కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

కొరియన్ కార్ బ్రాండ్ 'కియా మోటార్స్' తమ సెల్టోస్ ఎస్‌యూవీతో ఆగస్ట్ 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో వచ్చిన 'కియా సెల్టోస్' కు భారత మార్కెట్లో విపరీతమైన సానుకూల స్పందన లభించింది, అంతేకాదు ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా కూడా రికార్డు సృష్టించింది.

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

కాగా.. ఇప్పుడు కియా సెల్టోస్ ఇప్పుడు మరో కొత్త పవర్‌ట్రైన్‌తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో కియా తమ సెల్టోస్ ఎస్‌యూవీలో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తుందనే పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లకు ఎలాంటి ధృవీకరణలు లేకపోవటంతో అవి పుకార్లుగానే నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడు కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ధృవీకరించే వివరాలను ఐఎబి విడుదల చేసింది.

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ఈ వివరాలను గమనిస్తే.. కొత్త కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఈ కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత దశల వారీగా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా డిమాండ్‌ని బట్టి కియా తమ ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశం ఉంది.

MOST READ: ఏబిఎస్ అంటే ఏమిటి, ఎలా పని చేస్తుంది, చరిత్ర?

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ఈ నివేదికల ప్రకారం, కియా తమ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని చైనా మార్కెట్లో నెక్స్ట్ జనరేషన్ కియా KX3 EV గా ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత తరం KX3 EV మోడల్‌ను హ్యుందాయ్ క్రెటా యొక్క అండర్‌పిన్నింగ్స్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇందులో 45.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 110bhp మరియు 285Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ఇందులో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒక పూర్తి ఛార్జీపై గరిష్టంగా 300 కిలోమీటర్ల రేంజ్‌ని ఆఫర్ చేస్తుందని మరియు ఇది గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని సమాచారం.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ఇంటర్నెట్‌లో లీక్ అయిన వివరాల ప్రకారం, చైనా మార్కెట్లో విడుదల కానున్న కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ కారును స్టాండర్డ్ మరియు లాంగ్-రేంజ్ అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. కియా భాగస్వామ్య కంపెనీ అయిన హ్యుందాయ్ అందిస్తున్న కోనా ఎలక్ట్రిక్ వాహనానికి సెల్టోస్ ఎలక్ట్రిక్ వాహనానికి అనేక సిమిలారిటీలు ఉండొచ్చని అంచనా.

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ఇక భారత మార్కెట్ విషయానికి వస్తే.. మార్కెట్ డిమాండ్ మరియు ఎలక్ట్రిక్ వానాల ధరను పరిగణలోకి తీసుకుంటే ఈ ప్రీమియం కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ కారు ఇక్కడి మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

MOST READ: స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లభిస్తున్న కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తోంది, అందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి, ఇవి రెండూ 115 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇకపోతే ఇందులోని 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మూడు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోనూ అలాగే విభిన్న ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

ప్రస్తుతం ఈ కొరియన్ బ్రాండ్ భారత మార్కెట్లో మూడవ ఉత్పత్తిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో కియా ప్రదర్శించిన సరికొత్త కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని రాబోయే నెలల్లో మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్‌కి దిగువన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్‌ను ప్రవేశపెట్టనున్నారు - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

కియా సెల్టోస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్, ఇండియాలో విడుదల లేనట్లే..!

కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇంటర్నెట్‌లో లీక్ అయిన వివరాల ప్రకారం, కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రత్యేకించి చైనా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి భారత మార్కెట్లోకి కియా సెల్టోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదలయ్యే అవకాశాలు చాలా అరుదుగా ఉన్నాయి, వాస్తవానికి ఇదేమీ చెడు ఆలోచన కాదు. ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా పెట్రోల్/డీజిల్ వెర్షన్ల మాదిరిగానే సక్సెస్ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Kia Motors entered the Indian market back in August 2019 with the Seltos SUV. The Kia Seltos positioned in the mid-size SUV segment in India received an extremely overwhelming response and soon became the best-selling car in the country as well. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more