మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

భారతదేశపు ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ అధికారిక వెబ్‌సైట్ నుండి టియువి300 మోడల్‌ను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే బ్రాండ్ లైనప్ నుంచి మహీంద్రా టియువి300 ఎస్‌యూవీని శాశ్వతంగా నిలిపివేయవచ్చని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బిఎస్ 6 అప్‌డేట్ వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు.

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

మహీంద్రా టియువి300 మోడల్‌ను తొలిసారిగా 2015లో భారత మార్కెట్లో విడుదల చేశారు. ట్యాంక్-బిల్ట్ ఎస్‌యూవీగా తయారు చేసిన టియువి300 మోడల్‌ను భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2019లో, మహీంద్రా టియూవి300ను మరోసారి అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా, కొత్త టియువి300లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసి సరికొతత్ ఫీచర్లను, పరికాలను జోడించింది.

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

మహీంద్రా ఇప్పటికే తమ 'నువోస్పోర్ట్' ఎస్‌యూవీని భారత మార్కెట్లో నిలిపివేసింది. ఆ మోడల్ తర్వాత టియువి300 మరియు దాని బిగ్ బ్రదర్ అయిన 'టియువి300 ప్లస్' మోడళ్లను కంపెనీ నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ విక్రయిస్తున్న 'మహీంద్రా ఎక్స్‌యూవీ300' ఇప్పటికే మార్కెట్లో మంచి సక్సెస్‌ను సాధించి, మహీంద్రాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది.

MOST READ: లాక్‌డౌన్‌లోనూ పెరిగిన మహీంద్రా ట్రాక్టర్ సేల్స్

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 గడచిన మే 2020 నెలలో కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్-ఎస్‌యూవీగా నిలిచింది. కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత వ్యాపార కార్యకాలాపాలు ప్రారంభం కావటంతో ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రీజ్జా వంటి మోడళ్లను అధిగమించి మహీంద్రా ఎక్స్‌యూవీ300 అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది.

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

ఇక మహీంద్రా టియువి300 విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సింగిల్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి శక్తిని మరియు 1,600 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఇలా కూడా చేస్తారా..?

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

కరోనా వైరస్ వ్యాప్తి నివారణం కోసం కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా మహీంద్రా భారత మార్కెట్లో తీవ్రంగా నష్టపోయింది. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త థార్, ఎక్స్‌యూవీ500, స్కార్పియో మోడళ్లతో సహా పలు ఇతర ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయడాన్ని కూడా కంపెనీ వాయిదా వేసింది.

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

మహీంద్రా ఇప్పటికే తమ నెక్స్ట్ జనరేషన్ ఎక్స్‌యూవీ500, సరికొత్త స్కార్పియో మోడళ్ల విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ప్రకచించిన సంగతి తెలిసినదే - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: రాపిడ్ రెస్పాన్స్ మొబైల్ లాబొరేటరీ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ?

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

కాగా.. సరికొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూనీ మాత్రం ఈ ఏడాది చివరికే విడుదల చేస్తామని మహీంద్రా ధృవీకరించింది. వాస్తవానికి ఈ ఐకానిక్ ఆఫ్-రోడర్ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, రెండు నెలలకు పైగా ఉత్పత్తి నిలిచిపోవటంతో విడుదల వాయిదా పడింది - మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

మహీంద్రా వెబ్‌సైట్‌లో కనిపించని టియువి300.. డిస్‌కంటిన్యూ అయ్యిందా?

మహీంద్రా టియువి300 మోడల్ డిస్‌కంటిన్యూపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా టియువి300 ఎస్‌యూవీ గతన 2015 నుండి భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. అయినప్పటికీ, ఈ ఎస్‌యూవీ యొక్క బాక్స్ టైప్ డిజైన్ ప్రజలలో పెద్దగా ప్రాచుర్యం పొందలేకపోయింది. మహీంద్రా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ మోడల్ తొలగిపోవటాన్ని చూస్తుంటే, కంపెనీ ఇందులో ఇకపై బిఎస్ 6 ఇంజిన్‌ను అప్‌డేట్ చేస్తుందా లేదా ఇంతటితో టియువి300 కథ ముగిసిందా అనేది ఆసక్తిగా మారింది.

Most Read Articles

English summary
Mahindra has removed the TUV300 from their official website. This indicates that the Mahindra TUV300 could be discontinued permanently from the brand's lineup. There are also no indications of any BS6 update for the compact-SUV as well. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more