కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

బ్రిటీష్ కార్ల తయారీదారు అయిన ఎంజి మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన అతి తక్కువకాలంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఎంజి మోటర్స్ ఆవిష్కరించిన వాహనాలు మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని పొందాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో కొత్త వాహనాన్ని ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరింవచింది. ఈ కొత్త వాహనం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

ఆటో ఎక్స్‌పో 2020 లో ఎంజి మోటార్స్ జి 10 కార్నివాల్ ని ఆవిష్కరించింది. ఈ ఎంజి 10 కార్నివాల్ అనేది షాంగై ఆటోమాటిక్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కింద స్థాపించబడింది.ఇది ప్రస్తుతం చైనా మరియు ఆస్ట్రేలియాలో ఎల్డివి జి10 మరియు మక్సస్ జి10 గా అమ్మకానికి ఉన్నాయి.

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

ఎంజి జి 10 ఎంపివి కియా కార్నివాల్ కన్నా పెద్దదిగా ఉంటుంది. ఈవాహనం యొక్క కొలతలను గమనించినట్లయితే ఇది 5,168 మిమీ పొడవు,1,980 మిమీ వెడల్పు మరియు 1,928 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది. ఇందులో డిఫైన్డ్ బోనెట్, పెద్ద క్యాబిన్, అప్రైట్ టైల్ తో పాటు మంచి స్టైలింగ్ ని కలిగి ఉంటుంది.

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

కార్నివాల్ లో మాదిరిగా జి 10 కూడా 7 , 8 మరియు 9 సీట్ల వేరియంట్లో వస్తుంది. కానీ ఆటో ఎక్స్‌పో 2020 లో చూపించింది మాత్రం 9 సీట్ల వెర్షన్ మాత్రమే. టాప్ స్పెక్ 7 సీటర్ కార్నివాల్ లో మధ్య వరుస కెప్టెన్ కుర్చీలు కూడా ఉంటాయి. కార్నివాల్ లాగానే ఇది కూడా ఎక్కువ మంది ఒకే సారి ప్రయాణించడానికి అనుగుణంగా మరియు ప్రయాణికులగు అనుకూలంగా ఉంటుంది.

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

జి 10 యొక్క ఫీచర్స్ ని గమనిస్తే ఇందులో మల్టీ-జోన్ ఎసి, పెద్ద హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ సెన్సింగ్ టెయిల్‌గేట్ మరియు శక్తితో కూడిన సన్‌రూఫ్ వంటివి ఇందులో ఉంటాయి.

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

జి 10 ఎమ్‌పివి సాధారణంగా 2.4-లీటర్ నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 140 హెచ్‌పి మరియు 210 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.9 లీటర్ డీజిల్ ఇంజిన్ తో కూడా లభిస్తుంది. ఇందులో 6 స్పీడ్ ఆటోమేటిక్ మరియు 5 స్పీడ్ మాన్యువల్ గర్ బాక్స్ కి జత చేయబడి ఉంటుంది.

కియా కార్నివాల్ ని దెబ్బకొట్టనున్న ఎంజి జి 10

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జి 10 ఇండియన్ మార్కెట్లో విడుదలైన తర్వాత టయోటా హియాస్ మరియు హ్యుందాయ్ హెచ్ 1 స్టారెక్స్ ఎంపివిలకి ప్రత్యర్థిగా ఉంటుంది. ఎంజి జి 10 ధర దాదాపు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
MG G10 has the Carnival in it's sights. Read in Telugu.
Story first published: Saturday, February 8, 2020, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X