Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ లీమోసిన్ విడుదలకు ముహుర్తం ఖరారు
కొత్త 2021 ఆడి ఏ4 మోడల్‌కు చెక్ పెట్టేందుకు మరో జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ సిద్ధమైంది. ఈ మోడల్‌కి పోటీగా తమ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ లేటెస్ట్ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ యొక్క కొత్త లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌ను జనవరి 21, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్ భరత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది దేశీయ విపణిలో లభ్యం కానున్న పొడవైన మరియు విశాలమైన ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా నిలుస్తుంది. పొడవాటి వీల్‌బేస్ కారణంగా ఈ సెడాన్‌లో విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది.

గ్రాన్ లీమోసిన్‌లో ఈ ఒక్క మార్పు మినహా, వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవు. స్టాండర్డ్ 3-సిరీస్‌లో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఈ గ్రాన్ లీమోసిన్ వేరియంట్లో కూడా లభ్యం కానున్నాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్ కూడా బ్రాండ్ యొక్క క్లార్ (CLAR) అర్కిటెక్చర్‌లో భాగంగా ఉంటుంది. ఇది స్టాండర్డ్ 3-సిరీస్‌లో ఉన్న ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్, లేఅవుట్ మరియు ఫీచర్లను యధావిధిగా కలిగి ఉంటుంది.

ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3డి నావిగేషన్, రియర్ పార్క్ అసిస్ట్, బిఎమ్‌డబ్ల్యూ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇంజన్ పరంగా చూస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌లో స్టాండర్డ్ వెర్షన్‌లోని అదే 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ల టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 255 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

తాజా సమాచారం ప్రకారం, భారత్‌లో ఇందులో డీజిల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. డీజిల్ వేరియంట్లలో 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 188 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే జతచేయబడి ఉంటుంది.
MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లీమోసిన్‌ను భారత మార్కెట్లోని ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ విభాగంలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఇది ఈ విభాగంలోనే అతి విశాలమైన కారుగా నిలుస్తుంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, జాగ్వార్ ఎక్స్‌ఈ మరియు వచ్చే నెలలో విడుదల కానున్న కొత్త 2021 ఆడి ఏ4 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ వచ్చే ఏడాది జనవరి నెల నుండి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న మొత్తం ప్రోడక్ట్ లైనప్ ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:టైటానిక్ షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు