మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెంటల్ కంపెనీ 'మైల్స్ కార్' (MylesCar) ఇప్పుడు తాజాగా తమ కార్ కలెక్షన్‌లో పాపులర్ ఎమ్‌జి హెక్టర్ (MG Hector) కారును జోడించింది. నెలవారీ చందా ప్రాతిపదికన నెలకు రూ.40,000 అద్దెతో కస్టమర్లు ఈ పాపులర్ ఎస్‌యూవీని అద్దెకు తీసుకోవచ్చు. ఈ కంపెనీ అందిస్తున్న ఇతర బ్రాండ్ వాహనాలతో పోల్చుకుంటే ఈ ఎమ్‌జి బ్రాండ్ సబ్‌స్క్రిప్షన్‌లో మైల్స్ కార్ అనేక సదుపాయాలను కల్పిస్తోంది.

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

మైల్స్ కార్ నుంచి ఈ హెక్టర్ కారును రెంట్‌కి తీసుకోవాలనుకునే కస్టమర్లకి కంపెనీ కనీసం 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకూ సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే మైల్స్ కార్ నుంచి వేరే బ్రాండ్ వాహనాలను అద్దెకు తీసుకున్న కస్టమర్ల కోసం కూడా కంపెనీ ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటించింది.

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ కోసం మైల్స్ కార్ నుంచి రెంటల్ ప్యాకేజ్ రూ.40,000 నుంచి ప్రారంభం అవుతుంది. నడిపిన కిలోమీటర్ల దూరాన్ని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది. ప్రైవేట్‌గా రిజిస్టర్ చేయబడిన కార్లను అందిస్తున్న మైల్స్ కార్ కార్లన్నీ కూడా పూర్తిగా బంపర్ టూ బంపర్ ఇన్సూర్ చేయబడి ఉంటాయి. ఇందులో భాగంగానే ఉచిత మెయింటినెన్స్, ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందిస్తోంది. అంతేకాకుండా, ఈ సంస్థ నుంచి కార్లను అద్దెకు తీసుకున్న వారికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఇకపై ఇ-చలాన్ మాత్రమే, ఎక్కడో తెలుసా ?

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

పూనే, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ మరియు చెన్నై నగరాల్లో ఉన్న కస్టమర్లకి ఎమ్‌జి హెక్టర్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారును రెంట్‌కి తీసుకోవాలనుకునే కస్టమర్లు ఎమ్‌జి మోటార్స్ ఇండియా నుండి కొత్త మరియు వాడిన కార్లను ఎంపిక చేసుకునే వెసలుబాటు ఉంటుంది.

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

ఇలా కస్టమర్లు ఒక్కసారి తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకున్న తర్వాత వెరిఫికేషన్ కోసం కొన్ని రకాల డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ చెల్లించిన తర్వాత కస్టమర్‌కి మైల్స్ కార్‌కి మధ్య ఓ కాంట్రాక్ట్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే, మైల్స్ కార్ సంస్థ నేరుగా కస్టమర్ ఇంటికే తాము మెచ్చిన వాహనాన్ని పూర్తిగా శానిటైజ్ చేసి డెలివరీ చేస్తుంది.

MOST READ:జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

మైల్స్ కార్ గురించి..

మైల్స్ కార్ సంస్థ గత నవంబర్ 2013 నుంచి కార్ రెంటల్ వ్యాపారం చేస్తోంది. కార్జ్ఆన్‌రెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీని మాతృ సంస్థ. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ కార్ల వరకూ దాదాపు అన్ని రకాల మోడళ్లను ఈ కంపెనీ రెంట్ కోసం అందుబాటులో ఉంచింది.

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

అసెట్-లైట్ అనే ఆప్షన్ ద్వారా ఇటు కార్ కంపెనీల నుండి అటు స్వతంత్ర వ్యక్తుల నుండి వాహనాలను సేకరించి అద్దెకు ఇస్తున్న ఏకైక కార్ రెంటల్ కంపెనీ మైల్స్ కార్. ఇది మార్కెట్లో జూమ్‌కార్, రెవ్, డ్రైవ్ఈజీ వంటి సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్ కంపెనీలకు పోటీ ఇస్తుంది.

MOST READ:సూపర్‌ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటుచేయడానికి టాటా పవర్‌తో చేతులు కలిపిన ఎంజి మోటార్

మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

మైల్స్ కార్ ఎమ్‌జి హెక్టర్ సబ్‌స్క్రిప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ ప్రారంభ ధర రూ.12 లక్షలకు పైనే ఉంది. భారీ మొత్తంలో ధనాన్ని వెచ్చించి ఈ కారును కొనుగోలు చేయలేని కస్టమర్లు ఏదో కొద్ది నెలల పాటు ఈ కారును నడిపిన అనుభూతిని పొందాలనుకుంటే మాత్రం మైల్స్ కార్ అందిస్తున్న ఈ సబ్‌స్క్రిప్షన్ ఓ చక్కటి ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. కస్టమర్లు తమ జేబు నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కేవలం సబ్‌స్క్రిప్షన్ మొత్తంతోనే పూర్తి భీమా, రోడ్‌సైడ్ సేవలు, మెయింటినెన్స్ సదుపాయం వంటి పొందవచ్చు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కొత్త కారుపై ఇన్వెస్ట్ చేయకుండా, స్వంత వాహనాల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి లాంగ్ టెర్మ్ కార్ రెంటల్స్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

Most Read Articles

English summary
MylesCar, a self-driven car rental company has announced an addition of the MG Hector to its current fleet that it offers to customers on a subscription basis. The MG subscription model that the brand offers is different compared to other packages that are on offer. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X