కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ "స్కొడా ఆటో" భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ సెడాన్ "స్కొడా ర్యాపిడ్"లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ అని పిలువబడే 1.0 లీటర్ టిఎస్ఐ వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కొత్త స్కొడా రాపిడ్ 'రైడర్ ప్లస్' వేరియంట్ సెడాన్ లైనప్‌లో బేస్ వేరియంట్ అయిన 'రైడర్'కు ఎగువన ప్రవేశపెట్టారు. మార్కెట్లో దీని ధర రూ.7.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

బేస్ వేరియంట్ (రైడర్)తో పోలిస్తే కొత్త స్కొడా రాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్‌లో అనేక ఫీచర్లు మరియు పరికరాలు లభిస్తాయి. ఇందులో నాలుగు కలర్ ఆప్షన్స్ (క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోఫీ బ్రౌన్) కూడా ఉంటాయి.

కొత్త ‘రైడర్ ప్లస్' వేరియంట్‌లో బేస్ మోడల్‌తో పోల్చుకుంటే అనేక కాస్మోటిక్ అప్‌డేట్స్‌తో పాటుగా క్యాబిన్‌లో కొన్ని అదనపు ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇందులో నలుపు రంగులో ఉండే సిగ్నేచర్ గ్రిల్, డెకరేటివ్ సైడ్ ఫాయిల్స్, బ్లాక్-అవుట్ బి-పిల్లర్ మరియు విండో-లైన్ చుట్టూ ప్రీమియం క్రోమ్ గార్నిష్ వంటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌ను గమనిస్తే, కొత్త స్కొడా రాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ ఇప్పుడు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు స్మార్ట్-లింక్ కనెక్టివిటీతో కూడిన 6.5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. డ్యూయెల్ టోన్ ఎబోనీ శాండ్ క్యాబిన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి మార్పులు ఉన్నాయి.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్ : మహిళా ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన, ఏంటో చూసారా ?

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, స్కొడా రాపిడ్ ఇతర వేరియంట్ల మాదిరిగానే ఈ కొత్త ‘రైడర్ ప్లస్' వేరియంట్ కూడా ఒకే ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ 109 బిహెచ్‌పి శక్తిని మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసిన సందర్భంగా, స్కొడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ మాట్లాడుతూ, "స్కొడా ఆటో ఇండియా ఇటీవలే కొత్త రాపిడ్ టిఎస్ఐ శ్రేణి ఉత్పత్తులను ప్రవేశపెట్టింది, ఇందులోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 1.0 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ అసాధారణమైన శక్తిని ఉత్పత్తి చేస్తూనే అద్భుతమైన మైలేజీని కూడా ఆఫర్ చేస్తుంది. మా బ్రాండ్ విధేయులు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆటో ఔత్సాహికుల నుండి లభిస్తున్న అనూహ్య స్పందనతో మా చెక్ మార్క్‌ను యార్డ్‌స్టిక్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరియు రాపిడ్ పరిధిని విస్తృతం చేయడానికి కృషి చేస్తున్నామ"ని అన్నారు.

MOST READ:రాళ్ళలో చిక్కుకున్న ఇన్నోవా కారును బయటకు తీసిన మహీంద్రా బొలెరో [వీడియో]

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

"రైడర్ ప్లస్ వేరియంట్ అత్యంత పోటీ ధరతో బ్రాండ్ యొక్క ఎమోటివ్ డిజైన్, సున్నితమైన ఇంటీరియర్స్ మరియు క్లాస్-లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికతో రూపొందించబడినది. ఇది దాని విభాగంలో ఫంక్షనాలిటీ, ప్రాక్టికాలిటీ మరియు విశాలతకు బెంచ్ మార్కును సెట్ చేసే ఉత్తమ ఉత్పత్తిగా నిలుస్తుంద"ని ధీమా వ్యక్తం చేశారు.

కొత్త స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు

స్కొడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

స్కొడా రాపిడ్ ‘రైడర్ ప్లస్', ఈ బ్రాండ్ ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త సెడాన్ లైనప్‌లో అదనంగా వచ్చి చేరిన వేరియంట్. భారత మార్కెట్లో స్కొడా రాపిడ్ ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో మరియు కొత్తగా విడుదలైన ఐదవ తరం హోండా సిటీ సెడాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:భారతదేశంలో అతిపెద్ద బిలియనీర్ : అతను నడిపే కార్లు

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Skoda Auto has added a new variant to the recently launched Rapid 1.0-litre TSI sedan in the Indian market, called the Rider Plus. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X