ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ నుంచి, భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఒకటి. భారతదేశం వేదికగా ఆగస్ట్ 7న ఈ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో, కియా మోటార్స్ ఇండియా తమ సోనెట్ ఎస్‌యూవీకి సంబంధించి తాజాగా తొలి ప్రొడక్షన్ రెడీ టీజర్ ఇమేజ్‌ను విడుదల చేసింది.

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

ఈ టీజర్ ఫొటోలో ఉత్పత్తికి దగ్గరగా ఉన్న కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని చూడొచ్చు. కియా మోటార్స్ తమ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీకి దిగువన సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించిన తర్వాత, ఈ కొత్త సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత్‌లో ఆగస్ట్ నెలాఖరులో కానీ లేదా సెప్టెంబర్ ప్రారంభంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

ఈ కొరియన్ బ్రాండ్‌కు కియా సోనెట్ భారత మార్కెట్లో మూడవ మోడల్ అవుతుంది. ప్రస్తుతం దేశీయ విపణిలో కియా మోటార్స్ సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మరియు కార్నివాల్ ఎమ్‌పివిని విక్రయిస్తోంది. ఈ రెండూ కూడా ఇప్పటికే భారత మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకున్నాయి. కియా మోటార్స్ ఇండియా లైనప్‌లోని సెల్టోస్ బ్రాండ్ క్రింద ఎంట్రీ లెవల్ మోడల్‌గా సోనెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కారును కూడా అంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.

MOST READ:11 కోట్ల విలువైన 112 కార్లు దొంగలించిన ఎంబీఏ డిగ్రీ హోల్డర్ ముఠా, తర్వాత ఏం జరిగిందంటే

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

కియా సోనెట్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కియా సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ కారుకి బోల్డ్ అండ్ అగ్రెసివ్ లుక్‌నిస్తుంది. వీటితో పాటు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, చంకీ బాడీ క్లాడింగ్ ఉంటాయి.

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అనేక ఫీచర్లు మరియు పరికరాలతో తయారు చేయనున్నారు. ఈ విభాగంలో ఇది చాలా స్పోర్టీ మరియు ప్రీమియం ఆకర్షణను ఆఫర్ చేసేలా ఉందులో బ్రాండ్ యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:స్కొడా స్లావియా రోడ్‌స్టర్ కారు ఆవిష్కరణ, తయారు చేసింది ఎవరో తెలుసా?

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

ఇంజన్, గేర్‌బాక్స్ విషయానికి వస్తే, కియా భాగస్వామి హ్యుందాయ్ తమ వెన్యూ మోడల్‌లో ఉపయోగిస్తున్న వాటిని ఈ కొత్త సోనెట్‌లోనూ ఉపయోగించవచ్చని సమాచారం. ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉండొచ్చని అంచనా. ఈ ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్, సెవన్-స్పీడ్ డిసిటి మరియు హ్యుందాయ్ తాజాగా పరిచయం చేయనున్న ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వంటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

ఈ టీజర్ ఫొటోను విడుదల చేసిన సందర్భంగా, కియా మోటార్స్ కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కియా డిజైన్ సెంటర్ హెడ్ కరీం హబీబ్ మాట్లాడుతూ.. "కొత్త కియా సోనెట్‌ కాంపాక్ట్ ఎస్‌యూవీని చాలా పెద్ద వాహనాల్లో మాత్రమే కనిపించేలా గంభీరమైన లుక్‌తో తయారు చేయాలని భావించాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ కారుకి ప్రత్యేకమైన స్పోర్టి వైఖరి, ధృడమైన లుక్, డైనమిక్ సిల్హౌట్‌తో రూపొందించాము" అని అన్నారు.

MOST READ:డుకాటీ పానిగలే వి 2 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా ?

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

"మేము కొత్త కియా సోనెట్ డీటేలింగ్స్‌లో ఎక్కడా రాజీపడకుండా, ప్రత్యేక శ్రద్ధతో తయారు చేశాము. మా డిజైనర్లు భారతదేశం అంతటా కనుగొన్న గొప్ప సాంస్కృతిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన రంగులు మరియు పదార్థాల కలయితో దీనిని రూపొందించారు. మొత్తమ్మీద, కొత్త కియా సోనెట్ ఒక అద్భుతమైన ఎస్‌యూవీగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. కియా సోనెట్ భారతదేశంలోని యువతను మరియు యువ హృదయాలను ఖచ్చితంగా ఆకర్షిస్తుందని" ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ - ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

కియా సోనెట్ ప్రొడెక్షన్ రెడీ టీజర్ ఇమేజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో కియా సోనెట్‌ ఒకటి. ప్రత్యేకించి కియా సెల్టోస్ మిడ్-సైడ్ ఎస్‌యూవీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో, సోనెట్ కారుపై మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెల్టోస్ మాదిరిగానే సోనెట్ కారును కూడా కియా చాలా పోటీతత్వ ధరతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారం దీని ధర సుమారు రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

MOST READ:2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

Most Read Articles

English summary
Kia Motors India has officially released the first official teaser rendering of the production-ready Sonet Compact-SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X