ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ ఫోర్డ్ ఎండీవర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫోర్డ్ ఎండీవర్ స్పోర్ట్ పేరిట కంపెనీ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఫోర్డ్ నుండి రానున్న లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో కొనసాగుతున్న ఈ పండుగ కాలంలో ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే కొత్త ఫోర్డ్ ఎండీవర్ స్పెషల్ ఎడిషన్‌ను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా మోటార్‌బీమ్ తమ కెమెరాలో బంధించింది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఫోర్డ్ క్యామోఫ్లేజ్ లేకుండా కొత్త ఎండీవర్‌ను చూస్తుంటే, ఇది విడుదలకు సిద్ధంగా ఉన్న మోడల్‌గా తెలుస్తోంది. ఈ స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త ఫోర్డ్ ఎండీవర్ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ‘స్పోర్ట్' అని పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వాహనాన్ని తమిళనాడులో టెస్టింగ్ చేస్తున్నారు.

MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఈ టెస్టింగ్ వాహనాన్ని రాత్రి సమయంలో తక్కువ లైట్‌లో క్యాప్చూర్ చేసిన కారణంగా, స్పై చిత్రాలలో ఈ ఎస్‌యూవీ గురించిన చాలా వివరాలు సరిగ్గా వెల్లడి కాలేదు. ఇందులో టెయిల్‌గేట్‌కు దిగువ-ఎడమ వైపున ఉంచబడిన ‘స్పోర్ట్' బ్యాడ్జింగ్‌ను మనం గమనించవచ్చు. అలాగే, డార్క్ మెటాలిక్ గ్రే పెయింట్ స్కీమ్‌లో ఫినిష్ చేసిన చక్రాలను కూడా చూడొచ్చు. ఈ తరహా చక్రాలను ఇదివరకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో కూడా ఉపయోగించారు.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ ధరలు రూ.29.99 లక్షల నుండి రూ.33.42 లక్షల మధ్యలో ఉన్నాయి ( ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ టైటానియం ప్లస్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది దాని మునుపటి బిఎస్4 మోడళ్లతో పోలిస్తే దాని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‌లలో చిన్నపాటి మార్పులను కలిగి ఉంది. ఇందులో బిఎస్6 2.0 లీటర్ ఎకోబ్లూ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 168 బిహెచ్‌పి పవర్‌ను మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఈ ఇంజన్ ఫోర్డ్ బ్రాండ్ యొక్క ‘సెలెక్ట్-షిఫ్ట్' టెక్నాలజీతో తయారు చేసిన 10-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని టాప్-ఎండ్ వేరియంట్లో ఆప్షనల్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

కొత్త 2020 ఫోర్డ్ ఎండీవర్‌లో ఆల్-ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ‘ఫోర్డ్‌పాస్' కూడా లభిస్తుంది. దీని సాయంతో వాహన యజమానులు తమ ఎస్‌యూవీని రిమోట్‌గా నియంత్రించడం మరియు వాహన సమాచారాన్ని తెలుసుకోవడం చేయవచ్చు.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పానోరమిక్ సన్‌రూఫ్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఫోర్డ్ ఇండియాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ‘ఫ్లెయిర్' అని పిలిచే ఈ కొత్త వేరియంట్ ధర రూ.7.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీలో కొత్త వేరియంట్ రానుందా?

ఫోర్డ్ ఎండీవర్‌లో రానున్న కొత్త లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం భారత్‌లో పండుగ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో, మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను, స్పెషల్ ఎడిషన్లను విడుదల చేస్తున్నాయి. ఫోర్డ్ ఇండియా కూడా ఇదే కోవలో స్పెషల్ ఎడిషన్ మోడళ్లను అందించాలని చూస్తోంది. ఫోర్డ్ నుండి రానున్న కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎండీవర్ స్పోర్ట్ కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

Source: Motorbeam

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India seems to be working on a special edition of its flagship model, the Endeavour SUV. The upcoming limited edition SUV could be launched sometime during the ongoing festive season in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X