Just In
Don't Miss
- Sports
ICC T20 Rankings: రాహుల్ ర్యాంక్ పదిలం.. దూసుకెళ్లిన కాన్వే
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. ఇది భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్
భారతదేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లాంచ్ అయింది. భారతదేశంలో లాంచ్ అయిన ఈ మొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ వాహనాల కంటే వాటి నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నందున, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై శ్రద్ధ చూపుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు దేశానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ఎక్కువ ప్రయోజనాలను తీసుకువస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం వల్ల ముడి చమురు దిగుమతి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలు లాగా ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణాన్ని కలుషితం చేయవు.

గాలి కాలుష్యంతో బాధపడుతున్నప్రజలకు భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం అనేది ఒక వరంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో స్కూటర్లు, బైక్‌లు మరియు కార్లను మాత్రమే ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు లేవు.

ఇప్పుడు వ్యవసాయ వాహనాలు లేవన్న కొరత తీరిపోయింది. భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ సంస్థ సెలిస్టియల్ ఇ మొబిలిటీ ప్రారంభించింది. పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనం అత్యంత అధునాతన లక్షణాలను కలిగి ఉంది. ఈ 6 హెచ్‌పి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 21 హెచ్‌పి డీజిల్ ఇంజన్ ట్రాక్టర్‌కు సమానం.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత 75 కిలోమీటర్ల వరకు కదిలే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ 18bhp శక్తిని మరియు 53 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి.

ట్రాక్టర్ బ్యాటరీని ఎక్స్ఛేంజ్ టెక్నాలజీతో పవర్ సాకెట్‌లో ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీపై ఛార్జ్ క్షీణించినట్లయితే ట్రాక్టర్‌ను ఇప్పటికే ఛార్జ్ చేసిన మరో బ్యాటరీని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఆపరేట్ చేయవచ్చు. ఇది బ్యాటరీ రీఛార్జ్ అయ్యే వరకు వేచి ఉండకుండా చేస్తుంది.

ఈ ట్రాక్టర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం తిరిగి ఉత్పత్తి చేసే బ్రేక్‌లు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అన్ని అధునాతన సౌకర్యాలను కలిగి ఉంటుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను విక్రయించాలని ఇ మొబిలిటీ యోచిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను రూ. 5 లక్షల కన్నా తక్కువకు విక్రయించాలని ఇ మొబిలిటీ యోచిస్తోంది.

పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి. ట్రాక్టర్ ధర రూ. 5 లక్షల రూపాయల కన్నా తక్కువకు విక్రయిస్తే, ఎక్కువగా రైతుల ఆదరణను పొందే అవకాశం ఉంది. ఇది దేశ వ్యవసాయ రంగంలో కొత్త విప్లవాన్ని తెస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఇది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
Source: Krishijagran