కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న 'టాటా నెక్సాన్' ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఇప్పటికే కొత్త టాటా నెక్సాన్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే, ఈ టీజర్‌లో కొత్త టాటా నెక్సాన్‌లో చేయబోయే మార్పుల గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

ఈ టీజర్‌లో "2 days to go, keep following to discover the #NextLevel" (2 రోజులే మిగిలున్నాయి, #తదుపరి స్థాయిని కనుగొనటానికి అనుసరించండి) అనే క్యాప్షన్‌ను ప్రచురించింది. కొత్త టాటా నెక్సాన్ ఏంటనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ, బహుశా ఇది టాటా మోటార్స్ నుండి రాబోయే డ్యూయెల్-క్లచ్ ట్రాన్స్మిషన్ (డిసిటి) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా.

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

ఒకవేళ ఇదే నిజమైతే, దేశంలో టాటా మోటార్స్ నుంచి కొత్త ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుకున్న మోడల్‌గా టాటా నెక్సాన్ నిలుస్తుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, టాటా నెక్సాన్ డిసిటి ఈ విభాగంలో తన ప్రధాన ప్రత్యర్థిగా మారనున్న కొత్త కియా సోనెట్ కంటే ముందుగానే (సెప్టెంబర్ 2న) మార్కెట్లో అమ్మకానికి సిద్ధం కానుంది.

MOST READ:ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో నానాటికీ పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ మార్కెట్లో కొత్త టాటా నెక్సాన్ డిసిటిని ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ ద్వారా కంపెనీ ఈ మోడల్ అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే, ఈ మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా సోనెట్ వస్తున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ అప్రమత్తమై నెక్సాన్ వేరియంట్లను పెంచుతున్నట్లు తెలుస్తోంది. కియా సోనెట్ బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 24 గంటల్లో 6,500 లకు పైగా బుకింగ్‌లను నమోదు చేసి రికార్డు సృష్టించింది.

MOST READ:2 కి.మీ కార్ బోనెట్ మీద వేలాడుతూ వెళ్లిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ , ఎందుకో మీరే చూడండి

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

టాటా మోటార్స్ తమ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2017 మొట్టమొదటిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇది స్థిరమైన నెలవారీ అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. కంపెనీ ఈ ఏడాది (2020)లో టాటా నెక్సాన్‌ను తమ కొత్త ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీలో భాగంగా అప్‌డేట్ చేసింది.

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. అవి: 120 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 110 బిహెచ్‌పి మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. వీటిలో ఆప్షనల్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా అందుబాటులో ఉంది.

MOST READ:లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే వారికి 5 ఉత్తమ పర్యాటక ప్రదేశాలు & ఉత్తమ బైక్‌లు ఇవే

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

టాటా నెక్సాన్‌లో కొత్తగా ప్రవేశపెట్టనున్న కొత్త డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కేవలం టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఈ మోడల్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.

కొత్త టాటా నెక్సాన్ టీజర్ లాంచ్; బహుశా ఇది డిసిటి ఆటోమేటిక్ వేరియంటా?

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ మంచి పాపులర్ మోడల్. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అయితే, రాబోయే నెలల్లో మార్కెట్లో టాటా నెక్సాన్‌కు కొత్తగా టొయోటా అర్బన్ క్రూయిజర్, కియా సోనెట్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కొత్త పోటీదారులు రాబోతున్నారు.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Most Read Articles

English summary
Tata Motors has released teasers for their Nexon SUV in the Indian market. These teasers showcase just the Nexon SUV, indicating an update in some form. The images just reads, "2 days to go, keep following to discover the #NextLevel". Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X