హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

భారత మార్కెట్లో విక్రయించే ప్రముఖ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటి టాటా నెక్సాన్. ఇది ఇటీవల జరిగిన క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కారుగా ప్రసిద్ధి చెందింది. టాటా నెక్సాన్ ఈ ఏడాది బిఎస్ 6 వెర్షన్ లో పరిచయం చేయబడింది. టాటా నెక్సాన్ ఎస్‌యూవీకి 4X4 డ్రైవ్ ఫంక్షన్ రాలేదు కాబట్టి ఈ కారు ఆఫ్ రోడింగ్ కోసం తయారు చేయబడలేదు.

హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

సాధారణంగా టాటా నెక్సాన్ నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉండే కారు. అయినప్పటికీ కొంతమంది ఈ కారును ఆఫ్ రోడింగ్ లో డ్రైవ్‌ చేసి దాని సామర్థ్యాన్ని తెలిపారు. ఇటీవల టాటా నెక్సాన్ కి సంబంధించిన ఒక వీడియో వెలువడింది.

హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

ఈ వీడియోలో టాటా నెక్సాన్ యొక్క కస్టమర్ హిమాలయాలలో ఆది కైలాష్ పర్యటనకు తన కారును తీసుకువెళతాడు. ఈ యాత్రకు సంబంధించిన వీడియోను రిడీక్యూలస్లీ అమేజింగ్ యూట్యూబ్ ఛానెల్ షేర్ చేశారు. టాటా నెక్సాన్ హిమాలయాల రాతి మార్గాల్లో నడుస్తున్నట్లు వీడియోలో మనం గమనించవచ్చు.

MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

టాటా నెక్సాన్ హిమాలయాలలో కఠినమైన మార్గాలలో కూడా సజావుగా నడుస్తుందని వ్లాగర్ పేర్కొన్నాడు. మార్గం లేని ప్రదేశాలు చాలా ఉన్నాయని వీడియోలో చూపబడింది. ఈ కారు కూడా ఆ కఠినమైన మరియు క్లిష్టమైన మార్గాలను సైతం దాటుతోంది.

హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

హిమాలయాలలో మార్గాలు లోతైన అంతరాలతో నిండి ఉన్నాయని మరియు కారు కూడా వెనక్కి తిరగలేని అనేక మార్గాలు ఉన్నాయని వ్లాగర్ వివరించాడు. కారు కొన్ని సమయాల్లో క్లిష్టమైన మార్గాల్లో చిక్కుకుంటుంది. దారిలో నదులు ప్రవహించే అనేక రోడ్లు ఉన్నాయి, అటువంటి పరిస్థితిలో, కారు బయటికి రావడానికి చాలా కష్టపడాలి.

MOST READ:టాటా కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు..

టాటా నెక్సాన్ సిటీ డ్రైవింగ్ కారు మరియు నగరాల్లో నడపడానికి సరైన కారు. ఈ కారుతో కొంచెం ఆఫ్-రోడింగ్ కూడా చేయవచ్చు, కాని కారు మరింత కఠినమైన రోడ్లలో ప్రయాణించడానికి అంత అనుకూలమైనది కాదు. హిమాలయ పర్యటనలో టాటా నెక్సాన్ డ్రైవ్ చేయడం నిజంగా ఒక సవాలు లాంటిదే.

సాధారణంగా టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో అందించబడుతుంది. పెట్రోల్ వేరియంట్లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అంతే కాకుండా డీజిల్ మోడల్ లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ మోడల్స్ రెండూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి.

MOST READ:ఈ రంగంలో బెంగళూరు ప్రపంచంలోనే నెం. 1 స్థానం పొందింది ; ఏ రంగంలోనో తెలుసా ?

హిమాలయాల్లో కూడా తన సత్తా చాటుకున్న టాటా నెక్సాన్ [వీడియో]

గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ టెస్ట్‌లో టాటా నెక్సాన్‌కు 5 స్టార్ రేటింగ్ ఇవ్వబడింది. ఇది భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది మాత్రమే కాదు, ఇతర టాటా కార్లు కూడా గ్లోబల్ ఎన్‌సిఎపిలో గొప్ప పనితీరును కనపరిచింది. ఇది మాత్రమే కాకుండా టాటా కంపెనీ యొక్క టాటా ఆల్ట్రోజ్ 5 స్టార్స్, టాటా టియాగోకు 4 స్టార్స్ ఇవ్వబడ్డాయి. దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Nexon In Himalayan Drive. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X