Just In
Don't Miss
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Finance
చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!
- News
నటి శ్రీసుధపై వేధింపుల కేసు... కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుకి సుప్రీం కోర్టు నోటీసులు...
- Movies
'పంట చేతికొచ్చింది' అంటున్న శర్వానంద్.. శ్రీకారం సిద్దమైంది!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎమ్‌జి హెక్టర్ 25,000 మార్క్
చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా, గతేడాది ఇదే సమయంలో భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ తాజాగా మార్కెట్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకిటించింది. కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఎమ్‌జి హెక్టర్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 25,000 లకు పైగా యూనిట్లను విక్రయించింది.

భారత్‌లో ఎమ్‌జి హెక్టర్ ఈ సేల్స్ మైల్‌స్టోన్‌ను చేరుకోవటానికి సుమారు ఏడాది సమయం పట్టింది. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నెట్ కార్ అనే క్యాప్షన్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫుల్లీ ఫీచర్డ్ కారు కొనుగోలుదారులను చక్కగా ఆకర్షిస్తోంది. మరోవైపు, ఇందులోనే విడుదలైన 7 సీటర్ వెర్షన్ ఎమ్‌జి హెక్టర్ ప్లస్ మోడల్‌కు కూడా ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీని ప్రాక్టికాలిటీతో పాటు, ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి వాహనాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో తయారైన ఇందులోని టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ ఎస్‌యూవీలో ప్రైమరీ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
MOST READ:ఇది చూసారా.. హ్యుందాయ్ షోరూమ్ రిసెప్షనిస్ట్‌గా వీధి కుక్క

ఈ విభాగంలో టాటా హారియర్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడళ్లు మార్కెట్లో బాగా స్థిరపడినప్పటికీ, ఎమ్‌జి హెక్టర్ ఈ రెండు ఎస్‌యూవీలను గణనీయమైన తేడాతో అధిగమించగలిగింది. ఈ కారులో అందుబాటులో ఉన్న వివిధ రకాల పవర్‌ట్రైన్ ఆప్షన్లు కూడా దాని అమ్మకాల పనితీరుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒకటి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 143 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండ ఇంజన్ ఆప్షన్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 173 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:50 ఏళ్ల ల్యాండ్ రోవర్ నడుపుతున్న టీనేజ్ అమ్మాయి [వీడియో]

ఈ రెండింటికి అదనంగా, పెట్రోల్ ఇంజన్‌ను 48వి మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌తో కూడా అందిస్తున్నారు, ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్) ఆఫర్ చేస్తుంది. అన్ని ఇంజన్ ఆప్షన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. హైబ్రిడ్ కాని పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆప్షనల్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ప్రస్తుతం ఈ విభాగంలో ఎమ్‌జి హెక్టర్ కాంపిటీటర్లు ఎక్కువగా డీజిల్ ఇంజన్ ఆప్షన్లను మాత్రమే అందిస్తున్నారు. అయితే, ఎమ్‌జి హెక్టర్ మాత్రం ఈ విభాగంలో మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో కొనుగోలుదారులకు తమ అవసరాలకు తగిన విధంగా ఇంజన్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
MOST READ:గాడిదలను డీలర్‌షిప్‌కు తీసుకువచ్చిన జావా బైక్ ఓనర్, ఎందుకో తెలుసా ?

ఇంటర్నెట్ కనెక్టివిటీ మరియు పవర్‌ట్రెయిన్ (ఇంజన్) ఎంపికలతో పాటు, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పానోరమిక్ సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బహుళ ఎయిర్‌బ్యాగ్స్ వంటి కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లతో ఎమ్‌జి హెక్టర్ లభిస్తోంది.

ఇతర తయారీదారుల మాదిరిగానే, ఎమ్‌జి మోటార్ ఇండియా కూడా దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి, దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్‌డౌన్‌ల కారణంగా గడచిన ఏప్రిల్ 2020 నెలలో సున్నా అమ్మకాలను నమోదు చేసింది.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని రైలు పట్టాలపై నడిచే సైకిల్

ఎమ్‌జి హెక్టర్ 25,000 సేల్స్ మార్క్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఎమ్‌జి హెక్టర్ భారత్‌కు పూర్తిగా ఓ కొత్త మోడల్ మరియు కొత్త కంపెనీ. చైనీస్ బ్రాండింగ్ మరియు ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా కొనుగోలుదారులు ఈ మోడల్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదనేది మార్కెట్ నిపుణుల విశ్లేషణ. అయినప్పటికీ, ఈ కంపెనీ తమ హెక్టర్‌లో అందిస్తున్న సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ల కారణంగా, దీని క్రమక్రమంగా గిరాకీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.