తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్స్ భారతదేశంలోనే తొలి సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ ఈవీ స్టేషన్‌ను నాగ్‌పూర్‌లో ప్రారంభించింది. ఎమ్‌జి మోటార్స్ దేశంలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి టాటా పవర్‌తో ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసినదే.

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు మెరుగైన సౌలభ్యం మరియు యాజమాన్యాన్ని సులభతరం చేయడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎమ్‌జి మోటార్స్ ఏర్పాటు చేసిన ఈ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ కేవలం ఎమ్‌జి ఎలక్ట్రిక్ కార్ల కోసం మాత్రమే కాకుండా, అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లను ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌లను CCS / CHAdeMO ఫాస్ట్ ఛార్జింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగించవచ్చు మరియు ఇది 5-వే ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను అందించడానికి ఎమ్‌జి బ్రాండ్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘనలపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఇప్పటికే 15000 మంది లిస్ట్ రెడీ

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి జిఎస్ ఎలక్ట్రిక్ కస్టమర్లు తమ ఎస్‌యూవీని ఈ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌లో కేవలం 50 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జ్ చేసుకోవ్చచు. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ ఎస్‌యూవీ అయిన ఎమ్‌జి జిఎస్ కారులో ఇతర ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. వీటిలో కస్టమర్ ఇంటి వద్ద లేదా ఆఫీస్ వద్ద ఉచిత ఏసి ఫాస్ట్ ఛార్జర్ ఇన్‌స్టాలేషన్, ఎక్స్‌టెండెడ్ ఛార్జింగ్ నెట్‌వర్క్, ఎక్కడైనా ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో కూడిన ఛార్జ్-ఆన్-ది-గో మొదలైనవి ఉన్నాయి.

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి మోటార్ ఇండియాకు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్రధాన నగరాల్లోని డీలర్‌షిప్‌లలో మొత్తం 10 సూపర్‌ఫాస్ట్ 50 కిలోవాట్ల ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. న్యూఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మరో 10 కొత్త నగరాల్లో జెడ్‌ఎస్ ఈవి ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ అమ్మకాలను కంపెనీ విస్తరించనుంది. ఫలితంగా, ఈ కొత్త డీలర్‌షిప్‌లలో కూడా సూపర్ ఫాస్ట్ 50 కిలోవాట్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాడు కానున్నాయి.

MOST READ:లాంగ్ ట్రిప్స్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇవి మరిచిపోకండి

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

టాటా పవర్, మరోవైపు, ఈజీ ఛార్జ్ బ్రాండ్ క్రింద 24 వేర్వేరు నగరాల్లో 200కి పైగా ఛార్జింగ్ పాయింట్లతో విస్తృతమైన ఈవీ ఛార్జింగ్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈవీ వినియోగదారుల కోసం ఛార్జింగ్ స్టేషన్లను కనుగొని ఉపయోగించడానికి బ్రాండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అందిస్తోంది.

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని ఈ ఏడాది జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తోంది. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ వేరియంట్ (ఎక్సైట్) ధర రూ.20.88 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌క్లూజివ్) ధర రూ.23.58 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

MOST READ:కర్ణాటకలో కొత్త హెల్మెట్ రూల్.. అదేంటో తెలుసా ?

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీలో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ 44.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి పవర్‌ను మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జీపై గరిష్టంగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

తొలి సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్‌జి మోటార్స్; ఎక్కడో తెలుసా?

ఎమ్‌జి మోటార్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు వివిధ పరిష్కారాలను అందించడంలో ఎమ్‌జి మోటార్ ఇండియా ముందంజలో ఉంది. కస్టమర్లు ఇబ్బంది లేని మరియు అనుకూలమైన యాజమాన్య అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు క్రమంగా పెరుగుతున్నాయి, ఇవి తక్కువ సమయంలో గణనీయమైన డ్రైవింగ్ పరిధిని పొందటానికి బ్యాటరీలను చార్జ్ చేయటంలో సహాయపడుతాయి.

MOST READ:గంటకు 532.93 కి.మీ వేగంతో ప్రయాణించే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్.. మీరు చూసారా

Most Read Articles

English summary
MG Motor India inaugurated the first Superfast Charging EV station in Nagpur. The company had announced its partnership with Tata Power earlier, who have signed a memorandum of understanding (MoU) to set up the superfast charging stations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X