భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, దేశీయ విపణిలో తమ మూడవ మోడల్ 'హెక్టర్ ప్లస్‌'ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. భారతదేశం కోసం హెక్టర్ ప్లస్ ఉత్పత్తి ప్రారంభించినట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఎంజి హెక్టర్ ప్లస్ ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది.

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

గాడివాడి ప్రచురించిన కథనం ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ తమ కొత్త ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని జూలై 1, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని తొలిసారిగా గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఇది మార్కెట్లోకి వస్తుందని అందరూ భావించారు, కాకపోతే కరోనా కారణంగా ఇది ఆలస్యమైంది.

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి పొడగించబడిన వెర్షన్ ఈ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ. ఈ రెండు మోడళ్లలో వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ హెక్టర్ ప్లస్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో పలు మార్పులు చేర్పులు చేయనుంది.

MOST READ: ఈ ఎయిర్‌బ్యాగ్స్‌తో తల, మెదడు భద్రం - అక్యురా కొత్త ప్రయోగం!

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

ఇందులో అప్‌డేట్ చేసిన గ్రిల్, హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్స్, బూట్-లిడ్ డిజైన్లు మారే అవకాశం ఉంది. ఇందులో చాలా ముఖ్యమైన మార్పు క్యాబిన్‌లో ఉండనుంది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మూడవ వరుసలో సీటింగ్ ఉంటుంది. రెండవ వరుసలో బెంచ్ సీట్ లేదా ఇండివిడ్యువల్ కెప్టెన్ సీట్లతో ఇది లభ్యం కానుంది.

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

ఫైవ్ సీటర్ ఎమ్‌జి హెక్టర్ మాదిరిగానే ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో కూడా ఒకే రకమైన ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఇందులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ 140 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పిల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లభించే అవకాశం ఉంది.

MOST READ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బైక్‌లు, కార్లు ఎలా ఉన్నాయో చూసారా ?

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

హెక్టర్‌తో పోల్చుకుంటే హెక్టర్ ప్లస్‌లో ఇతర ఫీచర్లు మరియు పరికరాలు కూడా ఉంటాయి. ఇందులో ప్రీమియం అప్‌హెలెస్ట్రీ సీట్లు, లేటెస్ట్-జెన్ ఐస్మార్ట్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ విడుదల తేదీ ఖరారు - ఫీచర్లు, వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ విడుదల తేదీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పూర్తి పోటీతో కూడుకున్న ఫుల్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలా వస్తున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని కంపెనీ సరసమైన ధరకే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ .13 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. భారత్‌లో విడుదలైతే ఈ సెగ్మెంట్లోని టొయోటా ఇన్నోవా క్రిస్టాతో పాటు టాటా గ్రావిటాస్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఏడు సీట్ల ఎస్‌యూవీలతో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ పోటీ పడే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
MG Motor India is all set to introduce its third model, the Hector Plus in the Indian market. The new MG Hector Plus once launched in India, will be offered in both six and seven-seater configurations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X