బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

సాధారణంగా సెలబ్రెటీలు అత్యంత విలాసవంతమైన మరియు లగ్జరీ వాహనాలను ఉపయోగిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. కానీ వాళ్ళుకూడా మనలాగా చాలా సింపుల్ కార్లను ఉపయోగిస్తారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రెటీస్ ఉపయోగించి సాధారణ కార్లను గురించి ఇక్కడ తెలుసుకుందా.. !

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

జాన్ అబ్రహం

మారుతి సుజుకి జిప్సీ

ప్రముఖ ఇండియన్ బాలీవుడ్ నటుడు అయిన జాన్ అబ్రహం సాధారణంగా ఆటో మొబైల్ ఔత్సాహికుడు. యితడు నిస్సాన్ జిటి-ఆర్ వంటి కొన్ని సూపర్ బైకులను, లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. కేవలం లగ్జరీ వాహనాలను మాత్రమే కాకుండా జాన్ అబ్రహం ప్యూరిస్ట్ మరియు మారుతి సుజుకి జిప్సీ వంటి నార్మల్ కార్లను కూడా కలిగి ఉన్నాడు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

ఈ మారుతి సుజుకి జిప్సీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో నిలిపివేయబడింది. కానీ జాన్ అబ్రహం తన తెల్లని మారుతి సుజుకి జిప్సీని వినియోగిస్తూనే ఉన్నాడు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

జాకీ ష్రాఫ్

టయోటా ఇన్నోవా

జాకీ ష్రాఫ్ బెంట్లీ వంటి అత్యంత లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా టయోటా ఇన్నోవా వంటి కారుని కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా వాహనదారులు అందరూ మంచి డ్రైవింగ్ కోసం ఎంచుకునే వాటిలో ఇది ముఖ్యమైనది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. జాకీ ష్రాఫ్ ఇప్పటికి ఈ టయోటా ఇన్నోవాను క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాడు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

అనిల్ కపూర్

టాటా సఫారి స్టార్మ్

అనిల్ కపూర్ 40 సంవత్సరాలు నటుడిగా ఉంటూ, మిస్టర్ ఇండియాగా చాలా మంది ప్రజల దృష్టిని ఆకర్శించాడు. మిస్టర్ ఇండియాగా ప్రజల దృష్టిని ఆకర్షించిన అనిల్ కపూర్ విలాసవంతమైన మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ మరియు ఆడి నుండి ఫ్లాగ్‌షిప్ వంటి లగ్జరీ సెడాన్లను కలిగి ఉన్నాడు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

ఇంతటి లగ్జరీ కార్లను కొన్న అనిల్ కపూర్ టాటా సఫారీ స్టార్మ్ వంటి సాధరణ ఎస్‌యువిని కూడా కలిగి ఉన్నాడు. ఈ కారు టీవీ సిరీస్‌ను ప్రోత్సహించడానికి కార్‌మేకర్ అతనికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

అమీర్ ఖాన్

టయోటా ఫార్చ్యూనర్

ప్రస్తుతం భారతదేశంలో ఉత్తమ నటులలో ఒకడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని కూడా పిలువబడే అమీర్ ఖాన్ బెంట్లీ కాంటినెంటల్ జిటి మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్-గార్డ్ లతో సహా లగ్జరీ కార్ల సముదాయాన్ని కలిగి ఉన్నారు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

అయితే సాధారణ కార్ల విషయానికి వస్తే, అతను టయోటా ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 500 తో సహా కొన్నింటిని కలిగి ఉన్నాడు. ఎక్కువగా లగ్జరీ కార్ల కంటే కూడా ఈ వాహనాలను ఉపయోగిస్తుంటాడు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

నానా పటేకర్

మహీంద్రా సిజె 4 ఎ

ప్రముఖ నటుడైన నానా పటేకర్ చాలా సింపుల్ గా జీవిస్తుంటాడు. అంతే కాకుండా ఏ ఫాన్సీ కారు ఇతని వద్ద లేదు. అయితే నానా పటేకర్ మహీంద్రా సిజె 4 ఎ జీప్ కలిగి ఉన్నాడు. అరుదుగా ఈ కార్లో బయట తిరుగుతుంటాడు. ఈ కారు ఎడారి రంగులో పూర్తయింది మరియు 2.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తినిస్తుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

గుల్ పనాగ్

మహీంద్రా స్కార్పియో గెటావే

సాధారణంగా సాహసోపిత చర్యలు చేసే గుల్ పనాగ్ తరచుగా మోటార్ సైకిల్‌తో పర్వతాలలో కనిపిస్తుంది. గుల్ పనాగ్ భారీగా అనుకూలించబడిన మహీంద్రా స్కార్పియో గెటావే కారుని కలిగి ఉంది. ఎక్కువగా గుల్ పనాగ్ ఈ మహీంద్రా స్కార్పియోని ఉపయోగిస్తూ ఉంటుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

బిపాషా బసు

టయోటా ఫార్చ్యూనర్

ప్రముఖ బాలీవుడ్ నటి అయినా బిపాషా బసు తెలుపు రంగు టయోటా ఫార్చ్యూనర్‌ను కలిగి ఉంది. ఇది మంచి విశ్వసనీయత కలిగిన వాహనం. చాలా ఎక్కువగా ఈమె ఈ కారుని ఉపయోగిస్తూ ఉంటుంది. చాలా విలాసవంతమైన కార్లను మాత్రమే కాకుండా ఇలాంటి సాధారణ వాహనాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

కిమ్ శర్మ

టాటా నానో

ప్రపంవచంలోనే అతి తక్కువ ధర కలిగిన కారులలో ఒకటి ఈ టాటా నానో. ఇది చాలా మంది వాహనదారులు ఉన్నపయోగిస్తున్నారు. కానీ సాధారణంగా సెలెబ్రెటీలు ఇలాంటి కార్లను ఉపయోగించరు. కానీ కిమ్ శర్మ మాత్రం నానో కారుని ఎక్కువగా ఉపయోగిస్తుంది. నగర ట్రాఫిక్ దృష్ట్యా కిమ్ శర్మ ఎక్కువ నానోలో తిరుగుతూ ఉంటుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

దిషా పటాని

హోండా సివిక్, చేవ్రొలెట్ క్రూజ్

బాలీవుడ్ యువ నటి అయిన దిశా పటాని రెండు సదాహరణ కార్లను ఉపయోగిస్తుంది. ఇవి చేవ్రొలెట్ క్రూజ్ మరియు హోండా సివిక్ కార్లు. ఈ రెండు కార్లు డి సెగ్మెంట్ సెడాన్లు.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

సాధారణంగా దిశా పటాని మెర్సిడెస్ ఇ-క్లాస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ లేదా బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్‌ వంటి విలాసవంతమైన కార్లను కూడా కలిగి ఉంది. ఈ లగ్జరీ కార్లను కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. అయితే కొంత కాలంగా ఈ హోండా సివిక్, చేవ్రొలెట్ క్రూజ్ వంటి కార్లను ఉపయోగిస్తుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

మలైకా అరోరా

టయోటా ఇన్నోవా క్రిస్టా

మలైకా అరోరా సాధారణంగా రేంజ్ రోవర్ వంటి కార్లలో తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ లగ్జరీ వాహనాలు మాత్రమే కాకుండా టయోటా ఇన్నోవా క్రిష్టా వంటి కారుని కూడా కలిగి ఉంది. ఎక్కువగా అరోరా ఈ కారునే ఉపయోగిస్తుంది.

బాలీవుడ్ సెలబ్రెటీస్ వాడే ఈ కార్లు చూస్తే షాక్ అవ్వలసిందే.. ?

అంతే కాకూండా మలైకా అరోరా స్వయంగా ఈ టయోటా ఇన్నోవా క్రిష్టా కారుని నడపడం కూడా గుర్తించబడింది. మలైకా టయోటా కారు 2.7-లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్‌ను కలిగి ఉంది. ఇది డ్రైవింగ్ చేయడానికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Most Read Articles

English summary
HUMBLE cars of Bollywood: Kim Sharma’s Tata Nano to John Abraham’s Maruti Gypsy. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X