Just In
- 9 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 13 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా థార్‌లో సిల్వర్ కలర్ ఆప్షన్; ఫొటోలు, వివరాలు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న కొత్త 2020 థార్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. ఇటు ఆఫ్-రోడ్ అటు ఆన్-రోడ్ కస్టమర్ల నుండి ఈ మోడల్‌కు భారీ స్పందన లభిస్తోంది.

కొత్త 2020 మహీంద్రా థార్‌ను కంపెనీ దేశీయ మార్కెట్లో రూ.9.80 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదల చేశారు. ఇది ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మరియు మూడు రకాల రూఫ్ ఆప్షన్లలో (సాఫ్ట్ టాప్, హార్డ్ టాప్, మ్యాన్యువల్ కన్వర్టిబల్ టాప్) అందుబాటులో ఉంది.

కాగా, ఇప్పుడు మహీంద్రా ఓ కొత్త రకం థార్ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఆన్‌లైన్‌లో లీకైన చిత్రాలను గమనిస్తే, ఓ కొత్త సిల్వర్ కలర్ కారును కంపెనీ పరీక్షిస్తోంది. ఇప్పటి వరకూ మహీంద్రా థార్‌లో కంపెనీ సిల్వర్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టలేదు.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

ఈ చిత్రాలను గమనిస్తుంటే, త్వరలోనే మహీంద్రా థార్ సిల్వర్ కలర్‌లో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టెస్టింగ్ వాహనాన్ని మహీంద్రా పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేసింది. దీనిపై కొత్త స్టీల్ వీల్స్ డిజైన్‌ను కూడా మనం గమనించవచ్చు. మరి ఇది బేస్ వేరియంట్‌గా రానుందా లేక కేవలం సిల్వర్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే రానుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే మహీంద్రా థార్ బేస్ వేరియంట్‌లో 6-సీటర్ ఆప్షన్‌ను కంపెనీ నిలిపివేసింది. ఈ బేస్ వేరియంట్ సాఫ్ట్ టాప్ ఆప్షన్‌తో వెనుక వైపు సైడ్ బై సైడ్ ఫ్రంట్ ఫేసింగ్ సీట్ ఆప్షన్లతో 6-సీటర్ రూపంలో లభ్యమయ్యేది. సేఫ్టీ కారణంగానే కంపెనీ ఈ వేరియంట్‌ను నిలిపివేసినట్లు సమాచారం.
MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో కొత్త 2020 మహీంద్రా థార్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ టెస్టు కోసం టాప్-ఎండ్ వేరియంట్‌ను ఉపయోగించారు. బేస్ వేరియంట్‌ను ఉపయోగించలేదు. ఈ పరీక్షల్లో వయోజన మరియు పిల్లల భద్రత కోసం థార్‌కు 4 స్టార్ రేటింగ్ లభించింది.

కొత్త థార్ ఎస్‌యూవీకు కోసం ఇప్పటికే 20 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. మహీంద్రా థార్ కోసం అనూహ్యంగా పెరిగిన డిమాండ్ కారణంగా, దాని వెయిటింగ్ పీరియడ్ 9 నెలలు పెరిగినట్లు సమాచారం.
MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

మహీంద్రా థార్‌లో కొత్త 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇవి రెండూ కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మార్కెట్లో మహీంద్రా థార్ ధరలు రూ.9.80 లక్షల నుండి రూ.13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]