మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యేనాటికి విపణిలోకి మరో కొత్త కారును విడుదల చేసేందుకు ఏర్పాట్లు చకచకా చేస్తోంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బాలెనో కారుకు సరాసరి పోటినిచ్చేలా టాటా ఆల్ట్రోజ్ అనే కారును సిద్దం చేసింది. త్వరలో విడుదల ఉన్న నేపథ్యంలో తుది దశ పరీక్షలను రహస్యంగా నిర్వహిస్తుండగా మీడియా కంటపడింది.

మారుతి బాలెనో కారుకు చుక్కలు చూపించనున్న టాటా అల్ట్రోజ్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి..

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

టాటా ఆల్ట్రోజ్ కారు కంపెనీ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో 45X పేరుతో తొలిసారిగా ఆవిష్కరించారు. టాటాకు చెందిన సరికొత్త ALFA ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన తొలి మోడల్ కూడా ఇదే కావడం గమనార్హం.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

టాటా ఆల్ట్రోజ్ అధికారిక వెబ్‌సైట్‌లో టాటా వారి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గురించి కొన్ని వివరాలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టాటా సంస్థ యొక్క ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఫిలాసఫీ ఆధారంగా డెవలప్ చేశారు. డోర్ ప్యానళ్ల మీద పదునైన డిజైన్ గీతలు, కండలు తిరిగిన బాడీ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

ఫ్రంట్ డిజైన్‌లో పలుచగా మలచబడిన స్టైలిష్ హెడ్ ల్యాంప్ క్లస్టర్‌ను తేనెతుట్టె లాంటి ఫ్రంట్‌ గ్రిల్‌కు ఇరువైపులా ఆకర్షణీయంగా అమర్చారు. హెడ్ ల్యాంప్స్ క్రింద ఫాగ్ ల్యాంప్స్‌ను ఫ్రంట్ బంపర్‌లో ఇమిడిపోయేలా జొప్పించారు. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, ప్రొజెక్టర్ ల్యాంప్స్, డ్యూయల్-టోన్ బూట్ స్పేస్ ఎల్ఈడీ లైట్లు, టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. రహస్యంగా పరీక్షించిన అల్ట్రోజ్ కారులో 4-స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్‌లో అత్యాధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. క్యాబిన్ మొత్తం మూడ్ లైటింగ్ సిస్టమ్ కలదు, ఇది మన ఫీలింగ్స్ మరియు అనుభూతిని బట్టి ఎప్పటికప్పుడు క్యాబిన్‌లోపల వివిధ రంగుల్లో లైటింగ్ ఇస్తుంది. పుష్-బటన్ స్టార్ట్, అనలాగ్ మరియు డిజిటల్ టాకో మీటర్ వంటివి రానున్నాయి.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

డ్రైవర్‌కు ఎదురుగా ఉండే డిజిటల్ డిస్ల్పేలో కారుకు సంభందించిన ఎన్నో వివరాలను డ్రైవర్‌కు ఎప్పటికప్పు తెలియజేస్తుంది. రియల్ టైమ్ మైలేజ్, ఇంజన్ పవర్, ఇంజన్ టార్క్, వంటి వివరాలను అందిస్తుంది. అంతే కాకుండా వివిధ రకాల డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా రకరకాల డ్రైవింగ్ మోడ్స్ కూడా పరిచయం చేస్తున్నారు.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

డిజైన్ మరియు ఫీచర్లు పరంగా కాకుండా సాంకేతికంగా కూడా టాటా ఆల్ట్రోజ్ అత్యంత శక్తింవతమైన మోడల్. ఇది మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అవి, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రివట్రాన్ పెట్రోల్, 1.2-లీటర్ రివట్రాన్ టుర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బో-డీజల్ ఇంజన్.

అన్ని ఇంజన్ ఆప్షన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో రానున్నాయి. భవిష్యత్తులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

టాటా ఆల్ట్రోజ్ కారు ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఇది వరకే ఉన్న మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, టయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది. అత్యాధునిక డిజైన్‌ శైలిలో వస్తోన్న టాటా ఆల్ట్రోజ్ ఈ సెగ్మెంట్లో కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకోనుంది.

మారుతి బాలెనోకి చుక్కలు చూపించనున్న టాటా కొత్త మోడల్ ఇదే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెగ్యులర్ హ్యాచ్‌బ్యాక్ కార్లయిన మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ10 మరియు ఫోర్డ్ ఫిగో కంటే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కాస్త లగ్జరీ మరియు ఖరీదైన హ్యాచ్‌బ్యాక్ కార్ల కోసం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ క్రింద బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి ఉత్పత్తులు వచ్చాయి. ప్రస్తుతం ఈ సెగ్మంట్లో లీడర్‌గా ఉన్నటువంటి బాలెనో మరియు ఎలైట్ ఐ20 మోడళ్లకు టాటా అల్ట్రోజ్ భారీ షాక్ ఇవ్వనుందనే చెప్పాలి.

Source: Rushlane

Most Read Articles

English summary
Tata Altroz Production Ready Model Spied Testing Ahead Of India Launch: Spy Pics & Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X