ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి మోటార్ ఇండియా తన హెక్టర్ బిఎస్-6 ఎస్‌యూవీని పెట్రోల్ వెర్షన్లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంజి హెక్టర్ బిఎస్ 6 పెట్రోల్‌ బేస్ వేరియంట్‌ను రూ.12.73 లక్షలకు అందిస్తున్నారు. అదే విధంగా టాప్-స్పెక్ పెట్రోల్ ట్రిమ్‌ను రూ.17.44 లక్షలకు (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) అందిస్తున్నారు.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి హెక్టర్ పెట్రోల్ వేరియంట్లను బిఎస్-4 నుంచి బిఎస్-6 కి వాటి యొక్క ధరల్లో కూడా వ్యత్యాసం ఏర్పడింది. దాదాపుగా రూ.26 వేలు పెరిగాయి. ఇందులో స్టాండర్డ్ ఇంజిన్ తో పాటు పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఎంజి హెక్టర్‌లోని పెట్రోల్ ఇంజిన్ నాలుగు ట్రిమ్లలో అందిస్తుంది. అవి స్టైల్, సూపర్, స్మార్ట్, మరియు షార్ప్ ట్రిమ్ లు.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి హెక్టర్‌లోని బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ టర్బో యూనిట్, ఇది 143 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్-4 యూనిట్ వలె అదే శక్తి మరియు టార్క్ గణాంకాలలను కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ తో జతచేయబడి ఉంటుంది.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి హెక్టర్‌ ప్రస్తుతానికి బిఎస్-4 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్ ని అందిస్తుంది. ఇందులోని ఫియట్-సోర్స్డ్ 2.0-లీటర్ డీజిల్ యూనిట్ 173 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని తొలగిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడుతుంది. జీప్ కంపాస్ మరియు టాటా హారియర్ వంటి ఇతర హెక్టర్ ప్రత్యర్థులకు శక్తినిచ్చే ఇంజిన్ కూడా ఇదే అని చెప్పవచ్చు.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి హెక్టర్ బిఎస్-6 పెట్రోల్ వెర్షన్లో చాల అప్డేట్స్ చేయబడ్డాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఎంబెడెడ్ ఇ-సిమ్ ఇందులో ఉన్నాయి. ఇందులో భద్రతా లక్షణాలు కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

ఎంజి హెక్టర్2020 ఏప్రిల్ 1 కల్లా బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా బిఎస్-6 డీజిల్ యూనిట్ ని ప్రవేశపెట్టనుంది. జీప్ కంపాస్ యొక్క దిగువ వేరియంట్లపై ఫియట్ ఇప్పటికే బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టింది.

ఇండియాలో బిఎస్-6 పెట్రోల్ వెర్షన్ ని ప్రారంభించిన ఎంజి హెక్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హెక్టర్ ఇండియన్ మార్కెట్లో ఎంజి బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్. ఇది 2019 మధ్యలో ప్రవేశపెట్టబడింది. సంస్థ ఇటీవల తన రెండవ ఉత్పత్తిని జెడ్ ఎస్ ఎలక్ట్రిక్ కారుని ప్రవేశపెట్టింది. ఎంజి హెక్టర్, కియా సెల్టోస్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
MG Hector BS6 Petrol Launched In India: Prices Start At Rs 12.74 Lakh. Read in Telugu.
Story first published: Saturday, February 1, 2020, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X