రెనో క్విడ్‌లో ఉపయోగించిన అదే 1.0-లీటర్ ఇంజన్‌ను వినియోగించనున్నారు. అయితే, అధిక పవర్ కోసం బూస్టర్‌జెట్ వెర్షన్‌లో అందివ్వనున్నారు. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ప్రవేశపెడుతున్నారు.

10 లక్షల ధరలో వస్తున్న 7-సీటర్ ఎమ్‌పీవీ కార్లు

డస్టర్ మరియు క్విడ్ తరువాత ఈ మినీ ఎమ్‌పీవీతో మరో భారీ సక్సెస్ అందుకోవడానికి రెనో ఇండియా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎక్ట్సీరియర్ స్టైలింగ్ మరియు ఇంటీరియర్ డ్యాష్‌బోర్డు దాదాపు క్విడ్ కారునే పోలి ఉంటుంది. ఇది విపణిలో ఉన్న డాట్సన్ గో ప్లస్ 7-సీటర్ ఎమ్‌పీవీ పై స్థానాన్ని భర్తీ చేస్తుంది.

  • రెనో మినీ ఎమ్‌పీవీ ధర అంచనా: రూ. 6 లక్షలు
  • విడుదల అంచనా: 2019 ప్రారంభం నాటికి
Most Read Articles

English summary
Read In Telugu: Upcoming Family MPV Under 10 lakhs
Story first published: Tuesday, June 19, 2018, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X