Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బడ్జెట్ ధరలో విడుదలైన హ్యుందాయ్ క్రెటా కొత్త వేరియంట్లు
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తమ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా మరో రెండు కొత్త వేరియంట్లలో నిశ్శబ్దంగా విడుదల చేసింది. E+ మరియు EX వేరియంట్లను 1.6-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో అత్యంత సరమైసన ధరలో తీసుకొచ్చింది. క్రెటా ఎస్‌యూవీని కొనలేకపోయామని భావించే కస్టమర్లకు ఇదొక శుభవార్తనే చెప్పాలి.

హ్యుందాయ్ క్రెటా E+ వేరియంట్ ధరరూ. 10.87 లక్షలు మరియు క్రెటా EX వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. రెండు వేరియంట్లలో కూడా ఎంతో ఎక్కువగా ఇష్టపడుతున్న 1.6-లీటర్ డీజల్ ఇంజన్ అందించారు.

ఈ రెండు వేరియంట్లు ఇది వరకు 1.4-లీటర్ డీజల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమయ్యేవి. వీటికి కొనసాగింపుగా క్రెటా E+ మరియు EX బేస్ వేరియంట్లు ఇప్పుడు 1.6-లీటర్ డీజల్ ఇంజన్ లభ్యమవుతాయి.

సాంకేతికంగా క్రెటాలోని 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం మాత్రమే కలదు, కనీసం అప్షనల్‌గా కూడా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించడం లేదు.

హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్లలో శక్తివంతమైన పెద్ద ఇంజన్ అందివ్వడం మినహాయిస్తే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇది వరకు లభించే అవే మునుపటి ఫీచర్లు మరియు టెక్నాలజీ యధావిధిగా వస్తాయి.

బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్లు, స్టీల్ వీల్స్, డ్యూయల్ టోన్ బంపర్లు, స్కిడ్ ప్లేట్లు మరియు బ్లాక్ లేదా సిల్వర్ ఫ్రంట్ గ్రిల్ వంటివి క్రెటా ఎక్ట్సీరియర్‌లో ప్రధానంగా వచ్చే ఫీచర్లు. వీటితో పాటు రెండు బేస్ వేరియంట్లలో ఫాలో-మి-హోమ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల సైడ్ మిర్రర్లు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎయిర్ కండీషనింగ్, ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, ఎత్తు అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్, రియర్ ఏసీ వెంట్స్, టిల్ట్ ఫంక్షన్ గల స్టీరింగ్ వీల్ మరియు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాలోని EX వేరియంట్లో అదనంగా వెనుక ప్యాసింజర్ల కోసం సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, యూఎస్‌బీ ఛార్జర్లు, సన్‌గ్లాస్ హోల్డర్, అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఫ్రంట్ అండ్ రియర్ హెడ్‌రెస్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ గల 5.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హ్యుందాయ్ ఐ-బ్లూ రిమోట్ యాప్ మరియు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు వచ్చాయి.

సేఫ్టీ పరంగా హ్యుందాయ్ క్రెటా E+ మరియు EX వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డే/నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్స్, హైస్పీడ్ వార్నింగ్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా నిలిచింది. సుమారుగా రెండేళ్ల క్రితం విడుదలైన క్రెటా ఎస్‌యూవీ అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకొంది. అయితే, ఇటీవల విడుదలైన ఎంజీ హెక్టర్ మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లు క్రెటాకు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీని రెండు బేసిక్ వేరియంట్లలో లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 2020 ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగే ఆటో ఎక్స్‌పోలో పలు కొత్త మోడళ్లను ఆవిష్కరించే ఆవకాశం ఉంది.