ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

లెగో (LEGO) అంటే ఇష్టపడని పిల్లలు పెద్దలు ఎవ్వరూ ఉండరు. మెదడుకు పదును పెట్టే ఈ లెగోస్‌లో ఇప్పుడు మొట్టమొదటి సారిగా ఓ జీప్ బ్రాండ్ వాహనం వచ్చి చేరింది. అవును, ఇప్పటి వరకూ లెగో అనేక బ్రాండ్ల వాహనాలను తయారు చేసింది కానీ, జీప్ బ్రాండ్ వాహనాల లెగోలను మాత్రం తయారు చేయలేదు.

ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

లెగో తమ మొట్టమొదటి జీప్ బ్రాండ్ వాహనంగా 'జీప్ వ్రాంగ్లర్ రూబికాన్' మోడల్‌ను ఎంచుకుంది. ఇందులో ఓపెన్‌టాప్ మోడల్ లెగోను తయారు చేసింది. ఈ మోడల్‌ని కొత్త జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ లెగో టెక్నిక్ పేరుతో పిలువనున్నారు.

కొత్త జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ లెగో టెక్నిక్ మోడల్ జనవరి 1, 2021వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. ఇది 9 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఉద్దేశించి తయారు చేయబడినది. మార్కెట్లో ఈ స్కేల్ మోడల్ ధరను 49.99 డాలర్లు (ప్రస్తుత మారకపు విలువ ప్రకారం సుమారు రూ.3,700)గా నిర్ణయించారు.

ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ లెగో టెక్నిక్ మోడల్‌ను నిజమైన జీప్ రాంగ్లర్ రూబికాన్ ఎస్‌యూవీలో ఉండే అన్ని వివరాలను ప్రతిబింబించేలా తయారు చేశారు. ఈ స్కేల్ మోడల్ లెగోలో మొత్తం 665 భాగాలు ఉంటాయి. అంతేకాకుండా, ఇందులో పూర్తిగా పనిచేసే ఫ్రంట్ స్టీరింగ్ సిస్టమ్ మరియు యాక్సిల్-ఆర్టిక్యులేషన్ సస్పెన్షన్ కూడా ఉంటుంది.

లెగో టెక్నిక్ మోడల్‌లోని ఇతర వివరాలను గమనిస్తే, ఇందులో మడతపెట్టడానికి వీలుగా ఉండే వెనుక సీటు, తెరవడం మరియు మూసివేయడానికి వీలుగా ఉండే తలుపులు, ఫుల్ సైజ్ స్పేర్ వీల్ మరియు ఒక వించ్ ఉంటాయి. ఈ స్కేల్ మోడల్ చుట్టూ అన్ని క్లాసిక్ జీప్ బ్రాండింగ్స్ కూడా కనిపిస్తాయి.

MOST READ: 27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ లెగో కిట్ విడిభాగాలుగా వస్తుంది. దీనిని పూర్తిగా అసెంబుల్ చేసిన తర్వాత ఈ స్కేల్ మోడల్ 12 సెం.మీ ఎత్తును, 24 సెం.మీ పొడవును మరియు 13 సెం.మీ వెడల్పును కలిగి ఉంటుంది. దీని ఓవరాల్ పెయింట్ స్కీమ్ బ్లాక్ అండ్ యల్లో కలర్‌లో ఉంటుంది.

జీప్ వ్రాంగ్లర్‌కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, అమెరికాకు చెందిన ప్రముఖ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ ఇటీవలే తమ కొత్త ప్రొడక్షన్ వెర్షన్ 2021 వ్రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ఇది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానుంది.

ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

కొత్త జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీలో శక్తివంతమైన 6.4-లీటర్ వి8 ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 470 బిహెచ్‌పి పవర్‌ను మరియు 637 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్యాడల్ షిఫ్టర్లతో కూడిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఇందులో 4 డబ్ల్యుడి ఆటో, 4 డబ్ల్యుడి హై, న్యూట్రల్ మరియు 4 డబ్ల్యుడి లో మోడ్‌లతో కూడిన సెలెక్ట్-ట్రాక్ 4 డబ్ల్యుడి సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ లక్షణాలతో ఇది మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

లెగో మోడల్ జీప్ వ్రాంగ్లస్ టెక్నిక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

లెగో తయారు చేసే స్కేల్ మోడల్ వాహనాలు మంచి కలెక్టబుల్స్‌గా ఉంటాయి. లెగో మొట్టమొదటి సారిగా ఓ జీప్ బ్రాండ్ వాహనాన్ని, అందులోనూ అత్యంత పాపులర్ అయిన వ్రాంగ్లర్ రూబికాన్ మోడల్‌ను లెగో స్కేల్ మోడల్ రూపంలో తయారు చేసింది. రియర్ వలర్డ్ వ్రాంగ్లర్ రూబికాన్‌లో కనిపించే ప్రతి డీటేల్‌ని ఈ స్కేల్ మోడల్ లెగోలో కూడా చూడొచ్చు.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
LEGO has unveiled its first-ever LEGO model of a Jeep SUV called Jeep Wrangler Rubicon Lego Technic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X