మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

దక్షిణ కొరియా తయారీదారు అయిన కియా చాలా తక్కువ సమయంలో దేశంలో చాలా ఎక్కువ ఆదరణను పొందింది. ఈ కియా బ్రాండ్ ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణం సెల్టోస్ ఎస్‌యూవీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎస్‌యూవీ కొనుగోలుదారులలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

కొంతమంది కొనుగోలుదారులు వారి సెల్టోస్‌ను వారి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతలకు సవరించుకోవడం ప్రారంభించారు. గతంలో కూడా వెబ్‌సైట్‌లో ఇలాంటి వాటిని కొన్నింటిని ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మనకు సెల్టోస్ విస్తృతంగా సవరించబడింది. ఇప్పుడు ఇదే దేశంలోనే అత్యంత శక్తివంతమైన సెల్టోస్.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

ఈ చిత్రంలో ఉన్న సెల్టోస్ గుర్గావ్ ఆటోబోట్స్ ఆటోమోటివ్ ద్వారా సవరించబడింది. దీనికి చేసిన మార్పులలో ప్రధానంగా 3 ఎమ్ బ్లాక్ రోజ్ ర్యాప్, 255/40 పిరెల్లి పి జీరో నీరో టైర్లతో పాటు 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

ఈ సెల్టోస్ లో ముందు మరియు వెనుక వైపు పెద్దగా మార్పులు ఏవి కనిపించవు. కానీ వెనుక భాగంలో గుర్తించబడిన ప్రధాన మార్పు ఏమిటంటే ఇది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్‌ను పొందుతుంది. ముందు మరియు వెనుక భాగంలో ఉన్న అన్ని క్రోమ్ ఇన్సర్ట్‌లు బ్లాక్ చేయబడ్డాయి. వెనుక బంపర్‌కు రిఫ్లెక్టర్ ఎల్‌ఈడీ లైట్ లభిస్తుంది.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

కానీ ఈ సెల్టోస్‌ను దేశంలో అత్యంత శక్తివంతమైనదిగా చేసే అంశం ఏమిటంటే క్వాంటం ట్యూనింగ్స్. ఇది మార్కెట్లో ప్రసిద్ధ రీమేపింగ్ బ్రాండ్లలో ఒకటి. ఈ కారు కె & ఎన్ పెర్ఫార్మెన్స్ ఫిల్టర్ మరియు రెమస్ వాల్వెట్రానిక్ ఎగ్జాస్ట్ వంటి ఇతర మార్పులను కూడా పొందుతుంది. ఈ కారు వెలుపల మరియు లోపలి భాగంలో కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్‌లను పొందుతుంది.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

ఇది ఎస్‌యూవీ యొక్క స్పోర్టి లుక్‌ని పెంచుతుంది. సెల్టోస్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 140 పిఎస్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇసియు రీమాప్ తర్వాత ఉన్న కారు ఇప్పుడు 170 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది, ఇది కారు యొక్క భారీ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

కియా సెల్టోస్ మూడు ఇంజన్ ఆప్షన్‌లో వస్తుంది. మొదటిది 1.5 లీటర్ పెట్రోల్, ఇది 114 బిహెచ్‌పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

రెండవది 1.5 టర్బో డీజిల్ యూనిట్, ఇది 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడుతుంది.

మీకు తెలుసా...ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన సెల్టోస్!

మూడవది 1.4 టర్బో పెట్రోల్, ఇది 140 పిఎస్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారుకు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కూడా ఒక ఎంపికగా లభిస్తాయి. సెల్టోస్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది.

Most Read Articles

English summary
This modified Kia Seltos is the most POWERFUL Seltos in the country. Read in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X