టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న యారిస్ సెడాన్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ యారిస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ విడుదల చేసింది.

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

"టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్" పేరిట విడుదల కానున్న ఈ కొత్త మోడల్‌లో, స్టాండర్డ్ యారిస్‌తో పోల్చుకుంటే అనేక కాస్మెటిక్ మార్పులు ఉండనున్నాయి. టొయోటా తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన తాజా చిత్రాల ప్రకారం, ఈ లిమిటెడ్ ఎడిషన్ యారిస్ బ్లాక్ కారు లోపలి మరియు వెలుపల బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంది.

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

ముందుగా టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇది పూర్తిగా బ్లాక్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. అక్కడక్కడా క్రోమ్ గార్నిష్‌ను కూడా చూడొచ్చు. ఇందులో ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లాంప్స్‌పై క్రోమ్ గార్నిష్ ఉంటుంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

ఈ లిమిటెడ్ ఎడిషన్ సెడాన్ మోడల్‌లో కొత్తగా డిజైన్ చేసిన 15 ఇంచ్ 6-స్పోక్, డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో చేసిన మార్పులు ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు, ఈ మోడల్ విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

ప్రస్తుతం టొయోటా యారిస్ కేవలం ఒకే ఒక సింగిల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 106 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సూపర్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త లిమిటెడ్ ఎడిషన్ టొయోటా యారిస్ బ్లాక్ వేరియంట్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా. అలాగే, ప్రస్తుతం యారిస్‌లో లభిస్తున్న అన్ని రకాల ఫీచర్లు, పరికరాలు యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్‌లో కూడా కొనసాగే అవకాశం ఉంది.

MOST READ:ఒకే ఇంట్లో మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఎదో తెలుసా ?

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

టొయోటా యారిస్ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, రూఫ్-మౌంటెడ్ ఎయిర్-వెంట్స్, యాంబియంట్ ఇల్యూమినేషన్, 8-వే అడ్జస్టబల్ పవర్ డ్రైవర్ సీట్ మరియు గెశ్చర్ కంట్రోల్స్‌తో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

భద్రతా ఫీచర్ల విషానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్ కట్ ఆఫ్‌తో కూడిన సౌర శక్తిని గ్రహించే ఫ్రంట్ విండ్‌షీల్డ్, గ్లాస్-హై సోలార్ ఎనర్జీ అబ్జార్బింగ్ (హెచ్‌ఎస్‌ఇఎ) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్) ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

టొయోటా ఇటీవలే దేశీయ విపణిలో యారిస్ సెడాన్ ధరలను పెంచింది మరియు కొన్ని ఇందులో వేరియంట్లను కూడా తొలగించింది. వేరియంట్‌ను బట్టిన ఈ మోడల్ ధరలు రూ.1000 నుండి రూ.1.68 లక్షల మధ్యలో పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత, టొయోటా యారిస్ ఇప్పుడు రూ.8.86 లక్షల నుండి రూ.14.30 లక్షల మధ్యలో అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

మరికొద్ది రోజుల్లోనే టొయోటా తమ కొత్త యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని స్టాండర్డ్ మోడల్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి, దీని ధర కూడా ప్రస్తుత టాప్-ఎండ్ వేరియంట్ యారిస్ ధర కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ వివరాలు వెల్లడి; త్వరలో విడుదల

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టొయోటా యారిస్ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ మోడల్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉండి, ఈ మోడల్‌కు మరింత ప్రీమియం రూపాన్ని అందిస్తుంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కస్టమర్లు మరింత ఆకర్షించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors (TKM) will be launching a new limited edition variant of the Yaris sedan in the Indian market. Called the 'Limited Edition Black', the new variant will feature a host of cosmetic changes over the standard model. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X