ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీని 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. టాటా మోటార్స్ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం రూపొందించిన అతి చిన్న ఎస్‌యూవీని రివీల్ చేసింది. టాటా హెచ్‌బీఎక్స్ విపణిలో ఉన్న టాటా నెక్సాన్ ఎస్‌యూవీ కింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీని గురించి ఫోటోలతో సహా పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ హెచ్‌బీఎక్స్ ఎస్‌యూవీని ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ కారును నిర్మించిన ఆల్ఫా ఫ్లాట్‌ఫామ్ మీద డెవలప్ చేశారు. ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించిన టాటా హెచ్‌బీఎక్స్ ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉంది. ప్రొడక్షన్ వెర్షన్ టాటా హెచ్‌బీఎక్స్‌ కారును 2020 చివరి నాటికల్లా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

టాటా గతంలో ఆవిష్కరించిన హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా టాటా హెచ్‌బిఎక్స్ మోడల్‌ను తొలిసారిగా ప్రదర్శించారు. ఈ మినీ ఎస్‌యూవీలో ఎత్తైన బాడీ స్టైల్, టాటా హ్యారియర్ ఎస్‌యూవీ ప్రేరణతో వచ్చిన ఫ్రంట్ డిజైన్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, మరియు మెయిన్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో కింది వైపు ఆకర్షణీయంగా జోడించిన డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

టాటా హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీ ఇది వరకెన్నడూ చూడనటువంటి విభిన్నమైన డిజైన్‌లో వచ్చింది. అతి పెద్ద వీల్ ఆర్చెస్, స్టైలిష్ క్యారెక్టర్ లైన్స్, ఫ్లోటింగ్-రూఫ్, పెద్ద చక్రాలు మరియు ప్రీమియం లుక్ అందించే బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

ఇంజన్ విషయానికి వస్తే, టాటా హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో రానుంది. ఇటీవల విడుదలైన టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు నుండి ఈ ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌ను సేకరించారు.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

తొలి దశలో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లను ప్రవేశపెట్టి, మలి దశలో డిమాండును బట్టి ఆటోమేటిక్ వేరియంట్లను ప్రత్యేకంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ దాదాపు టాటా ఆల్ట్రోజ్ తరహాలోనే ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

టాటా హెచ్‌బిఎక్స్ మినీ ఎస్‌యూవీలో టాటా ఆల్ట్రోజ్ నుండి సేకరించిన ఎన్నో క్యాబిన్ ఎలిమెంట్లు వచ్చాయి. అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వస్తున్నాయి.

ఆటో ఎక్స్‌పో 2020: కేకపుట్టిస్తున్న టాటా హెచ్‌బీఎక్స్ మినీ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హెచ్‌బిఎక్స్ ఎస్‌యూవీ టాటా ప్యాసింజర్ కార్ల లైనప్‌లో నెక్సాన్ ఎస్‌యూవీ కింది స్థానాన్ని భర్తీ చేస్తుంది. అంటే, టాటా ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా హెచ్‌బిఎక్స్ మోడల్‌ను చెప్పుకోవచ్చు. ఇది విపణిలో ఉన్న రెనో క్విడ్ మరియు మారుతి ఎస్‌ప్రెస్సో వంటి మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది. టాటా ఇంకా ఎన్నో కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరిస్తోంది.. పూర్తి వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి!

Most Read Articles

English summary
tata-hbx-unveiled-at-auto-expo-launch-date-prices-specs-key-features-images-more. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X