మార్కెట్లోకి ఎంజీ గ్లోస్టర్: టయోటా ఫార్చ్యూనర్‌కు ఇక దినదిన గండమే!

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సంస్థలలో ఎంజి మోటార్స్ ఒకటి. ఇతి భారతదేశంలో ప్రవేశించిన అనతికాలంలోనే బాగా అమ్మకాలను సాగించింది. ఎంజి బ్రాండ్ నుంచి వచ్చిన వాహనాలు ఇప్పటికే మార్కెట్లో సంచలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఎంజి బ్రాండ్ నుంచి గ్లోస్టర్ ఎస్‌యూవీ ప్రారంభమైంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

కొనసాగుతున్న 2020 ఆటో ఎక్స్‌పోలో ఎంజి తన మరొక బ్రాండ్ ఎంజి గ్లోస్టర్ ని ఆవిష్కరించింది. ఇది ఈ సంవత్సరంలోనే మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఎంజి గ్లోస్టర్ టయోటా ల్యాండ్ క్రూయిజర్ 200 కన్నా పొడవుగా ఉంటుంది. చూడటానికి ఇది చాల హుందాగా కనిపిస్తుంది. ఇది ఇండియన్ బ్రాండ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీలో క్రోమ్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, 255/55 ఆర్ 19 కాంటినెంటల్ టైర్లను కలిగి ఉంటుంది. క్రోమ్‌లో పెద్ద 'గ్లోస్టర్' బ్యాడ్జ్ కూడా ఉంటుంది. వీటివల్ల ఎంజి గ్లోస్టర్ మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

గ్లోస్టర్ ఎస్‌యూవీ లో క్యాబిన్ చాల విశాలంగా ఉంటుంది. మూడు వరుసల సీటింగ్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఎంజి హెక్టర్ కంటే అప్డేటెడ్ గా ఉంటుంది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ లోని ఫీచర్స్ మనం చూసినట్లయితే ఇందులో అడాప్టివ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, హీటెడ్ వింగ్ మిర్రర్, టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఇవే కాకుండా 8.0-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, కన్సెక్టెడ్ కార్ టెక్ మరియు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటివి ఉంటాయి. ముందు సీట్లకి వెంటిలేషన్ మరియు మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఇది 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. 6- స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడుతుంది. ఇది 218 హెచ్‌పి మరియు 480 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఈ 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్‌ మొదటి సారి చైనాలో జరిగిన గ్వాంగ్ జౌ మోటార్ షోలో చూపబడింది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఎంజి గ్లోస్టర్ ప్రస్తుతం గుజరాత్ లోని హలోల్ ప్లాంట్‌ లో తయారు చేస్తున్నారు. దీని ధర దాదాపు రూ. 45 లక్షల వరకు ఉంటుంది. ఎంజి గ్లోస్టర్ ఒక సారి ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

ఎంజి హెక్టర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మిడ్ సైజు ఎస్‌యూవీ విభాగాన్ని ఒక్క సారిగా కదిలించింది. ఇప్పుడు ఎంజి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో సంచలనం సృష్టిస్తుంది.

 గ్లోస్టర్ ఎస్‌యువి ని ఆవిష్కరించిన ఎంజి మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఎంజి మోటార్స్ ప్రవేశపెట్టిన గ్లోస్టర్ అప్డేటెడ్ ఫీచర్స్ తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది రూ. 45 లక్షల (ఎక్స్ షోరూం) ధరతో అందిస్తుంది. ఇది భవిష్యత్ లో ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని వాహనంగా ఉండవచ్చని అని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Big, bold MG Gloster SUV debuts at Auto Expo 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X