Just In
- 9 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 13 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Lifestyle
మీకు సంతానం కలగకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా నెక్సాన్ ఈవిని ఎక్కువగా కొంటున్నారు, కారణం ఏంటంటే..?
టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు 'నెక్సాన్ ఈ.వి.' ఓ కొత్త అమ్మకాల మైలురాయిని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. టాటా మోటార్స్ నుండి లభిస్తున్న మొట్టమొదటి పూర్తి-ఎలక్ట్రిక్ కాంపాక్ట్-ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసిన 10 నెలల వ్యవధిలోనే 2000 యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది.

కాగా, టాటా నెక్సాన్ ఈవి ఇప్పుడు నవంబర్ 2020 నాటికి, మొత్తం 2200 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. నెక్సాన్ ఈవి విషయంలో టాటా మోటార్స్ తమ మొదటి 1000 యూనిట్ల మార్కును ఆగస్టులో చేరుకోగా, రెండవ 1000 యూనిట్ల మార్కును కేవలం మూడు నెలల వ్యవధిలోనే (సెప్టెంబర్ - నవంబర్) సాధించినట్లు తెలిపింది. దీన్నిబట్టి చూస్తుంటే భారతదేశంలో ఈవిలను కస్టమర్లు వేగంగా స్వీకరించడాన్ని సూచిస్తుంది.

టాటా నెక్సాన్ ఇవి ఇప్పుడు భారతదేశంలోనే ఎక్కువగా ఇష్టపడే ఎలక్ట్రిక్ కారుగా మారిందని టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా నెక్సాన్ ఇవి కూడా భారత మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేకాదు, టాటా నెక్సాన్ ఈ.వి. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ.
MOST READ:ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో తమ నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఈవీలలో ఇది ఒకటిగా కొనసాగుతోంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారులో అనేక ఫీచర్లు లభిస్తాయి. ఇందులో ప్రధానంగా కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పూర్తి-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన వాటిని చెప్పుకోవచ్చు.
MOST READ:మీకు తెలుసా.. త్వరలో మన హైదరాబాద్‌కు రానున్న కొత్త రేస్ ట్రాక్

అంతేకాకుండా, ఇందులో లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రివర్స్ పార్క్ అసిస్ట్ కెమెరా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ఎస్‌యూవీని నియంత్రించడానికి బ్రాండ్ యొక్క కనెక్టెడ్ టెక్నాలజీ మరియు 35 రకాల కమాండ్స్ కూడా ఉన్నాయి.

ఇక ఇందులోని ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఈ కారులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.
MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

నెక్సాన్ ఈవి స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని కలిగి ఉంటుంది. హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫలితంగా, బ్రేకింగ్ వేసిన ప్రతిసారి ఇందులోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, తద్వారా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది.

టాటా మోటార్స్ సర్టిఫై చేసిన దాని ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ డ్రైవింగ్ రేంజ్ అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది, ఫలితంగా వాస్తవ వినియోగంలో ఈ రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని రియల్-వరల్డ్ మైలేజ్ 250 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఉండొచ్చని అంచనా.
MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

టాటా నెక్సాన్ ఈ.వి. అమ్మకాల మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ ఇటీవలే తమ నెక్సాన్ ఈ.వి మిడ్ వేరియంట్ మరియు టాప్ ఎండ్ వేరియంట్ల ధరలను స్వల్ప తేడాతో పెంచింది. అయినప్పటికీ, ఇది దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్‌గా కొనసాగుతుంది. టాటా నెక్సాన్ ఈవి ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో మంచి డ్రైవింగ్ రేంజ్‌ని ఆఫర్ చేస్తూ, ధరకు తగిన విలువను అందిస్తుంది.