విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి మోటార్స్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ ఉత్పత్తి ఎమ్‌జి గ్లోస్టర్‌కు సంబంధించి తాజాగా ఇంజన్ వివరాలు వెల్లడయ్యాయి. త్వరలోనే భారత మార్కెట్లో విడుదలకానున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీ ఇప్పటికే బ్రాండ్ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

తాజాగా ఆటోకార్ ఇండియా విడుదల చేసిన సమాచారం ప్రకారం, కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌తో లభ్యం కావచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 215 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో జతచేయబడి ఉంటుంది.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆన్-డిమాండ్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఇందులో ఆటో, ఎకో, స్పోర్ట్, స్నో, మడ్, శాండ్ అండ్ రాక్ అనే వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిని నియంత్రించడానికి రోటరీ నాబ్‌తో కూడిన కంట్రోల్‌ను కూడా ఇందులో అమర్చారు. ఈ కారులో బ్రాండ్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా లభిస్తుంది.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి మోటార్స్ తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో గ్లోస్టర్ ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న మాక్సస్ డి90 మోడల్ ఆధారంగా చేసుకొని ప్రత్యేకించి భారత్ వంటి మార్కెట్ల కోసం ఎమ్‌జి గ్లోస్టర్‌ను అభివృద్ధి చేశారు.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

అంతర్జాతీయంగా మాక్సస్ డి90 ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌తో పాటుగా, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తోంది. ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్ 211 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. అయితే, భారత్‌లో గ్లోస్టర్ విడుదల సమయంలో కంపెనీ ఇందులో పెట్రోల్ ఇంజన్‌ను ఇండియా-స్పెక్ మోడళ్ల ఆఫర్ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి మోటార్స్ ఇటీవలే గ్లోస్టర్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌ను హైలైట్ చేసింది. ఈ టీజర్ వీడియోలో, డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో ఆటో పార్క్ అసిస్ట్‌ను ఉపయోగించి పెద్ద గ్లోస్టర్ ఎస్‌యూవీని విజయవంతంగా పార్క్ చేయటాన్ని చూడొచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

గ్లోస్టర్ ఎస్‌యూవీలో బ్రాండ్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్)ను కలిగి ఉంటుంది. ఇందులో పార్కింగ్ అసిస్ట్, ఆటో బ్రేకింగ్, కొల్లైజన్ అవైడెన్స్ సిస్టమ్ వంటి యాక్టివ్ మరియు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:మూలికా పెట్రోల్ తయారీకి కేరళ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఈ ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేయబడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, కారులోకి సులువుగా ప్రవేశించేందుకు మరియు బటకు వచ్చేందుకు అనువుగా ఏర్పాటు చేసిన సైడ్‌స్టెప్, రూఫ్ రైల్స్ మరియు బూట్ లిడ్‌పై బోల్డ్‌గా అంటించిన ‘గ్లోస్టర్' బ్యాడ్జ్‌లు ఉంటాయి.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

గ్లోస్టర్ యొక్క ఇంటీరియర్స్ అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మరియు బ్రాండ్ యొక్క సరికొత్త ‘ఐస్‌మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

అంతేకాకుండా, పానోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి మరియు లేన్ చేంజింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది.

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి గ్లోస్టర్ చూడటానికి ఫోర్డ్ ఎండీవర్, టొయోటా ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటుంది. అయితే, గ్లోస్టర్ మాత్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఫీచర్‌లను కలిగి ఉండి ఈ విభాగంలో జీప్ గ్రాండ్ చెరోకీ, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో మరియు వోల్వో ఎక్స్‌సి 90 వంటి ఖరీదైన మోడళ్లకు ధీటుగా ఉంటుంది.

MOST READ:లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

విడుదలకు ముందే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఇంజన్ వివరాలు లీక్!

ఎమ్‌జి గ్లోస్టర్ ఇంజన్ వివరాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి గ్లోస్టర్ శక్తివంతమైన ఇంజన్, లెవల్ 1 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో పాటు అనే డ్రైవర్-అసిస్టెడ్ సిస్టమ్స్ మరియు సౌకర్యవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

Source: Autocar India

Most Read Articles

English summary
MG Motor India is preparing for its biggest launch of the year 2020 with the Gloster SUV. It will be arriving during Diwali (November) festival in the Indian market. The Gloster will be placed in the premium luxury SUV segment and will the brand's flagship model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X