వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

స్కోడా ఆటో కంపెనీ పవర్‌ఫుల్ ఆక్టావియా ఆర్ఎస్ కారును ఇండియాకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియం కార్ల తయారీ దిగ్గజం స్కోడా ఎట్టకేలకు తమ మోస్ట్ పవర్‌ఫుల్ ఆక్టావి ఆర్ఎస్ 245 వేరియంట్‌ను దేశీయంగా విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంభందించిన వీడియోను కూడా ఇటీవల రిలీజ్ చేసింది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

ఆడి, మెర్సిడెస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కార్లను ఎవరైనా కొంటారు.. కానీ స్టేటస్ చూపించాలనుకునే కస్టమర్ల మాత్రం ఇలాంటి అత్యంత అరుదైన కార్లను కొంటారు. అవును, మీరు చదివింది నిజమే, అత్యంత అరుదైన ఆక్టావియా ఆర్ఎస్ ఎంతో ప్రత్యేకం. స్కోడా కూడా కేవలం 200 కస్టమర్లకు మాత్రమే దీనిని విక్రయించాలనుకుంటోంది. స్టేటస్‌కు చిహ్నంగా చెప్పుకునే స్కోడా పర్ఫామెన్స్ కార్ల విషయంలో లెజండ్ అనే ముద్ర వేసుకుంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

స్కోడా ఆటో ఈ ఆక్టావియా ఆర్ఎస్ పర్ఫామెన్స్ లగ్జరీ సెడాన్ కారును 2002లో తొలిసారిగా పరిచయం చేసింది. అత్యంత ధృడమైన బిల్ట్ క్వాలిటీ మరియు క్లాసీ లుక్ కలిగిన డిజైన్ అప్పట్లో సునామీ సృష్టించింది. స్టేటస్‌కు చిహ్నంగా చెప్పుకునే ఈ మోడల్ తర్వాత కాలంలో విఆర్ఎస్ వేరియంట్లో లాంచ్ అయ్యింది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

స్కోడా ఆక్టావియా విఆర్ఎస్ మోడల్ ఇండియన్ మార్కెట్లోకి 1.8-లీటర్ టుర్భో-పెట్రోల్ 4-సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. నమ్మశక్యంగాని ధరల శ్రేణి ఇంత శక్తివంతమైన కారును తెచ్చిన కంపెనీ కూడా స్కోడానే. అనతి కాలంలోనే ఎంతో మంది ఫేవరెట్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

ఆ తర్వాత కాలంలో స్కోడా లారా విఆర్ఎస్ మోడల్ వచ్చింది. ఇది ఆక్టావియా అంత సక్సెస్ కాకపోయినా.. పర్ఫామెన్స్ విషయంలో దీన్ని ఢీకొట్టే కారు మరొకటి రాలేదంటే నమ్మండి. కొన్నేళ్ల తర్వాత 2017లో స్కోడా ఆటో థర్డ్ జనరేషన్ ఆక్టావియా పర్ఫామెన్స్ సెడాన్ కారును విఆర్ఎస్ బ్యాడ్జ్‌లో లాంచ్ చేసింది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

స్కోడా ఆటో దీనిని ఆక్టావియా ఆర్ఎస్ 230 పేరుతో తీసుకొచ్చింది, 230 అంటే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ అని అర్థం. అంతే కాదు, కేవలం 300 కార్లను మాత్రమే ఇండియన్ మార్కెట్ కోసం కేటాయించగా.. అనతి కాలంలోనే అన్ని కార్లు అమ్ముడైపోయాయి. కస్టమర్ల నుండి ఊహించని స్పందన రావడంతో మరో 200 కార్లకు బుకింగ్స్ ప్రారంభించగా.. అవి కూడా హాట్ కేకుల్లో అమ్ముడయ్యాయి.

ఆర్ఎస్ వేరియంట్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో.. స్కోడా ఆ ప్రయత్నానికి పుల్‌స్టాప్ పెట్టలేదు. స్కోడా తమ ఆక్టావియా ఆర్ఎస్ మోడల్‌ను మళ్లీ లాంచ్ చేస్తుందని ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ పుకార్లకు పుల్‌స్టాప్ పెడుతూ.. అనుకున్నట్లుగానే దీనిని మళ్లీ లాంచ్ చేస్తున్నట్లు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

స్కోడా ఆర్ఎస్ 230 మోడల్‌ను కాకుండా ఆర్ఎస్ 245 మోడల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 230 కంటే 245 వేరియంట్ మరింత శక్తివంతమైనది. ఇందులో కూడా అదే 2.0-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

ఆర్ఎస్ 245లో వచ్చింది ఆర్ఎస్ 230 వేరియంట్లో ఉన్న ఇంజనే అయినప్పటికీ, దీని పవర్ 15పీఎస్ ఎక్కువగా ఉంది. అంటే పేరుకు తగ్గట్లుగానే ఆర్ఎస్ 245 అంటే 245పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ విషయానికి వస్తే, ఆర్ఎస్230 కంటే 20ఎన్ఎమ్ ఎక్కువగా 370ఎన్ఎమ్ వరకూ ప్రొడ్యూస్ చేస్తుంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

పవర్‌ఫుల్ సెడాన్ పవర్ అవుట్‌పుట్ మరియు ఇంజన్ రెప్సాన్ గురించి ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతగానో ఎందురుచూస్తున్నారు. ఇంజన్ వేగం 5,000 నుండి 6,700rpm మధ్య మ్యాక్సిమమ్ పవర్ మరియు టార్క్ వస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ ఫ్రంట్ వీల్స్‌కు అందుతుంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

ఇంజన్ మినహాయిస్తే, ఆర్ఎస్ 230 మరియు ఆర్ఎస్ 245 మధ్య మరో తేడా కూడా ఉంది. పర్ఫామెన్స్ మరియు హ్యాడ్లింగ్ చాలా వరకూ మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. రియర్ యాక్సిల్ వద్ద వెడల్పు 30మిమీ వరకూ పెరిగింది. దీంతో మలుపుల్లో అత్యుత్తమ స్టెబిలిటీ కలిగి ఉంటుంది.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

పర్ఫామెన్స్ విషయానికి వస్తే, 6.6 సెకండ్ల వ్యవధిలో 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్టం వేగం గంటకు 250కిలోమీటర్లుగా ఉంది. సరికొత్త టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంటీరియర్‌లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

వావ్.. ఎట్టకేలకు ఇండియాకొస్తున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్245

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆక్టావియా ఆర్ఎస్ ఒక ప్రత్యేకమైన పర్ఫామెన్స్ లగ్జరీ సెడాన్ కారు. స్టేటస్‌ను పెంచే లగ్జరీ అంశాలతో పాటు స్పోర్టివ్ మరియు పవర్‌ఫుల్ వెర్షన్ కూడా. స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 కారును 200 సంఖ్యలో మాత్రమే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.

మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే..? ఆర్ఎస్245 మోడల్‌ను దేశీయంగానే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిసింది. దీంతో ధర కూడా తక్కువగానే ఉండవచ్చు. దిగుమతి చేసుకుని విక్రయించే కార్ల పోలిస్తే, ఇండియాలో తయారయ్యే కార్ల ధరలు తక్కువగా ఉంటాయి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Octavia RS 245 Launch Confirmed With Limited Sales Of 200 Units Only In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X