టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయించిన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టొయోటా గ్లాంజా‌లో ఫ్యూయెల్ పంప్ సమస్య తలెత్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ సమస్యను సరిచేసేందుకు సుమారు 6,500 యూనిట్ల టొయోటా గ్లాంజా కార్లను రీకాల్ చేస్తున్నట్లు టొయోటా తెలిపింది. గత 2019 ఏప్రిల్ 2వ తేదీ నుండి అక్టోబర్ మవ తేదీ మధ్య కాలంలో తయారు చేసిన గ్లాంజా కార్లకు ఈ రీకాల్ వర్తిస్తుందని టొయోటా వివరించింది.

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

టొయోటా గ్లాంజా రీకాల్‌కు సంబంధించిన కంపెనీ డీలర్లు సంబంధిత వాహనాల యజమానులను సంప్రదిస్తాయి. సదరు డీలర్లు వాహన యజమానుల నుంచి ఎటువంటి అదనపు మొత్తాన్ని వసూలు చేయకుండా ఈ సమస్యను ఉచితంగా సరిచేస్తారు. రీకాల్‌కు గురైన కార్లలో ఫ్యూయెల్ పంపులను తనిఖీ చేసి అవసరమైతే రీప్లేస్ చేస్తారు.

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

మారుతి సుజుకి అందిస్తున్న బాలెనో హ్యాచ్‌బ్యాక్‌కి రీడిజైన్ చేయబడిన మోడలే ఈ కొత్త టొయోటా గ్లాంజా. కాకపోతే, ఈ కారును టొయోటా తమ బ్రాండ్‌కు తగినట్లుగా సిగ్నేచర్ ఫీచర్లతో డిజైన్ చేసుకుంది. ఈ డిజైన్ మార్పులలో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బూట్ లిడ్‌పై క్రోమ్ లిప్ మరియు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:గర్భిణీ స్త్రీకి సహాయం చేసినందుకు ఇబ్బందుల్లో పడిన ఆటో డ్రైవర్ ; ఎలానో తెలుసా ?

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

ఈ కారులో ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఆధారిత నావిగేషన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

టొయోటా గ్లాంజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, స్మార్ట్ ఎంట్రీ, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రోక్రోమిక్ ఇన్నర్ రియర్ వ్యూ మిర్రర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఫస్ట్ రెస్పాండర్ మోటార్ సైకిళ్లను అందించిన హీరో మోటోకార్ప్

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

ఈ కారులో బాలెనోలో ఉపయోగించిన 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది రెండు విభిన్న ట్యూనింగ్‌లలో లభిస్తుంది. అందులో ఒకటి 88.4 బిహెచ్‌పి మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్. మరొకటి 81.7 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసే సివిటి ట్రాన్సిమిషన్ వేరియంట్.

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

టొయోటా గ్లాంజా మొత్తం ఐదు వేరియంట్లు మరియు ఐదు రంగుల ఆప్షన్లతో లభిస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ మోడల్ ధరలు రూ.7.07 లక్షల నుంచి రూ.9.02 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్న ముంబై ట్రాఫిక్ క్లియర్ వాహనం, ఇది

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

ఇక టయోటా సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవల తమ బిడాడి ప్లాంట్ వద్ద కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశామని, జూలై 22 వరకు ప్లాంట్ మూసివేయబడుతుందని ప్రకటించింది. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తిని ఆపాలని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో, టొయోటా తమ ప్లాంట్‌ను కూడా మూసివేసింది.

టొయోటా గ్లాంజా కార్లలో ఫ్యూయెల్ పంప్ లీక్ సమస్య - రీకాల్

టొయోటా గ్లాంజా రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి బాలెనో ప్లాట్‌ఫామ్‌పైనే టొయోటా గ్లాంజా కారును తయారు చేశారు. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి కూడా తమ బాలెనో మోడళ్లను రీకాల్ చేసింది. ముందుగా మారుతి తమ బాలెనో కార్ల కోసం ఈ రీకాల్‌ను ప్రకటించింది, ఆ తర్వాత టొయోటా కూడా తమ గ్లాంజా కార్లను రీకాల్ చేసింది.

MOST READ:బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు చాలామంది ఇష్టపడే బైక్ ఇదే

Most Read Articles

English summary
Toyota Recalls Glanza Models Over Possible Fuel Pump Fault. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X