Just In
- 1 hr ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 2 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
- 3 hrs ago
కొత్త 2021 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ వస్తోందోచ్..
- 4 hrs ago
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
Don't Miss
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
ఐపీఎల్లో సురేశ్ రైనా సంపాదన రూ.100 కోట్లు.. నాలుగో ఆటగాడిగా రికార్డు!
- Movies
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతీయ మహిళా సింగర్స్ యొక్క లగ్జరీ కార్లు ఎలా ఉన్నాయో చూడండి
సాధారణంగా సెలెబ్రెటీలు చాలా విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తుంటారు. ఇది వరకే మనం బాలీవుడ్ యాక్టర్స్ ఉపయోగించే లగ్జరీ కార్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భారతదేశంలో ప్రతిభావంతులైన సింగర్స్ ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సింగర్స్ నేహా భాసిన్, నేహా కక్కర్, సోను కక్కర్, కనికా కపూర్ వంటి వారు ఉపయోగించే విలాసవంతమైన లగ్జరీ కార్లు ఇక్కడ ఉన్నాయి.

నేహా కక్కర్:
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సింగర్స్ లో ఒకరు నేహా కక్కర్. ఈమె సంగీత పరిశ్రమలో చాలా బహుముఖ గాయకులలో ఒకరు. ఆమె నాలుగేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించింది. ఇండియన్ సింగింగ్ రియాలిటీ షో, ఇండియన్ ఐడల్ లో కూడా ఆమె పాల్గొంది.

నేహా కక్కర్ చాలా విలాసవంతమైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 350 కారుని కలిగి ఉంది. దీనిని ఆమె 2018 సంవత్సరంలో కొనుగోలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

కనికా కపూర్:
భారతీయ సంగీత పరిశ్రమలో బాగా సుపరిచితమైన సింగర్ కనికా కపూర్. "జుగ్ని జీ" పాటతో అరంగేట్రం చేసినప్పటి ఈమె భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా 'బేబీ డాల్' పాటతో ఆమె బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్ వృత్తిని ప్రారంభించింది. కనికా కపూర్ త పాటలతో ఎన్నో ప్రశంసలు అందుకుంది.

కనికా కపూర్ ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు వంటి అనేక అవార్డులను సాధించింది. 41 ఏళ్ల గాయని మరియు స్వరకర్త అయిన ఈమె 2012 లో విడాకులు తీసుకున్న తరువాత ప్లేబ్యాక్ సింగర్‌గా మారడానికి ముంబైకి మకాం మార్చింది. ఈమె ఆడి క్యూ 7 లగ్జరీ కారుని కలిగి ఉంది. ఈ గాయని తన ఆడి క్యూ 7 ఎస్‌యూవీలో పలు సందర్భాల్లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

నేహా భాసిన్:
నేహా భాసిన్ ప్రముఖ ఇండియన్ సింగర్. ఈమె పాటల రచయిత మాత్రమే కాకుండా బాలీవుడ్, తమిళం, తెలుగు వంటి పలు చిత్ర పరిశ్రమల సహకారం కోసం పాటలు పాడింది. ఇండియన్ పాప్ మరియు పంజాబీ జానపద సంగీతం తరంలో స్వతంత్ర సంగీత సృష్టికర్తగా కూడా ఆమె బాగా ప్రాచుర్యం పొందింది.

నేహా భాసిన్ రెండు ఫిలింఫేర్ అవార్డులతో పాటు వివిధ ప్రశంసలు పొందింది. ప్రముఖ గాయనిగా ప్రసిద్ధి చెందిన ఈమె తన భర్త పేరు మీద నమోదు చేయబడిన మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ కారును కలిగి ఉంది.

సోనా మోహపాత్ర:
సోనా మోహపాత్రా ఒక ప్రముఖ భారతీయ గాయని. ఈమె సంగీత స్వరకర్త మరియు గీత రచయిత. సోనా మోహపాత్ర అనేక ఆల్బమ్‌లు, కచేరీలు, సింగిల్స్, మ్యూజిక్ వీడియో మరియు బాలీవుడ్ సినిమాల్లో పనిచేశారు.

సోనా మోహపాత్ర ప్రధాన గాయకురాలిగా ఉన్న 'సత్యమేవ్ జయతే' షో నుండి ప్రధాన స్రవంతి ప్రాముఖ్యతను పొందింది. 'ఢిల్లీ బెల్లీ', 'ఫుక్రే', 'తలాష్' మరియు మరిన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె పనిచేశారు. ఈ ఫ్యామస్ ఇండియన్ సింగర్ మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్ కారుని కలిగి ఉంది.

సోను కక్కర్:
భారతీయ సింగర్స్ లో ఒక ప్రత్యేక గుర్తిపును పొందిన సింగర్ సోను కక్కర్. ఈమె భారతీయ ప్లేబ్యాక్ గాయకులలో ఒకరు.అంతే కాకుండా చాలా ప్రత్యేకమైన వాయిస్‌తో బహుమతి పొందిన ప్రముఖ భారతీయ ప్లేబ్యాక్ సింగర్ గా కూడా ప్రసిద్ధి చెందింది.

సోను కక్కర్ బాబుజీ జారా ధీరే చలో పాటతో ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి ఆమె బి-టౌన్ పరిశ్రమలో ప్రత్యేక స్వరానికి బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె సోను కక్కర్ మరియు టోనీ కక్కర్ లకు పెద్ద సోదరి. వీరు ఇద్దరూ చాలా ప్రముఖ బాలీవుడ్ గాయకులు. ఆమె సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ జిటి లగ్జరీ లైన్‌ను కలిగి ఉంది.ఈ లగ్జరీ కారుని ఆమె భర్త - నిరాజ్ శర్మ గిఫ్ట్ గా ఇచ్చారు.