లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

ఫోర్స్ మోటార్స్ 2020 ట్రాక్స్ క్రూయిజర్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఫోర్స్ క్రూయిజర్ వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందే ముంబై మరియు పూణే రహదారులపై పరీక్షలకు గురిచేసింది.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

కొత్తగా రాబోయే ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ ను అనేక సూక్ష్మమైన మార్పులు మరియు నవీకరణలతో చూడవచ్చు. ఈ వాహనం యొక్క వెలుపల మరియు లోపల సరికొత్త డిజైన్లను కలిగి ఉంది. ఫ్రంట్ ఫాసియా కొత్త గ్రిల్, బంపర్ మరియు హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌తో పునఃరూపకల్పన చేయబడింది. కారు వెనుక భాగంలో నిలువుగా అమర్చిన టెయిల్ లాంప్ డిజైన్‌తో సహా సూక్ష్మమైన మార్పులు కూడా చేయబడ్డాయి.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

ఇది మునుపటి మోడల్ నుండి బాక్సీ ప్రొఫైల్ తో ముందుకు తీసుకువెళ్ళబడింది. అయితే కొత్త క్రీజ్ లైన్లు మరియు బాడీ డెకాల్స్‌తో డోర్స్ సవరించబడ్డాయి. కొత్త బ్లాక్ ప్లాస్టిక్ ఫ్లేర్డ్ వీల్ అసిస్ట్ మరియు ఫుట్‌బోర్డ్ తాజా బాహ్య రూపకల్పనకు తోడ్పడుతుంది.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

రాబోయే ట్రాక్స్ క్రూయిజర్ సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది అవుట్‌గోయింగ్ మోడల్‌లో కనిపించే దానికంటే ఎక్కువ ప్రీమియంను అనుభవిస్తుంది. ఇంటీరియర్‌లలోని ఇతర మార్పులను గమనించినట్లైతే డ్యూయల్ టోన్ కలర్ థీమ్, బ్లూ-లైట్ తో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఆడియో సిస్టమ్ కోసం సెంటర్ కన్సోల్‌ కూడా ఏర్పాటు చేయబడింది.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

ఫోర్స్ మోటార్స్ యొక్క 2020 ట్రాక్స్ క్రూయిజర్‌ ఎయిర్ కండిషనింగ్ మరియు వెనుక ప్రయాణీకుల కోసం పైకప్పుతో అమర్చిన వెంట్స్, సెంటర్ కన్సోల్-మౌంటెడ్ పవర్ విండో స్విచ్‌లు మరియు డ్యూయల్-టోన్ లేత గోధుమరంగు అప్హోల్స్టరీలను కలిగి ఉంది. రాబోయే ట్రాక్స్ క్రూయిజర్ యొక్క ఇంటీరియర్‌లలో చేసిన మార్పులు ఆహ్లాదకరమైన క్యాబిన్ అనుభూతిని ఇస్తాయి.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

2020 ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ లో కొత్త బిఎస్ 6 కంప్లైంట్ 2.6 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 90 bhp మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

2020 ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ సురక్షితంగా ఉండటానికి నిబంధనలకు అనుగుణంగా భద్రతా లక్షణాలతో సవరించబడింది. ఈ వాహనం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక డ్రమ్ బ్రేక్‌లతో కూడి ఉంటుంది.

ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ డ్రైవర్‌తో సహా 13 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ముందు భాగంలో రెండు సీట్లు, మధ్యలో మూడు, మరియు వరుసగా అమర్చిన రెండు బెంచ్ సీట్లు ఉన్నాయి. ఒక్కొక్క సీటులో నలుగురు ప్రయాణికులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది.

లాంచ్ చేయడానికి ముందే స్పైడ్ టెస్ట్ చేసిన ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్తగా ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ చాలా కొత్త నవీనీకరణలను కలిగి ఉంటుంది. ఇది వాణిజ్య రావణాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒకే సారి ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణించడానికి అనుకూలంగా తయారు చేయబడింది. ఏది ఏమైనా ఈ వాహనం ఇప్పటి తరానికి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇది త్వరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.

 

Most Read Articles

English summary
Force Trax Cruiser Production Spec Spied Testing Ahead Of Launch: Spy Pics & Details. Read in Telugu.
Story first published: Sunday, March 15, 2020, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X