భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' వచ్చే ఏడాది భారత్‌లోకి ప్రవేశించినున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ప్రారంభంలో భాగంగా, టెస్లా తమ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు అయిన 'మోడల్ 3'ని భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

టెస్లా ఐఎన్‌సి వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఎలన్ మస్క్, సోషల్ మీడియా వేదికగా భారత్‌లో టెస్లా బ్రాండ్ ఎంట్రీని ధృవీకరించారు. మరోవైపు, దేశంలోకి టెస్లా బ్రాండ్‌ను ఆకర్షించేందుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఈ రేసులో మహారాష్ట్ర, బెంగుళూరు మరియు తమిళనాడు ముందంజలో ఉన్నాయి.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

తాజాగా ఈటి ఆటో నుండి వచ్చిన నివేదికలు, భారత్‌లో టెస్లా ఎంట్రీ ధృవీకరణకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం, జూన్ 2021 నాటికి, టెస్లా కంపెనీ దేశంలో తమ మొట్టమొదటి కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ సెడాన్ టెస్లా మోడల్ 3‌ని ముందుగా భారత్‌కు తీసుకురానుంది. ఈ మోడల్ కోసం జనవరి 2021లో బుకింగ్‌లు కూడా ప్రారంభమవుతాయని సదరు నివేదిక చెబుతోంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

వాస్తవానికి టెస్లా ఐఎన్‌సి 2016లోనే భారతదేశంలో తొలిసారిగా తమ మోడల్ 3 కారు కోసం బుకింగ్‌లను స్వీకరించాలని యోచించింది. కానీ, అప్పట్లో దేశంలోని ఈవీ పాలసీలు మరియు అధిక దిగుమతి సుంకాల కారణంగా, భారతదేశంలో టెస్లా కార్ల విడుదల వాయిదా పడింది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

గడచిన 2016లో భారత్ నుండి టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును బుక్ చేయటానికి ప్రయత్నించిన వినియోగదారుల్లో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. వీరిలో పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, గోక్వీ ఫిట్‌నెస్ టెక్నాలజీ కంపెనీకి చెందిన విశాల్ గొండాల్ మరియు ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ వూనిక్‌కు చెందిన సుజయత్ అలీ కూడా ఉన్నారు.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

కాగా.. టెస్లా భారత్ ఎంట్రీ మరియు మోడల్ 3 లాంచ్‌కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే ఏడాది జనవరిలో తెలిసే అవకాశం ఉంది. భారత్‌లో టెస్లా లాంచ్ మరియు మోడల్ 3 కోసం బుకింగ్స్ ఖరారైన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు 2021-22 మొదటి త్రైమాసికం నుండి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

మార్కెట్లో టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారు ధర రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య (ఎక్స్‌షోరూమ్)లో ఉండొచ్చని అంచనా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టెస్లా ప్రస్తుతానికి దేశంలో ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ లేకుండా నేరుగా భారత కస్టమర్లకు తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. మరి సర్వీస్ విషయం ఏలా అనేది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారనుంది. విడుదల సమయంలో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

ఇక టెస్లా అందిస్తున్న తమ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు మోడల్ 3 విషయానికి వస్తే, ఈ కారులో కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి, ఇందులోని బ్యాటరీలు పూర్తి ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ని ఆఫర్ చేస్తాయి. ఈ కారు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

టెస్లా కార్లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి. సుధీర్ఘమైన డ్రైవింగ్ రేంజ్, అత్యుత్తమ నాణ్యత, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ వంటి అనేక ఫీచర్లతో ఇది మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది. ఈ కార్లలోని క్యాబిన్‌లో డ్యాష్‌బోర్డు మధ్యలో అమర్చబడిన ఓ పెద్ద టాబ్లెట్ లాంటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా కారులోని అనేక అంశాలను కంట్రోల్ చేయవచ్చు. కారు చార్జింగ్ స్థితి, ప్రయాణించగలిగే దూరం, సమీపంలోని చార్జింగ్ స్టేషన్ మొదలైన డ్రైవర్ ఉపయోగర సమాచారాన్ని ఇది తెలియజేస్తుంది. ఇందులోని అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో డ్రైవర్ ప్రమేయం లేకుండా కారును యాంత్రికంగా నియంత్రించవచ్చు.

Most Read Articles

Read more on: #టెస్లా #tesla
English summary
Model 3 Will Be Tesla's First Electric Car In India; Launch Timeline Revealed, Bookings, Deliveries and Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X