వి-క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

భారతదేశంలో అత్యంత లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి ఇప్పటికే విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ నుంచి ఇంకో లగ్జరీ కారు 2020 ఆటో ఎక్స్‌పోలో విడుదలయింది. దాని పేరే మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కో పోలో. బెంజ్ మార్కోపోలో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందా!

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ నుంచి విడుదలైన మార్కోపోలో కారు లాగ మాత్రమే కాదు, ఒక చిన్న ఇంటిని తలపిస్తుంది. ఇది చాలా విలాసవంతగా వినియోగదారునికి అనుకూలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చక్రాలపై ఒక ఇల్లులాగా ఉంటుంది.

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మార్కోపోలో కార్ సాధారంగా వుండే వాటికంటే కూడా కొంత అదనంగా ఉంది. మార్కోపోలో ధర రూ. 1.38 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది ఎలైట్ వేరియంట్ కంటే ఎక్కువధరను కలిగి ఉంది.

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

మార్కోపోలో బహిరంగ ప్రదేశాలలో క్యాంప్ లాగ ఉపయోగపడుతుంది. ఇది నలుగురు వ్యక్తులకు వసతి కల్పించగలదు. టాప్-స్పెక్ వి-క్లాస్ మార్కో పోలో సోఫా-కమ్-బెడ్, వార్డ్రోబ్, ఫోల్డ్-అవుట్ టేబుల్, 40-లీటర్ ఫ్రిజ్ మరియు చిన్న కిచెన్‌ కూడా ఉంటుంది. కానీ బెంజ్ యొక్క ఎంట్రీ లెవల్ హారిజోన్ స్పెక్‌లో కిచెన్, వార్డ్రోబ్‌ వంటి సౌకర్యాలు ఉండవు.

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

మార్కో పోలో 2.0-లీటర్, నాలుగు సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 163 హెచ్‌పి మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జత చేయబడింది.

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

కొలతల పరంగా మార్కో పోలో V- క్లాస్ యొక్క లాంగ్-వీల్ బేస్ వెర్షన్ (V- క్లాస్ ఎలైట్ మాదిరిగానే) పై ఆధారపడి ఉంటుంది. ఇది 5,140 మిమీ పొడవు, 1,928 మిమీ వెడల్పు, 1,901 మిమీ ఎత్తు, మరియు 3,200 ఎంఎం వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది.

వి- క్లాస్ మార్కో పోలోని ఆవిష్కరించిన మెర్సిడెస్ బెంజ్

బెంజ్ నుంచి విడుదలైన మార్కోపోలో లగ్జరీ క్యాంపర్‌కు ప్రత్యక్ష పోటీదారులు లేరు. మినీ-హోమ్ కోసం వెతుకుతున్న కస్టమర్ల ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Most Read Articles

English summary
Mercedes-Benz V-class Marco Polo is your home on wheels. Read in Telugu.
Story first published: Thursday, February 6, 2020, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X