Just In
- 18 min ago
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 4 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్.. సింగల్ ఛార్జింగ్‌తో 300కిమీ మైలేజ్: ధర ఎంతంటే?
టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా టాటా మోటార్స్ విక్రయిస్తున్న అన్ని ప్యాసింజర్ కార్లను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ అందుకు కావాల్సిన సరికొత్త "జిప్‌ట్రాన్ ఇవి టెక్నాలజీ"ని అభివృద్ది చేసింది.
టాటా జిప్‌ట్రాన్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో తొలి ఉత్పత్తిగా నెక్సాన్ ఎస్‌యూవీని ఖరారు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు జనవరి-మార్చిలోపు పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 300వోల్ట్ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ యూనిట్ అందించారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 300కిమీల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌలభ్యం కూడా కలదు, అంతే కాకుండా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని బ్యాటరీ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ మీద 8 ఏళ్ల వారంటీ అందిస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కానున్న నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ తరహాలోనే నెక్సాన్ ఎలక్ట్రిక్ ఉండవచ్చు. నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర సుమారుగా రూ. 15 లక్షల నుండి 17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉండవచ్చని టాటా ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం పెట్రోల్/డీజల్ ఇంజన్‌తో లభించే నెక్సాన్ ఎస్‌యూవీ ధరల శ్రేణి రూ. 6.58 లక్షల నుండి రూ. 11.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం దేశవ్యాప్తంగా సుమారుగా 300 వరకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అంతే కాకుండా 2020 డిసెంబర్ నాటికల్లా నాలుగు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని భావించింది.

టాటా నెక్సాన్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్) మినహాయిస్తే, ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్, టిగోర్ ఎలక్ట్రిక్ కార్లతో పాటు ALFA-ARC లేదా OMEGA-ARC ఫ్లాట్‍ఫామ్ క్రింద మరో కొత్త మోడల్‌ను అభివృద్ది చేసి ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, 2020 మధ్య భాగంలో ఇండియన్ మార్కెట్లోకి మహీంద్రా లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ300 ఎలక్ట్రిక్ వెహికల్‌కు సరాసరి పోటీనివ్వనుంది. వీటికి పోటీగా మారుతి సుజుకి మరియు ఎంజీ మోటార్స్ కూడా వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయ ప్యాసింజర్ కార్ల కంపెనీలు బెటర్, ఫాస్టర్ మరియు పర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన అందరినీ ఆశ్చర్యపరిచింది. అతి తక్కువ ధరలో, ప్రతి కస్టమర్ ఎంచుకునే విధంగా సాధారణ పెట్రోల్/డీజల్ ఇంజన్‌తో లభించే అవే మోడళ్లనే అత్యంత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. జిప్‌ట్రాన్ అనే ఎలక్ట్రిక్ వెరహికల్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి, ఆవిష్కరించింది అతి త్వరలోనే సరసమైన ఎలక్ట్రిక్ కార్లను భారతీయులకు చేరువ చేయనుంది.