లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ (Lamborghini) కోవిడ్-19 లాక్‌డౌన్ 5.0లో ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గడచిన రెండు నెలలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాంబోర్గినీ, ఇకపై దేశంలో అన్ని డీలర్‌షిప్ కేంద్రాలను మరియు వర్క్‌షాప్‌లను తిరిగి ప్రారంభించింది.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఢిల్లీ, ముంబై మరియు బెంగుళూరు నగరాల్లోని అన్ని డీలర్‌షిప్ కేంద్రాలను, సర్వీస్ సెంటర్లను కంపెనీ రీఓపెన్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలకు లోబడి అన్ని భద్రతా చర్యలను తీసుకుంటూ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు లాంబోర్గినీ తెలిపింది. షోరూమ్‌లలో పనిచేసే సిబ్బంది, షోరూమ్‌కి విచ్చేసే సందర్శకులు మరియు కస్టమర్ల సేఫ్టీ విషయంలో పూర్తి శానిటైజేషన్ పద్ధతులను పాటించనున్నట్లు పేర్కొంది.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఈ సందర్భంగా లాంబోర్గినీ ఇండియా అధికారి శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు డీలర్‌షిప్ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి తమకెంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు మరియు భద్రతా నియమాలను వంద శాతం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. షోరూమ్‌లలో పనిచేసే సిబ్బంది, షోరూమ్‌కి విచ్చేసే సందర్శకులు మరియు కస్టమర్ల సేఫ్టీకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

MOST READ:బ్రేకింగ్ న్యూస్.. మోటార్ వెహికల్స్ డాక్యుమెంట్ వాలిడిటీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌లు మరియు వర్క్‌షాపులలో ఆరోగ్యం మరియు భద్రత విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేశామని, మరింత రెట్టింపు ఉత్సాహంతో మరియు అంతే సురక్షితమైన పద్దతిలో తమ కస్టమర్లకు సేవలందించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని శరద్ వివరించారు.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఇక లాంబోర్గినీ విషయానికి వస్తే.. కంపెనీ ఇటీవలే తమ పాపులర్ హురాకన్ ఈవిఓ రియర్ వీల్ డ్రైవ్ స్పైడర్ వాహనాన్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. కన్వర్టిబల్ డిజైన్‌తో విడుదలైన ఈ కారులో కొత్త ఫ్రంట్ స్ప్లిట్టర్, వెర్టికల్ ఫిన్స్, లార్జ్ ఎయిర్ డ్యామ్స్ వంటి కాస్మోటిక్ మార్పులను గమనించవచ్చు.

MOST READ: మీకు తెలుసా.. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్‌

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

లాంబోర్గినీ హురాకన్ కన్వర్టిబల్ సాఫ్ట్ టాప్ రూఫ్‌తో వస్తుంది, ఈ రూఫ్ వద్దునుకుంటే మనం వెనుక వైపు ఉన్న హుడ్‌లోకి మడచేయవచ్చు. ఇదంతా కేవలం 17 సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. కస్టమర్ల కోసం ఇందులో విభిన్న కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

హురాకన్ ఈవిఓ రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్ కారులో పవర్‌ఫుల్ వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 610 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే ఇది 0-100 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ కారు గరిష్ట వేగాన్ని ఎలక్ట్రికల్‌గా గంటకు 324 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

MOST READ: పెట్రోల్ అవసరం లేని వ్యాగన్ఆర్ వచ్చేస్తోంది!

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఈ కారు ఇంటీరియర్‌లో 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో లాంబోర్గినీ అందించే డిఫాల్ట్ సాఫ్ట్‌వేర్‌తో పాటుదా ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంటుంది.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

ఈ సరికొత్త హురాకన్ సూపర్ కారులో పి-టిసిఎస్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కూడా జోడించారు. షార్ప్ కార్నల్‌లో టర్న్ తీసుకున్నప్పుడు లేదా డ్రిఫ్టింగ్ చేసినప్పుడు కావల్సిన టార్క్ మరియు ట్రాక్షన్‌ను అందించడంలో ఈ ప్రత్యేకమైన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.

లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో లాంబోర్గినీ కార్యకలాపాలు షురూ!

భారత్‌లో లాంబోర్గినీ కార్యకాలాపాలు పునఃప్రారంభించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సూపర్‌కార్ సెగ్మెంట్లో లాంబోర్గినీ కార్లను కొనాలనుకునే కస్టమర్లు ఇది గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. కోవిడ్-19 పరిస్థితుల అనంతరం దేశంలో అనేక ఆటోమొబైల్ కంపెనీ ఒక్కక్కటిగా రీఓపెన్ అవుతూ వస్తున్నాయి. మరోవైపు కస్టమర్లు కూడా వ్యక్తిగత ప్రయాణాలకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే, త్వరలోనే ఆటోమొబైల్ పరిశ్రమ తిరిగి జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Italian supercar manufacturer, Lamborghini, has announced a resumption of operations across all its dealerships and workshops across the country. The brand was running operations via a work from home arrangement over the last couple of months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X