Just In
- 53 min ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 1 hr ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 2 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 3 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- News
ఏడాదిలో సిద్దిపేటకు రైలు, వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి హరీశ్ రావు
- Movies
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- Sports
వెస్టిండీస్ టూర్ ముందు శ్రీలంకకు గట్టి షాక్.. ఇద్దరు ప్లేయర్లకు కరోనా
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్ యాక్టర్స్ ఉపయోగించే లగ్జరీ కార్లు
సాధారణంగా చాలామంది ధనవంతులు మరియు సెలబ్రెటీలు లగ్జరీ కార్లను ఉపయోగిస్తుంటారు. ఇది వరకే చాలామంది పొలిటికల్ లీడర్స్ మరియు పారిశ్రామికవేత్తలు ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇటీవల నూతన బాలీవుడ్ నటులు ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. !

బాలీవుడ్ నటులు నగరాలలో తిరగడానికి ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. చాలామంది సెలెబ్రెటీస్ లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. మనదేశంలోని లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా ఇతరదేశాలనుంచి కూడా కార్లను దిగుమతి చేసుకుంటారు. ఇలాంటి లగ్జరీ కారును కలిగి ఉండటం కూడా ఒక హోదాను తెలుపుతుంది.

భారతదేశంలో కొత్త తరం బాలీవుడ్ నటులయిన రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ కలిగి ఉన్న లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం..

రణవీర్ సింగ్
బాలీవుడ్ లో చాల ప్రసిద్ధి చెందిన వారిలో రణవీర్ సింగ్ ఒకరు. రణవీర్ సింగ్ సాధారణంగా లగ్జరీ కార్లపై ఎక్కువ ఆసక్తిని కల్గిన వాడు. అంతే కాకుండా ఇతడు తన గ్యారేజ్లో చాలా లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

తాజాగా లంబోర్ఘిని ఉరుస్ ని గతంలో డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉరుస్‌తో పాటు, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మేబాచ్, రేంజ్ రోవర్, జాగ్వార్ ఎక్స్‌జెఎల్‌లను కూడా కలిగి ఉన్నారు. అతను తన 32 వ పుట్టినరోజున ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్ ను కూడా కొన్నాడు.

విక్కీ కౌషల్
విక్కీ కౌషల్ బాగా ప్రసిద్ది చెందిన బాలీవుడ్ నటుడు. అతని గ్యారేజీలో చాలా విలాసవంతమైన కార్లను కలిగి ఉన్నాడు. 31 ఏళ్ల నటుడయిన విక్కీ కౌషల్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సిలను కలిగి ఉన్నాడు.

టైగర్ ష్రాఫ్
టైగర్ ష్రాఫ్ తన యాక్షన్ సినిమాతో మరియు అతని డ్యాన్స్ స్కిల్స్ వల్ల ఇండస్ట్రీలో బాగా ప్రాచుర్యం పొందాడు. ఈ బాలీవుడ్ నటుడు తన బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌ను ప్రయాణాలలో మరియు షూట్‌లకు తీసుకెళ్లడానికి ఇష్టపడతాడు. ఈ కారు మాత్రమే కాకుండా నటుడు ఎస్ఎస్ జాగ్వార్ 100 వంటి వాటిని కూడా కలిగి ఉన్నాడు.

వరుణ్ ధావన్
ప్రముఖ భారతీయ చిత్ర దర్శకుడి కుమారుడు ధావన్ కొన్ని ప్రత్యేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. ఈ నటుడు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, ఆడి క్యూ 7, ల్యాండ్ రోవర్ ఎల్ఆర్ 3, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి, మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ వంటి కార్లను కలిగి ఉన్నాడు. వరుణ్ ధావన్ సన్నిహితుడు సిద్దార్థ్ మల్హోత్రా కూడా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ కారుని కలిగి ఉన్నాడు.

అర్జున్ కపూర్
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ భారతదేశంలో మసెరటి లెవాంటే ఎస్‌యూవీని కొనుగోలు చేసిన తొలి నటుడు. ఇతడు తన పుట్టినరోజున ఈ ప్రత్యేక ఎస్‌యూవీని గిఫ్ట్ గా పొందాడు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త భారతదేశంలో మసెరటి లెవాంటే ఎస్‌యువిని కలిగిన రెండవ వ్యక్తి.